Courtesy: IPL Twitter
ఐపీఎల్-2022లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో తొలి పోరుకు ముంబై ఇండియన్స్ సిద్దమైంది. బ్రబౌర్న్ వేదికగా మార్చి 27 మధ్యాహ్నం 3:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభంకానుంది. అయితే ఈ మ్యాచ్‌కు ఆ జట్టు స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ గాయం కారణంగా దూరమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఈ క్రమంలో అతడి స్దానాన్ని భర్తీ చేసే అవకాశం ఉన్న ఆటగాళ్లపై ఓ లూక్కేద్దం.
డెవాల్డ్ బ్రెవిస్
జూనియర్ ఏబీడిగా పేరుపొందిన దక్షిణాఫ్రికా అండర్-19 ఆటగాడు డెవాల్డ్ బ్రెవిస్‌ను ఐపీఎల్-2022 మెగా వేలంలో రూ. 3 కోట్లకు ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది. బ్రెవిస్ అచ్చం డివిలియర్స్ లాగే అద్భుతమైన షాట్లు ఆడుతున్నాడు. అదే విధంగా అండర్-19 ప్రపంచకప్‌లో డెవాల్డ్ బ్రెవిస్ అద్భుతంగా రాణించాడు. బ్రెవిస్ మూడవ స్థానంలో యాదవ్‌కు సరైన రీప్లేస్‌మెంట్ అని చెప్పుకోవచ్చు.
అన్మోల్‌ప్రీత్ సింగ్
ఈ 23 ఏళ్ల ఆల్ రౌండర్ గతంలో ముంబై ఇండియన్స్ తరుపున 2019లో ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. అయితే ఐపీఎల్-2022 మెగా వేలంలో మళ్లీ ముంబై కొనుగోలు చేసింది. అన్మోల్‌ప్రీత్ సింగ్ ఇండియా-ఎ,ఇండియా బ్లూ, ఇండియా సి జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. అన్మోల్‌ప్రీత్ పార్ట్‌టైమ్ స్పిన్నర్‌గా ఉపయోగపడతాడు. ఈ క్రమంలో యాదవ్ స్థానంలో అన్మోల్‌ప్రీత్‌కు ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది.
ఫాబియన్ అలెన్
ఈ ఏడాది మెగా వేలంలో వెస్టిండీస్ ఆల్ రౌండర్ ఫాబియన్ అలెన్‌ను ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది. అతడు గతంలో సన్‌రైజర్స్ హైదరాబాద్,పంజాబ్ కింగ్స్‌కు ఐపీఎల్‌లో ప్రాతినిద్యం వహించాడు. అలెన్ గతేడాది కరీబీయన్ ప్రీమియర్ లీగ్‌లో అద్భుతంగా రాణించాడు. అదే విధంగా అతడు స్పిన్ బౌలింగ్‌తో పాటు, బెస్ట్ ఫినెషర్‌గా కూడా మ్యాచ్‌ను ముగించగలడు. ఈ క్రమంలో యాదవ్‌కు ప్రత్యామ్నాయంగా అలెన్‌ను ముంబై తీసుకునే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment