
ధర్మశాలలో బౌన్సీ వికెట్: క్యురేటర్
నిర్ణాయక నాలుగో టెస్టు కోసం ధర్మశాలలో బౌన్సీ వికెట్‌ను సిద్ధం చేసినట్లు పిచ్ క్యురేటర్ సునీల్ చౌహాన్ వెల్లడించాడు. ‘
ధర్మశాల: నిర్ణాయక నాలుగో టెస్టు కోసం ధర్మశాలలో బౌన్సీ వికెట్‌ను సిద్ధం చేసినట్లు పిచ్ క్యురేటర్ సునీల్ చౌహాన్ వెల్లడించాడు. ‘ఈ రోజు వరకు నాకు ఈ పిచ్ కావాలని, ఇలా వుండాలని నన్నెవరూ కోరలేదు. అయితే ఇక్కడి వాతావరణ పరిస్థితులను బట్టే పిచ్‌ను తయారు చేశాను. ఇప్పుడు కూడా బౌన్సీ వికెట్‌నే రూపొందించాను.
కట్, పుల్ షాట్లు ఎక్కువగా ఆడే బ్యాట్స్‌మెన్‌కు ఇది బాగా అనుకూలిస్తుంది. గతంలో టి20లో రోహిత్ శర్మ సెంచరీ చేశాడు. మ్యాచ్ ఐదు రోజులు సాగడం తథ్యం’ అని అన్నాడు. మ్యాచ్‌లో ఫలితం వచ్చే పిచ్‌నే తయారు చేశానని పేసర్లకు ఈ వికెట్ సహకరిస్తుందన్నాడు. రంజీల్లో కూడా అదే జరిగిందని చెప్పుకొచ్చాడు.