ఆస్ట్రేలియాపై భారత్‌ ఘన విజయం | INDIA VS AUSTRALIA 1st ODI Updates And Highlights | Sakshi
Sakshi News home page

ఆస్ట్రేలియాపై భారత్‌ ఘన విజయం

Published Fri, Sep 22 2023 2:22 PM | Last Updated on Fri, Sep 22 2023 9:52 PM

INDIA VS AUSTRALIA 1st ODI Updates And Highlights - Sakshi

Australia tour of India, 2023- India vs Australia, 1st ODI:
భారత్‌ ఘన విజయం

మొదటి వన్డేలో ఆస్ట్రేలియాపై టీమిండియా 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 48.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 277 పరుగుల లక్ష్యాన్ని చేధించింది. కేఎల్‌ రాహుల్‌ 58 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

లక్ష్యం దిశగా భారత్‌
టీమిండియా లక్ష్యం​ దిశగా సాగుతుంది. 45 ఓవర్ల తర్వాత జట్టు స్కోర్‌ 253/4గా ఉంది. మరో 24 పరుగులు చేస్తే టీమిండియా విజయం సాధిస్తుంది. కేఎల్‌ రాహుల్‌ (44), సూర్యకుమార్‌ యాదవ్‌ (40) క్రీజ్‌లో ఉన్నారు.

లక్ష్యానికి 54 పరుగుల దూరంలో ఉన్న భారత్‌
40 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్‌ 223/4గా ఉంది. భారత్‌ లక్ష్యానికి మరో 54 పరుగుల దూరంలో ఉంది. చేతిలో 6 వికెట్లు ఉన్నాయి. సూర్యకుమార్‌ యాదవ్‌ (25), కేఎల్‌ రాహుల్‌ (29) క్రీజ్‌లో ఉన్నారు. 

నాలుగో వికెట్‌ కోల్పోయిన భారత్‌.. ఇషాన్‌ ఔట్‌
185 పరుగుల వద్ద టీమిండియా నాలుగో వికెట్‌ కోల్పోయింది. పాట్‌ కమిన్స్‌ బౌలింగ్‌లో వికెట్‌కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చి ఇషాన్‌ కిషన్‌ (18) ఔటయ్యాడు. భారత్‌ లక్ష్యానికి ఇంకా 92 పరుగుల దూరంలో ఉంది. మరో 17.3 ఓవర్లు మిగిలి ఉన్నాయి. రాహుల్‌ (16), సూర్యకుమార్‌ యాదవ్‌ క్రీజ్‌లో ఉన్నారు.

25.3: మూడో వికెట్‌ కోల్పోయిన టీమిండియా
ఆడం జంపా బౌలింగ్‌లో శుబ్‌మన్‌ గిల్‌ బౌల్డ్‌(74). స్కోరు: 155/3 (25.5). రాహుల్‌, ఇషాన్‌ కిషన్‌ క్రీజులో ఉన్నారు.

రెండో వికెట్‌ కోల్పోయిన భారత్‌.. శ్రేయస్‌ రనౌట్‌
148 పరుగుల వద్ద టీమిండియా రెండో వికెట్‌ కోల్పోయింది. అనవసర పరుగుకు ప్రయత్నించి శ్రేయస్‌ అయ్యర్‌ (3) రనౌటయ్యాడు. 23.4 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్‌ 148/2గా ఉంది. గిల్‌ (72), రాహుల్‌ క్రీజ్‌లో ఉన్నారు.

తొలి వికెట్‌ కోల్పోయిన భారత్‌
142 పరుగుల వద్ద టీమిండియా తొలి వికెట్‌ కోల్పోయింది. ఆడమ్‌ జంపా బౌలింగ్‌లో రుతురాజ్‌ (71) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. 23 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్‌ 147/1. గిల్‌ (71), శ్రేయస్‌ అయ్యర్‌ (3) క్రీజ్‌లో ఉన్నారు.

కెరీర్‌లో తొలి హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్న రుతురాజ్‌
టీమిండియా ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ వన్డే కెరీర్‌లో తొలి హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 60 బంతుల్లో 7 ఫోర్ల సాయంతో రుతు ఈ మైలురాయిని చేరుకున్నాడు. 17.4 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్‌ 112/0. గిల్‌ (59), రుతురాజ్‌ (51) క్రీజ్‌లో ఉన్నారు.

హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్న గిల్‌
మాథ్యూ షార్ట్‌ బౌలింగ్‌లో వరుసగా బౌండరీ, సిక్సర్‌ కొట్టి శుభ్‌మన్‌ గిల్‌ హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 37 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో గిల్‌ ఈ మార్కును చేరుకున్నాడు. 14 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్‌ 95/0. గిల్‌ (53), రుతురాజ్‌ (40) క్రీజ్‌లో ఉన్నారు.

8 ఓవర్ల తర్వాత భారత్‌ స్కోర్‌ 43/0
277 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్‌ ఆచితూచి ఆడుతుంది. 8 ఓవర్ల తర్వాత జట్టు స్కోర్‌ 43/0గా ఉంది. రుతురాజ్‌ గైక్వాడ్‌ (17), శుభ్‌మన్‌ గిల్‌ (25) క్రీజ్‌లో ఉన్నారు. 

ఐదేసిన షమీ.. ఆసీస్‌ 276 ఆలౌట్‌
టీమిండియా ఏస్‌ పేసర్‌ మహ్మద్‌ షమీ (5/51) ఐదు వికెట్లతో రెచ్చిపోవడంతో తొలి వన్డేలో ఆసీస్‌ 276 పరుగులకు ఆలౌటైంది. షమీకి ఇవి కెరీర్‌లో అత్యుత్తమ గణాంకాలు. ఆసీస్‌ ఇన్నింగ్స్‌లో మిచెల్‌ మార్ష్‌ (4), వార్నర్‌ (52), స్టీవ్‌ స్మిత్‌ (41), మార్నస్‌ లబూషేన్‌ (39), కెమరూన్‌ గ్రీన్‌ (31), ఇంగ్లిస్‌ (45), స్టోయినిస్‌ (29) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఆఖర్లో కమిన్స్‌ (21 నాటౌట్‌) వేగంగా పరుగులు రాబట్టాడు. భారత బౌలర్లలో బుమ్రా, అశ్విన్‌, జడేజాలకు తలో వికెట్‌ దక్కాయి.

ఐదేసిన షమీ
ఈ మ్యాచ్‌లో షమీ ఐదు వికెట్లు పడగొట్టాడు. సీన్‌ అబాట్‌ (0) క్లీన్‌ బౌల్డయ్యాడు.

షమీకి నాలుగో వికెట్‌
ఈ మ్యాచ్‌లో షమీ నాలుగో వికెట్‌ తీసుకున్నాడు. షమీ బౌలింగ్‌లో సూర్యకుమార్‌ యాదవ్‌ క్యాచ్‌ పట్టడంతో షార్ట్‌ (2) పెవిలియన్‌కు చేరాడు. 48.2 ఓవర్ల తర్వాత ఆసీస్‌ స్కోర్‌ 254/8.

ఆసీస్‌ ఏడో వికెట్‌ డౌన్‌
250 పరుగుల వద్ద ఆసీస్‌ ఏడో వికెట్‌ కోల్పోయింది. బుమ్రా బౌలింగ్‌లో శ్రేయస్‌ అయ్యర్‌కు క్యాచ్‌ ఇచ్చి ఇంగ్లిస్‌ (45) ఔటయ్యాడు. షార్ట్‌ (1), కమిన్స్‌ క్రీజ్‌లో ఉన్నారు.

మరో వికెట్‌ తీసిన షమీ.. డేంజరెస్‌ స్టోయినిస్‌ క్లీన్‌ బౌల్డ్‌
షమీ ఈ మ్యాచ్‌లో తన మూడో వికెట్‌ను పడగొట్టాడు. స్టోయినిస్‌ను (29) షమీ క్లీన్‌బౌల్డ్‌ చేశాడు. 46.4 ఓవర్ల తర్వాత ఆసీస్‌ స్కోర్‌ 248/6. ఇంగ్లిస్‌ (44), షార్ట్‌ క్రీజ్‌లో ఉన్నారు.

ఐదో వికెట్‌ కోల్పోయిన ఆసీస్‌.. గ్రీన్‌ రనౌట్‌
186 పరుగుల వద్ద ఆసీస్‌ ఐదో వికెట్‌ కోల్పోయింది. గ్రీన్‌ (31) రనౌటయ్యాడు. బుమ్రా,సూర్యకుమార్‌ యాదవ్‌లు కలిసి గ్రీన్‌ను ఔట్‌ చేశారు. 40 ఓవర్ల తర్వాత ఆసీస్‌ స్కోర్‌ 187/5. ఇంగ్లిస్‌ (14), స్టోయినిస్‌ క్రీజ్‌లో ఉన్నారు.

వర్షం ముప్పు.. ఆటకు విరామం
వర్షం కురిసే అవకాశం ఉండటంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఆటగాళ్లు మైదానాన్ని వీడారు. పిచ్‌ను కవర్లతో కప్పేశారు.  ఆకాశం మేఘావృతం కావడంతో అంపైర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు.

నాలుగో వికెట్‌ కోల్పోయిన ఆసీస్‌.. అశ్విన్‌కు వికెట్‌
157 పరుగుల వద్ద ఆసీస్‌ నాలుగో వికెట్‌ కోల్పోయింది. అశ్విన్‌ బౌలింగ్‌లో కేఎల్‌ రాహుల్‌ అద్భుతమైన స్టంపింగ్‌ చేసి లబూషేన్‌ (39)ను ఔట్‌ చేశాడు. 32.4 ఓవర్ల తర్వాత ఆసీస్‌ స్కోర్‌ 157/4. గ్రీన్‌ (15), ఇంగ్లిస్‌ క్రీజ్‌లో ఉన్నారు.

స్టీవ్‌ స్మిత్‌ను క్లీన్‌ బౌల్డ్‌ చేసిన షమీ
మహ్మద్‌ షమీ బౌలింగ్‌లో స్టీవ్‌ స్మిత్‌ (60 బంతుల్లో 41; 3 ఫోర్లు, సిక్స్‌) క్లీన్‌ బౌల్డయ్యాడు. 22 ఓవర్ల తర్వాత ఆసీస్‌ స్కోర్‌ 114/3. లబూషేన్‌ (11), కెమరూన్‌ గ్రీన్‌ (1) క్రీజ్‌లో ఉన్నారు.

రెండో వికెట్‌ కోల్పోయిన ఆసీస్‌.. వార్నర్‌ (52) ఔట్‌
52 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద వార్నర్‌ ఔటయ్యాడు. జడేజా బౌలింగ్‌లో గిల్‌కు క్యాచ్‌ ఇచ్చి వార్నర్‌ పెవిలియన్‌కు చేరాడు. వార్నర్‌ 53 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లు బాదాడు. 20 ఓవర్ల తర్వాత ఆసీస్‌ స్కోర్‌ 107/2. స్టీవ్‌ స్మిత్‌ (39), లబూషేన్‌ (7) క్రీజ్‌లో ఉన్నారు.

15 ఓవర్ల తర్వాత ఆసీస్‌ స్కోర్‌ ఎంతంటే..?
15 ఓవర్ల తర్వాత ఆస్ట్రేలియా స్కోర్‌ 78/1గా ఉంది. వార్నర్‌ (48), స్టీవ్‌ స్మిత్‌ (21) క్రీజ్‌లో ఉన్నారు. వార్నర్‌ ధాటిగా ఆడుతున్నాడు. 

10 ఓవర్ల తర్వాత ఆస్ట్రేలియా స్కోరు 42/1
10 ఓవర్ల తర్వాత ఆస్ట్రేలియా స్కోర్‌ 42/1గా ఉంది. డేవిడ్‌ వార్నర్‌ (17), స్టీవ్‌ స్మిత్‌ (17) క్రీజ్‌లో ఉన్నారు.

తొలి వికెట్‌ కోల్పోయిన ఆసీస్‌
0.4: మిచెల్‌ మార్ష్‌ రూపంలో ఆస్ట్రేలియా తొలి వికెట్‌ కోల్పోయింది. షమీ బౌలింగ్‌లో గిల్‌కు క్యాచ్‌ ఇచ్చి మార్ష్‌(4) అవుటయ్యాడు. స్మిత్‌, వార్నర్‌ క్రీజులో ఉన్నారు. స్కోరు: 4-1

3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా టీమిండియాతో ఇవాళ (సెప్టెంబర్‌ 22) జరుగుతున్న తొలి వన్డేలో ఆసీస్‌ తొలుత బ్యాటింగ​్‌ చేస్తుంది. టీమిండియా టాస్‌ గెలిచి ఆసీస్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. 

టీమిండియా: శుభమన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయాస్ అయ్యర్, లోకేష్ రాహుల్ (కెప్టెన్‌), ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా (వైస్‌ కెప్టెన్‌), రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ

ఆస్ట్రేలియా: డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్, మాథ్యూ షార్ట్, మార్నస్ లబుషేన్‌, కామెరాన్ గ్రీన్, జోష్ ఇంగ్లిస్ (వికెట్‌కీపర్‌), మార్కస్ స్టోయినిస్, పాట్ కమిన్స్ (కెప్టెన్‌), సీన్ ఆంథోనీ అబాట్, ఆడమ్ జంపా.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement