ఆసీస్‌ ఆలౌట్‌.. భారత్‌ ఘన విజయం | India Vs Australia 2nd ODI Live Updates And Highlights | Sakshi
Sakshi News home page

IND VS AUS 2nd ODI Updates: ఆసీస్‌ ఆలౌట్‌.. భారత్‌ ఘన విజయం

Published Sun, Sep 24 2023 1:58 PM | Last Updated on Sun, Sep 24 2023 10:10 PM

India Vs Australia 2nd ODI Live Updates And Highlights - Sakshi

ఆసీస్‌ ఆలౌట్‌.. భారత్‌ ఘన విజయం

217 పరుగుల వద్ద ఆసీస్‌ ఆఖరి రెండు వికెట్లను కోల్పోయింది. దీంతో భారత్‌ 99 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

ఎనిమిదో వికెట్‌ కోల్పోయిన ఆసీస్‌

140 పరుగుల వద్ద ఆసీస్‌ ఎనిమిదో వికెట్‌ కోల్పోయింది. జాంపా (5) క్లీన్‌ బౌల్డయ్యాడు. 

ఏడో వికెట్‌ కోల్పోయిన ఆసీస్‌
135 పరుగుల వద్ద ఆసీస్‌ ఏడో వికెట్‌ కోల్పోయింది. గ్రీన్‌ (19)రనౌటయ్యాడు.

ఆరో వికెట్‌ కోల్పోయిన ఆసీస్‌
128 పరుగుల వద్ద ఆసీస్‌ ఆరో వికెట్‌ కోల్పోయింది. జడేజా బౌలింగ్‌లో అలెక్స్‌ క్యారీ (14) క్లీన్‌ బౌల్డయ్యాడు. 

101 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన ఆసీస్‌.. అశ్విన్‌కు 3 వికెట్లు
101 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన ఆసీస్‌ కష్టాల్లో కూరుకుపోయింది. అశ్విన్‌కు ఒకే ఓవర్‌లో (15వ ఓవర్‌) 2 వికెట్లు సహా మొత్తం 3 వికెట్లు పడగొట్టి ఆసీస్‌ను దెబ్బకొట్టాడు. 15వ ఓవర్‌ తొలి బంతికి వార్నర్‌ను (53) ఎల్బీడబ్ల్యూ చేసిన యాష్‌.. ఐదో బంతికి ఇంగ్లిస్‌ను (6) పెవిలియన్‌కు పంపాడు. 

మూడో వికెట్‌ కోల్పోయిన ఆసీస్‌
89 పరుగుల వద్ద ఆసీస్‌ మూడో వికెట్‌ కోల్పోయింది. అశ్విన్‌.. లబూషేన్‌ (27)ను క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. వార్నర్‌ (48), ఇంగ్లిస్‌ క్రీజ్‌లో ఉన్నారు.

తగ్గిన వర్షం.. మొదలైన ఆట.. 33 ఓవర్లకు మ్యాచ్‌ కుదింపు
వర్షం తగ్గడంతో మ్యాచ్‌ మళ్లీ మొదలైంది. వర్షం కారణంగా సమయం వృధా కావడంతో మ్యాచ్‌ను 33 ఓవర్లకు కుదించి, డక్‌వర్త్‌ లూయిస్‌ పద్దతి ప్రకారం ఆసీస్‌ లక్ష్యాన్ని 317 పరుగులుగా నిర్ధేశించారు. 10 ఓవర్ల తర్వాత ఆసీస్‌ స్కోర్‌ 63/2గా ఉంది. వార్నర్‌ (31), లబూషేన్‌ (18) క్రీజ్‌లో ఉన్నారు.

వర్షం కారణంగా నిలిచిపోయిన మ్యాచ్‌
ఆసీస్‌ ఇన్నింగ్స్‌ 9 ఓవర్ల తర్వాత వర్షం మొదలైంది. దీంతో అంపైర్లు మ్యాచ్‌ను నిలిపివేశారు. అంతకుమందు భారత ఇన్నింగ్స్‌ సందర్భంగా కూడా వరుణుడు అడ్డుతగిలాడు. 9 ఓవర్ల తర్వాత ఆసీస్‌ స్కోర్‌ 56/2గా ఉంది. మాథ్యూ షార్ట్‌ (9), స్టీవ్‌ స్మిత్‌ (0)లను ప్రసిద్ద్‌ కృష్ణ వరుస బంతుల్లో ఔట్‌ చేయగా.. డేవిడ్‌ వార్నర్‌ (26), లబూషేన్‌ (17) క్రీజ్‌లో ఉన్నారు.

టార్గెట్‌ 400.. రెండో ఓవర్లో 2 వికెట్లు కోల్పోయిన ఆసీస్‌
ఆస్ట్రేలియా రెండో ఓవర్లోనే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ప్రసిద్ధ్‌ కృష్ణ బౌలింగ్‌లో మాథ్యూ షార్ట్‌ (9), స్టీవ్‌ స్మిత్‌ (0) వరుస బంతుల్లో ఔటయ్యారు. 2.3 ఓవర్ల తర్వాత ఆసీస్‌ స్కోర్‌ 10/2గా ఉంది. లబూషేన్‌, వార్నర్‌ క్రీజ్‌లో ఉన్నారు.

గిల్‌, అయ్యర్‌ శతకాలు.. స్కై విధ్వంసం.. టీమిండియా భారీ స్కోర్‌
టాస్‌ ఓడి ఆసీస్‌ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 399 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. శుభ్‌మన్‌ గిల్‌ (104), శ్రేయస్‌ అయ్యర్‌ (105) శతకాలతో విరుచుకుపడగా.. ఆఖర్లో సూర్యకుమార్‌ యాదవ్‌ (37 బంతుల్లో 72 నాటౌట్‌; 6 ఫోర్లు, 6 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్‌ ఆడాడు. భారత ఇన్నింగ్స్‌లో కేఎల్‌ రాహుల్‌ (52) అర్ధసెంచరీతో రాణించగా.. ఇషాన్‌ కిషన్‌ (31) పర్వాలేదనిపించాడు. రుతురాజ్‌ (8) ఒక్కడే విఫలమయ్యాడు. ఆసీస్‌ బౌలర్లలో కెమరూన్‌ గ్రీన్‌ 2 వికెట్లు పడగొట్టగా.. ఆడమ్‌ జంపా, జోష్‌ హాజిల్‌వుడ్‌, సీన్‌ అబాట్‌ తలో వికెట్‌ దక్కించుకున్నారు. 

వరుసగా నాలుగు సిక్సర్లు బాదిన సూర్యకుమార్‌
గ్రీన్‌ వేసిన ఇన్నింగ్స్‌ 44వ ఓవర్‌లో సూర్యకుమార్‌ చెలరేగిపోయాడు. వరుసగా నాలుగు సిక్సర్లు​ బాదాడు. ఈ ఓవర్‌లో మొత్తం 26 పరుగులు వచ్చాయి. 46 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్‌ 355/5గా ఉంది. 46వ ఓవర్‌ ఆఖరి బంతికి గ్రీన్‌ బౌలింగ్‌లో రాహుల్‌ (52) ఔటయ్యాడు. 

నాలుగో వికెట్‌ కోల్పోయిన భారత్‌
302 పరుగుల వద్ద టీమిండియా నాలుగో వికెట్‌ కోల్పోయింది. ఆడమ్‌ జంపా బౌలింగ్‌లో అలెక్స్‌ క్యారీకి క్యాచ్‌ ఇచ్చి ఇషాన్‌ కిషన్‌ (18 బంతుల్లో 31; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) ఔటయ్యాడు. 41 ఓవర్ల తర్వాత జట్టు స్కోర్‌ 306/4గా ఉంది. రాహుల్‌ (45), సూర్యకుమార్‌ యాదవ్‌ (2) క్రీజ్‌లో ఉన్నారు.

గిల్‌ ఔట్‌.. మూడో వికెట్‌ కోల్పోయిన భారత్‌
104 పరుగుల వద్ద శుభ్‌మన్‌ గిల్‌ ఔటయ్యాడు. గ్రీన్‌ బౌలింగ్‌లో అలెక్స్‌ క్యారీకి క్యాచ్‌ ఇచ్చి గిల్‌ పెవిలియన్‌ బాట పట్టాడు. 35 ఓవర్ల తర్వాత భారత్‌ స్కోర్‌ 249/3గా ఉంది. కేఎల్‌ రాహుల్‌ (18), ఇషాన్‌ కిషన్‌ (6) క్రీజ్‌లో ఉన్నారు.

శుభ్‌మన్‌ గిల్‌ సెంచరీ
ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ (92 బంతుల్లో 100 నాటౌట్‌; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) తన భీకర ఫామ్‌ను కొనసాగిస్తూ వన్డే కెరీర్‌లో ఆరో సెంచరీ నమోదు చేశాడు. ఫలితంగా భారత్‌ భారీ స్కోర్‌ దిశగా సాగుతుంది. 33 ఓవర్ల తర్వాత భారత్‌ స్కోర్‌ 230/2గా ఉంది. గిల్‌ (100), కేఎల్‌ రాహుల్‌ (9) క్రీజ్‌లో ఉన్నారు.

సెంచరీ తర్వాత ఔటైన అయ్యర్‌
శ్రేయస్‌ అయ్యర్‌ సెంచరీ చేసిన వెంటనే ఔటయ్యాడు. 105 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద సీన్‌ అబాట్‌ బౌలింగ్‌లో మాథ్యూ షార్ట్‌ క్యాచ్‌ పట్టడంతో అయ్యర్‌ పెవిలియన్‌ బాట పట్టాడు. 30.5 ఓవర్ల తర్వాత భారత్‌ స్కోర్‌ 216/2గా ఉంది. శుభ్‌మన్‌ గిల్‌ (95), కేఎల్‌ రాహుల్‌ క్రీజ్‌లో ఉన్నారు.

శతక్కొట్టిన శ్రేయస్‌ అయ్యర్‌
ఆసీస్‌తో జరుగుతున్న రెండో వన్డేలో శ్రేయస్‌ అయ్యర్‌ సెంచరీ సాధించాడు. అయ్యర్‌ 86 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో కెరీర్‌లో మూడో సెంచరీని నమోదు చేశాడు. మరోవైపు శుభ్‌మన్‌ గిల్‌ (94) సైతం సెంచరీ దిశగా సాగుతున్నాడు. 29.5 ఓవర్ల తర్వాత భారత్‌ స్కోర్‌ 210/1గా ఉంది.

సెంచరీల దిశగా దూసుకుపోతున్న గిల్‌, శ్రేయస్‌ 
శుభ్‌మన్‌ గిల్‌ (90), శ్రేయస్‌ అయ్యర్‌లు (92) సెంచరీల దిశగా దూసుకుపోతున్నారు. 28 ఓవర్ల తర్వాత భారత్‌ స్కోర్‌ 198/1గా ఉంది. 

శ్రేయస్‌ హాఫ్‌ సెంచరీ
గాయం నుంచి కోలుకున్న తర్వాత శ్రేయస్‌ అయ్యర్‌ తన తొలి హాఫ్‌ సెంచరీని నమోదు చేశాడు. అయ్యర్‌ కూడా గిల్‌ లాగే సిక్సర్‌తో ఫిఫ్టిని కంప్లీట్‌ చేశాడు. అయ్యర్‌ 41 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌ సాయంతో 50 పరుగులు పూర్తి చేశాడు. 17 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్‌ 131/1గా ఉంది. గిల్‌ 61, శ్రేయస్‌ 54 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.

