దక్షిణాఫ్రికా-టీమిండియాల మధ్య జరుగుతున్న నాల్గో టెస్టులో చివరి రోజు ఆట ప్రారంభమైంది.
ఢిల్లీ:దక్షిణాఫ్రికా-టీమిండియాల మధ్య జరుగుతున్న నాల్గో టెస్టులో చివరి రోజు ఆట ప్రారంభమైంది. 72/2 ఓవర్ నైట్ స్కోరుతో దక్షిణాఫ్రికా సోమవారం రెండో ఇన్నింగ్స్ ను ఆరంభించింది. టీమిండియా నిర్దేశించిన 481 పరుగుల విజయలక్ష్యంతో ఆదివారం బ్యాటింగ్ దిగిన సఫారీలు అత్యంత రక్షణాత్మక ధోరణిని అనుసరిస్తున్నారు. దక్షిణాఫ్రికా కెప్టెన్ హషీమ్ ఆమ్లా(25 బ్యాటింగ్; 229 బంతుల్లో 3 ఫోర్లు), ఏబీ డివిలియర్స్(13 బ్యాటింగ్ ; 119 బంతుల్లో 1 ఫోర్)లు ఆచితూచి బ్యాటింగ్ చేస్తున్నారు. దీంతో దక్షిణాఫ్రికా 80.0 ఓవర్లు ముగిసేసరికి రెండు వికెట్లు కోల్పోయి 76 పరుగులతో ఉంది. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి పదేపదే బౌలర్లను మార్చుతూ సఫారీలపై ఒత్తిడి తెచ్చేందుకు యత్నిస్తున్నాడు.