భారతదేశ సమకాలీన రాజకీయాల్లో తమ నాయకుడి కోసం ప్రాణాలు ఇవ్వగలిగేంత అభిమానం సంపాదించుకున్న మహానేత ైవైఎస్ రాజశేఖరరెడ్డి అని ఎన్నారైలు
షికాగోలో ఘనంగా వైఎస్ రాజశేఖరరెడ్డికి నివాళులు
సాక్షి, హైదరాబాద్ : భారతదేశ సమకాలీన రాజకీయాల్లో తమ నాయకుడి కోసం ప్రాణాలు ఇవ్వగలిగేంత అభిమానం సంపాదించుకున్న మహానేత ైవైఎస్ రాజశేఖరరెడ్డి అని ఎన్నారైలు, పలువురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, అభిమానులు కొనియాడారు. ఆయన లేనిలోటు ఎవరూ పూడ్చలేనిదని కీర్తించారు. వైఎస్సార్ జయంతి కార్యక్రమాన్ని షికాగో నగరంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 500 మంది ఎన్నారై ప్రతినిధులు హాజరవగా.. ఆటా రజతోత్సవ వేడుకుల్లో పాల్గొనేందుకు షికాగో చేరుకున్న వైఎస్సార్‌సీపీ నేతలు, అభిమానులు ఆ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు.
ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ఆర్కే రోజా, అనిల్‌కుమార్ యాదవ్, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, పార్టీ నేతలు కరుణాకర్‌రెడ్డి, అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్‌తోపాటు వైఎస్ అభిమాని గోనె ప్రకాశరావు, ప్రేమసాగర్‌రెడ్డి (ఎన్నారై, వైఎస్ ఆప్తమిత్రుడు), ఆటాకు చెందిన బోర్డు ట్రస్టీ హరి లింగాల తదితరులు పాల్గొని రాజశేఖరరెడ్డికి ఘనంగా నివాళులర్పించారు. రాజశేఖరరెడ్డి మొదలుపెట్టిన అన్ని పథకాలను రానున్న కాలంలో ఆయన తనయుడు, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముందుకు తీసుకెళ్తారని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. వైఎస్ అన్నది కేవలం పేరు కాదని.. అదొక బ్రాండ్ అని ఎమ్మెల్యే రోజా ఉద్ఘాటించారు.