
న్యూఢిల్లీ: బౌండరీ విధానంతో వన్డే ప్రపంచకప్ విజేతను ప్రకటించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతునూ ఉన్నాయి. తాజాగా ముగిసిన వరల్డ్‌కప్ ఫైనల్లో న్యూజిలాండ్, ఇంగ్లండ్ సమానంగా ఆడినప్పటికీ ఇంగ్లీషు టీమ్‌ను విజేతగా ప్రకటించడాన్ని క్రికెట్ అభిమానులే కాదు మాజీ ఆటగాళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇలాంటి మ్యాచ్‌ల్లో ఫలితం రాబట్టేందుకు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కొత్త ప్రతిపాదన తెచ్చారు. సూపర్ ఓవర్‌లోనూ స్కోర్లు సమం కావడంతో ఎక్కువ బౌండరీలు కొట్టిన ఇంగ్లండ్‌ను విజేతగా ప్రకటించిన సంగతి తెలిసిందే. బౌండరీ విధానంతో ఫలితం తేల్చకుండా మరో సూపర్ ఓవర్ ఆడించివుంటే బాగుండేదని సచిన్ అభిప్రాయపడ్డాడు. ప్రపంచకప్ ఫైనల్ మాత్రమే కాదు ప్రతి మ్యాచ్ కీలకమేనని, ఫుట్‌బాల్‌లో ఫలితం తేలకపోతే అదనపు సమయం ఇస్తారని గుర్తుచేశాడు. బౌండరీ నింబధనను రోహిత్ శర్మ, గౌతమ్ గంభీర్, యువరాజ్ సింగ్ కూడా తప్పుబట్టారు.
ప్రపంచకప్‌లో నాకౌట్ విధానంలోనూ మార్పులు చేయాల్సిన అవసరముందని సచిన్ అభిప్రాపడ్డాడు. ఐపీఎల్ తరహాలో టాప్ నిలిచిన జట్టుకు నాకౌట్‌లో ఓడితే మరొక అవకాశం కల్పించాలని సూచించాడు. న్యూజిలాండ్‌తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో ఎంఎస్ ధోనిని బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందుకు పంపిస్తే బాగుందని సచిన్ అభిప్రాయపడ్డాడు. ధోని ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి.. హార్దిక్ పాండ్యా, దినేశ్ కార్తీక్ తర్వాత క్రీజ్‌లో రావాల్సిందని పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment