Chicago Open ATP Challenger Tennis: పోరాడి ఓడిన సాకేత్‌–యూకీ బాంబ్రీ జోడీ | Saketh Myneni- Yuki Bhambri defeat in Chicago open | Sakshi
Sakshi News home page

Chicago Open ATP Challenger Tennis: పోరాడి ఓడిన సాకేత్‌–యూకీ బాంబ్రీ జోడీ

Published Sun, Aug 14 2022 6:03 AM | Last Updated on Sun, Aug 14 2022 6:03 AM

Saketh Myneni- Yuki Bhambri defeat in Chicago open - Sakshi

షికాగో ఓపెన్‌ ఏటీపీ చాలెంజర్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్‌ ప్లేయర్‌ సాకేత్‌ మైనేని–యూకీ బాంబ్రీ (భారత్‌) జంట పోరాటం ముగిసింది. అమెరికాలో జరుగుతున్న ఈ టోర్నీలో శనివారం జరిగిన పురుషుల డబుల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో సాకేత్‌–యూకీ బాంబ్రీ ద్వయం 5–7, 6–4, 3–10తో ‘సూపర్‌ టైబ్రేక్‌’లో రెండో సీడ్‌ ఆండ్రీ గొరాన్సన్‌ (స్వీడన్‌)–బెన్‌ మెక్‌లాచ్లాన్‌ (జపాన్‌) జంట చేతిలో ఓడిపోయింది.

94 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సాకేత్‌ జంట నాలుగు ఏస్‌లు సంధించి, మూడు డబుల్‌ ఫాల్ట్‌లు చేసింది.  తమ సర్వీస్‌ను ఒకసారి కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను ఒకసారి బ్రేక్‌ చేసింది. ఈ సీజన్‌లో సాకేత్‌–యూకీ జంట అద్భుతమైన ఫామ్‌లో ఉంది. వీరిద్దరు కలిసి నాలుగు ఏటీపీ చాలెంజర్‌ టైటిల్స్‌ను, రెండు ఐటీఎఫ్‌ టోర్నీ టైటిల్స్‌ను సాధించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement