మాంచెస్టర్: ‘యాషెస్’ సిరీస్ నాలుగో టెస్టులో విజయంపై ఇంగ్లండ్ గురి పెట్టింది. మూడో రోజు ఆట ముగిసే సరికి ఆ్రస్టేలియా ఇన్నింగ్స్ ఓటమినుంచి తప్పించుకునేందుకు పోరాడుతోంది. రెండో ఇన్నింగ్స్‌లో ఆ్రస్టేలియా ప్రస్తుతం 4 వికెట్లు కోల్పోయి 113 పరుగులు చేసింది.
వార్నర్ (28), ఖ్వాజా (18), స్మిత్ (17), హెడ్ (1) పెవిలియన్ చేరగా...లబుషేన్ (44 నాటౌట్), మార్ష్ (1 నాటౌట్) క్రీజ్‌లో ఉన్నారు. ఆస్ట్రేలియా ఇంకా 162 పరుగులు వెనుకబడి ఉంది. అంతకు ముందు ఓవర్‌నైట్ స్కోరు 384/4తో ఆట కొనసాగించిన ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 592 పరుగులకు ఆలౌటైంది.
హ్యారీ బ్రూక్ (61), బెన్ స్టోక్స్ (51) అర్ధ సెంచరీలు సాధించగా...జానీ బెయిర్‌స్టో (81 బంతుల్లో 99 నాటౌట్; 10 ఫోర్లు, 4 సిక్స్‌లు) త్రుటిలో సెంచరీ అవకాశం కోల్పోయాడు. హాజల్‌వుడ్ 5 వికెట్లు పడగొట్టగా, గ్రీన్, స్టార్క్ చెరో 2 వికెట్లు తీశారు. 99 వద్ద నాటౌట్‌గా ముగించిన ఏడో బ్యాటర్‌గా బెయిర్‌స్టో నిలిచాడు.
Comments
Please login to add a commentAdd a comment