
వాషింగ్టన్ : 3,200 వయగ్రా పిల్స్‌ను చికాగో విమానాశ్రయంలోకి తీసుకెళ్లిన ఓ భారతీయుడిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వాటిని తన మిత్రుల కోసం తీసుకెళుతున్నానని నిందితుడు చెప్పినట్లు పేర్కొన్నారు. దాదాపు నాలుగున్నర కేజీల బరువున్న 3,200 వయగ్రా పిల్స్ విలువ రూ. 69 లక్షల వరకూ ఉంటుందని యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ అధికారులు వెల్లడించారు. సరైన కారణాన్ని వెల్లడించడంలో నిందితుడు విఫలమయ్యాడని చెప్పారు. అమెరికా చట్టాల ప్రకారం దేశం వెలుపల కొన్న మెడిసిన్‌ను దిగుమతి చేసుకోవడానికి ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిష్ట్రేషన్ ఒప్పుకోదని తెలిపారు. అయితే నిందితుడి వివరాలను మాత్రం అధికారులు వెల్లడించలేదు.
Comments
Please login to add a commentAdd a comment