వాషింగ్టన్: అమెరికా చికాగో ఇంటర్‌సెక్షన్‌లో షాకింగ్ ఘటన జరిగింది. కొంతమంది కలిసి 100 కార్లతో డ్రాగ్ రేసింగ్ నిర్వహించి విధ్వంసం సృష్టించారు. తుపాకులతో కాల్పులు జరిపి రెచ్చిపోయారు. ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
చికాగో ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించే రేమండ్ లోపేజ్ ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. డ్రాగ్ రేసింగ్ కారవాన్లపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు. ఇవి వీధుల్లో తమషా కోసం నిర్వహించే గేమ్స్ కాదని మండిపడ్డారు.
ఆదివారం ఉదయం 4 గంటల సమయంలో చికాగో ఇంటర్‌సెక్షన్‌ను కొన్ని గ్యాంగ్‌లు కలిసి 100 కార్లతో తమ నియంత్రణలోకి తీసుకున్నాయని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత నడిరోడ్డుపై రేసింగ్‌లు నిర్వహించి స్టంట్‌లు చేశారని పేర్కొన్నారు. మొత్తం 13 సార్లు కాల్పులు జరిగినట్లు తమకు సమాచారం ఉందని వివరించారు.
తాము ఘటనా స్థలానికి చేరుకునే సరికి ఐదుగురు బుల్లెట్ గాయాలతో పడి ఉన్నారని, వెంటనే వారిని ఆస్పత్రికి తరలించామని పేర్కొన్నారు. అందులో ముగ్గురు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారని, మిగతా ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని చెప్పారు.
చదవండి: 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీపై ట్రంప్ హింట్..
Comments
Please login to add a commentAdd a comment