
చికాగో : చికాగోలోని డౌన్‌టౌన్ స్ట్రీట్ భారత్‌మాతాకీ జై నినాదాలతో మారుమోగిపోయింది. పూల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్లకు చికాగోలోని ప్రవాసాంధ్రులు నివాళి అర్పించారు. జమ్ముకాశ్మీర్‌లోని పుల్వామాలో జరిగిన ఉగ్ర ఘాతుక ఘటనకు కారణమైన పాకిస్తాన్, ఆ దేశానికి సహకారం అందిస్తున్న చైనా దేశాల కాన్సులేట్‌ల ఎదుట తమ నిరసన తెలిపారు. జవాన్ల మరణం తమను ఎంతో కలచివేసిందని, ప్రజలను కాపాడే కర్తవ్యంలో మరణించిన జవాన్ల కుటుంబాలకు ప్రగాఢ సానూభూతి తెలిపారు. ఉగ్రవాదాన్ని పెంచిపోషించడం పాకిస్తాన్ మానుకోవాలని, పాకిస్తాన్‌కు చైనా అందిస్తున్న సహాకారాన్ని తక్షణమే విరమించుకోవాలని ఫ్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment