
చికాగో : ‘చికాగో సాహితీ మిత్రులు’ సంస్థ ఆధ్వర్యంలో అమెరికాలో ‘సాహిత్య సభ’ జరగనుంది. జులై 20, 2019న శనివారం మధ్యాహ్నం 1:00 గంటకు ఓక్ బూక్ర్ పబ్లిక్ లైబ్రరి, 600 బూక్ర్ రోడ్, ఐఎల్-60523 వేదికగా ఈ సభ జరగనుంది. ఈ సభలో ప్రముఖ రచయితలు, కవులు, సంపాదకులు వివిధ అంశాలపై ప్రసంగిస్తారు. ప్రముఖ కవి, తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షులు నందిని సిధారెడ్డి ‘‘కవిత్వం-మానవ సంబంధాలు’’.. ప్రముఖ రచయిత్రి డా. కేయన్ మల్లీశ్వరి తానా బహుమతి పొందిన నవల ‘‘నీల’’ గురించి.. కేంద్ర సాహిత్య అకాడమీ సభ్యులు ‘‘కథ’’ సంపాదకులు వాసిరెడ్డి నవీన్ గారు తెలుగు సాహిత్య ప్రయాణం గురించి మాట్లాడతారు. తెలుగు భాష, సంస్కృతులను ప్రేమించేవారందరికీ ఇదే మా సాదర ఆహ్వానమని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంపై మరిన్ని వివరాల కోసం జయదేవ్(630-667-3612), ప్రకాష్ (630-935-1664)లను సంప్రదించాలని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment