ఆస్ట్రేలియాతో చివరి టెస్టు మ్యాచ్ కు ముందు భారత్ క్రికెట్ జట్టులో ఒకే ఒక్క ఆందోళన ఉంది. ఇక్కడ ధర్మశాలలో జరిగిన అరంగేట్రపు వన్డే, ట్వంటీ 20ల్లో భారత జట్టు ఓడి పోవడం భారత్ ను తీవ్రంగా కలవరపెట్టింది. ఇది సిరీస్ నిర్ణయాత్మక మ్యాచ్ కావడంతో ఆ పాత రికార్డు సెంటిమెంట్ భారత్ జట్టును ఆలోచనలో్ పడేసింది. అయితే ఆ రికార్డుకు ఘనంగా ఫుల్ స్టాప్ పెట్టింది భారత్. చివరిదైన నాల్గో టెస్టులో ఆసీస్ ను ఎనిమిది వికెట్ల తేడాతో ఓడించిన టీమిండియా అందుకు చరమగీతం పాడింది.