సిక్సర్‌తో ఫిఫ్టి పూర్తి చేసుకున్న గిల్‌
శుభ్‌మన్‌ గిల్‌ కెరీర్‌లో తన 10వ హాఫ్‌ సెంచరీని సిక్సర్‌తో పూర్తి చేశాడు. కేవలం 37 బంతుల్లోనే గిల్‌ ఫిఫ్టిని కంప్లీట్‌ చేశాడు. గిల్‌ తన హాఫ్‌ సెంచరీలో 2 ఫోర్లు, 4 సిక్సర్లు కొట్టాడు. 14 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్‌ 111/1గా ఉంది. గిల్‌ 53, శ్రేయస్‌ 44 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.

మొదలైన ఆట.. 10 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్‌ 80/1
వర్షం అంతరాయం అనంతరం ఆట మళ్లీ మొదలైంది. ఓవర్ల కుదింపు ఏమీ జరగలేదు. మ్యాచ్‌ యధావిధిగా 50 ఓవర్ల పాటు సాగనుంది. 10 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్‌ 80/1గా ఉంది. గిల్‌ (33), శ్రేయస్‌ అయ్యర్‌ (34) క్రీజ్‌లో ఉన్నారు.

వర్షం కారణంగా నిలిచిపోయిన ఆట
వర్షం కారణంగా మ్యాచ్‌కు అంతరాయం కలిగింది. భారత ఇన్నింగ్స్‌ 10వ ఓవర్‌లో వర్షం మొదలుకావడంతో మ్యాచ్‌ను నిలిపివేశారు. 9.5 ఓవర్ల తర్వాత భారత్‌ స్కోర్‌ 79/1గా ఉంది. రుతరాజ్‌ (8) ఔట్‌ కాగా.. శుభ్‌మన్‌ గిల్‌ (32), శ్రేయస్‌ అయ్యర్‌ (34) క్రీజ్‌లో ఉన్నారు. 

తొలి వికెట్‌ కోల్పోయిన భారత్‌
టాస్‌ ఓడి ఆసీస్‌ ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 16 పరుగుల వద్ద రుతురాజ్‌ గైక్వాడ్‌ (8) వికెట్‌ కోల్పోయింది. హాజిల్‌వుడ్‌ బౌలింగ్‌లో అలెక్స్‌ క్యారీకు క్యాచ్‌ ఇచ్చి రుతు ఔటయ్యాడు. 5 ఓవర్ల తర్వాత భారత్‌ స్కోర్‌ 26/1. శుభ్‌మన్‌ గిల్‌ (3), శ్రేయస్‌ అయ్యర్‌ (10) క్రీజ్‌లో ఉన్నారు.

ఇండోర్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా టాస్‌ ఓడి, ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓ మార్పుతో బరిలోకి దిగింది. బుమ్రా స్థానంలో ప్రసిద్ధ్‌ కృష్ణ తుది జట్టులోకి వచ్చాడు. మరోవైపు ఆస్ట్రేలియా మూడు మార్పులతో బరిలోకి దిగింది. మిచెల్‌ మార్ష్‌, మార్కస్‌ స్టోయినిస్‌, పాట్‌ కమిన్స్‌ స్థానాల్లో అలెక్స్‌ క్యారీ, జోష్‌ హాజిల్‌వుడ్‌, స్పెన్సర్‌ జాన్సన్‌ తుది జట్టులోకి వచ్చారు. 

ఆస్ట్రేలియా : డేవిడ్ వార్నర్, మాథ్యూ షార్ట్, స్టీవ్ స్మిత్ (కెప్టెన్‌), మార్నస్ లాబుషేన్‌, జోష్ ఇంగ్లిస్, అలెక్స్ కారీ (వికెట్‌ కీపర్‌), కామెరాన్ గ్రీన్, సీన్ ఆంథోనీ అబాట్, ఆడమ్ జంపా, స్పెన్సర్ జాన్సన్, జోష్ హాజిల్‌వుడ్

ఇండియా : శుభమన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయాస్ అయ్యర్, లోకేష్ రాహుల్ (కెప్టెన్‌), ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ షమీ, ప్రసిద్ధ్ కృష్ణ

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement