సౌతాంప్టన్‌ టెస్ట్‌లో భారత్‌ ఓటమి | India Lossed Fourth Test Against England | Sakshi
Sakshi News home page

సౌతాంప్టన్‌ టెస్ట్‌లో భారత్‌ ఓటమి

Published Sun, Sep 2 2018 9:59 PM | Last Updated on Sun, Sep 2 2018 10:15 PM

India Lossed Fourth Test Against England - Sakshi

సౌతాంప్టన్‌: ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా 60 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఇంగ్లండ్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో 184 పరుగులకు భారత్‌ ఆలౌటైంది. దీంతో సీరిస్‌ను ఇంగ్లండ్‌ 3-1తో కైవసం చేసుకుంది. 22 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ భారత్‌కు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, రహానే జోడి కలిసి గట్టెక్కించే ప్రయత్నం చేశారు. ఈ తరుణంలో మొయిన్‌ అలీ కోహ్లి(58)ని ఔట్‌ చేసి గట్టి దెబ్బకొట్టాడు. దీంతో నాలుగో వికెట్‌ నమోదైన 101 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. మ్యాచ్‌ మనవైపు వచ్చిందనుకునే తరుణంలో మొయిన్‌ అలీ కోహ్లి వికెట్‌తో దెబ్బతీశాడు.

విరాట్‌ వెనుదిరగడంలో భారత పతనం ప్రారంభమైంది. ఆ తరువాత వచ్చిన ఆటగాళ్లు ఎవరు నిలదోక్కుకోలేకపోయ్యారు. కీలక దశలో హాఫ​ సెంచరీ పూర్తి చేసుకున్న రహానే (51)గా వెనుదిరిగాడు. కాసేపు దాటిగా ఆడిన రిషబ్‌ పంత్‌ (18) కూడా నిలువలేకపోయ్యాడు. చివర్లో అశ్విన్‌ (25) కాసేపు పోరాడాడు. ఓపెనర్లు రాహుల్‌(0), ధావన్‌ (17)లు నిరాశ పరిచారు. తొలి ఇన్నింగ్స్‌ సెంచరీతో ఆకట్టుకున్న పుజారా(5) ఈ ఇన్నింగ్స్‌లో విఫలమయ్యాడు. ఇంగ్లండ్‌ బౌలర్లలో మొయిన్‌ నాలుగు వికెట్లతో భారత పతానాన్ని శాసించాడు. ఈ నెల లార్డ్స్‌ మైదానంలో చివరి టెస్ట్‌ జరగనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement