టీమిండియా నాల్గోసారి.. | india gets rare feat after clinchin series by 2-1 against australia | Sakshi
Sakshi News home page

టీమిండియా నాల్గోసారి..

Published Tue, Mar 28 2017 4:22 PM | Last Updated on Tue, Sep 5 2017 7:20 AM

టీమిండియా నాల్గోసారి..

టీమిండియా నాల్గోసారి..

ధర్మశాల:ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల సిరీస్లో భాగంగా పుణెలో జరిగిన తొలి మ్యాచ్లో భారత్ 333 పరుగుల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఆ టెస్టు మ్యాచ్లో భారత్ పూర్తిగా వైఫల్యం చెందడంతో ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. అటు బ్యాటింగ్లోనూ, ఇటు బౌలింగ్లోనూ పూర్తిగా విఫలమైన భారత జట్టు..ఆసీస్ కు దాసోహమై ఓటమి చెందింది. కాగా, ఆ తరువాత సమష్టిగా రాణించి స్వదేశంలో తమకు తిరుగులేదనిపించిన భారత్ జట్టు సిరీస్ ను సొంతం చేసుకుంది.

అయితే ఒక సిరీస్ తొలి టెస్టులో ఓటమి పాలై ఆ తరువాత సిరీస్ ను సొంతం చేసుకోవడం  భారత జట్టు క్రికెట్ చరిత్రలో ఇది నాల్గోసారి మాత్రమే. అంతకుముందు 1972-73 సీజన్లో ఇంగ్లండ్ తో జరిగిన టెస్టు సిరీస్లో, ఆ తరువాత 2000-01లో ఆస్టేలియాతో జరిగిన సిరీస్లో, 2015లో శ్రీలంకతో జరిగిన సిరీస్లో భారత్ కు ఇదే అనుభవం ఎదురైంది. ఆయా టెస్టు సిరీస్ల్లో భారత్ తొలి టెస్టులో ఓటమి పాలైన కూడా ఆపై సిరీస్లను కైవసం చేసుకుంది.


మ్యాచ్ కు సంబంధించి కొన్ని విశేషాలు..

చటేశ్వర పుజారా స్వదేశీ టెస్టుల్లో డకౌట్ కావడం ఇదే తొలిసారి. అతని కెరీర్ లో స్వదేశంలో 50 ఇన్నింగ్స్ లు ఆడిన పుజారా మొదటిసారి డకౌట్ గా నిష్క్రమించాడు. విదేశాల్లో ఆడిన 31 ఇన్నింగ్స్ ల్లో పుజారా రెండుసార్లు డకౌట్ గా అవుటయ్యాడు.

ముగ్గురు భారత బౌలర్లు స్వదేశంలో జరిగిన ఒక టెస్టు మ్యాచ్ ఒకే ఇన్నింగ్స్ లో మూడు అంతకుంటే ఎక్కువ వికెట్లను సాధించడం 2000వ నుంచి చూస్తే రెండోసారి మాత్రమే. అంతకుముందు న్యూజిలాండ్ తో ఈడెన్ గార్డెన్  లో జరిగిన టెస్టు మ్యాచ్లో భారత్ బౌలర్లు ఈ ఫీట్ ను సాధించారు.

ఈ సిరీస్ లో ఉమేశ్ యాదవ్ సాధించిన వికెట్లు 17. దాంతో ఒక సిరీస్ లో అత్యధిక వ్యక్తిగత వికెట్లను ఉమేశ్ సాధించాడు. అంతకుముందు అతని బెస్ట్(14 వికెట్లు)ను తాజాగా అధిగమించాడు.

ఈ సిరీస్ లో డేవిడ్ వార్నర్ యావరేజ్ 24.12. ఇది అతని మూడో అత్యల్ప యావరేజ్.




 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement