
ప్రతీకాత్మక చిత్రం
వయెలెన్స్.. వయెలెన్స్.. వయెలెన్స్.. అమెరికాలో నియంత్రణ కాలేకపోతోంది. తుపాకీల గర్జనతో మరోసారి అమెరికా ఉలిక్కి పడింది. చికాగో (Chicago) నగరంలోని వారాంతంలో జరిగిన వేర్వేరు కాల్పుల ఘటనల్లో ఎనిమిది మందికి పైగా మృతిచెందారు. మరో 42 మంది తీవ్రంగా గాయపడ్డారు.
సౌత్ కిల్‌ప్యాట్రిక్‌లో పేలిన ఘటన.. అటుపై బ్రైటన్ పార్క్, సౌట్ ఇండియానా, నార్త్ కెడ్జి అవెన్యూ, హోమ్‌బోల్ట్ పార్క్‌లో వరుసగా చోటు చేసుకున్నాయి. తొలి ఘటన శుక్రవారం జరగ్గా.. 69 ఏండ్ల వృద్ధుడు మరణించాడు. ఆ తర్వాతి కాల్పుల ఘటనల్లో దాదాపు అన్ని వయస్సుల వాళ్లు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
ఇదిలా ఉండగా.. గన్ వయొలెన్స్ అమెరికాలో ఎంతకీ తగ్గడం లేదు. ఓ పరిశోధన సంస్థ ప్రకారం.. కేవలం ఈ ఏడాదిలో ఇప్పటివరకు 140కి పైగా కాల్పుల ఘటనలు సంభవించాయి. ఇలాంటి ఘటనలను నియంత్రించేందుకే ఘోస్ట్ గన్స్‌పై నిషేధం విధించాడు ఆ దేశ అధ్యక్షుడు జో బైడన్. అయితే ఈ చట్టం తీసుకొచ్చినా కూడా.. ఘటనలు మాత్రం ఆగడం లేదు.
చదవండి: ఘోస్ట్ గన్స్ ఎఫెక్ట్.. ప్రాణ భయంతో ఎనిమిదో అంతస్తు నుంచి దూకింది!
Comments
Please login to add a commentAdd a comment