Chicago shooting
-
పడగ విప్పిన గన్ కల్చర్.. తొమ్మిది మంది మృతి!
అగ్రరాజ్యంలో మరోసారి గన్ కల్చర్ కోరలు చాచింది. ఫాదర్స్ డే వీకెండ్ సందర్భంలో చికాగో ప్రజలు ఓవైపు సంబురాలు మునిగిపోగా.. మరోవైపు కాల్పుల ఘటనలు తొమ్మిది మంది ప్రాణాల్ని బలిగొన్నాయి. దాదాపు 50 మందికిపైగా గాయపడ్డారు. ఈ హింస అత్యంత విషాదకరమని వైట్‌హౌస్ ఓ ప్రకటనలో సంతాపం తెలిపింది. శనివారం రాత్రి నుంచి ఆదివారం వరకు సబర్బన్ చికాగో, వాషింగ్టన్ స్టేట్, సెంట్రల్ పెన్సిల్వేనియా, సెయింట్ లూయిస్, సదర్న్ కాలిఫోర్నియా, బాల్టిమోర్ ప్రాంతాల్లో వేర్వేరు కాల్పుల ఘటనలు చోటు చేసుకున్నాయి. ► సౌత్‌వెస్ట్ చికాగోకు 20 మైళ్ల దూరంలో ఇల్లినాయీస్ రాష్ట్రం లోని విలోబ్రూక్లో ఆదివారం ఉదయం ఓ భవన పార్కింగ్ ప్రదేశంలో జూన్ టీన్త్ వేడుకల్లో జరిగిన కాల్పుల్లో ఒకరు మృతి చెందగా, 23 మంది గాయపడ్డారు. ► ఇక శనివారం వాషింగ్టన్ స్టేట్ క్యాంప్ గ్రౌండ్లో ఆగంతకుడు యాధృచ్ఛికంగా కాల్పులు జరపడంతో ఇద్దరు చనిపోయారు. మరో ఇద్దరు గాయపడ్డారు. ► కాలిఫోర్నియా లోని కార్సన్లో ఓ ఇంటివద్ద పూల్ పార్టీ జరుగుతుండగా కాల్పులు సంభవించి ఎనిమిది మంది గాయపడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందినట్లు సమాచారం అందుతోంది. బాధితులంతా 16 నుంచి 24 ఏళ్ల లోపు వాళ్లే. ► జార్జి నగరంలో జరిగిన కాల్పుల్లో ఇద్దరు మృతి చెందారు. ముగ్గురు గాయపడ్డారు. ► పెన్సిల్వేనియా లోని వాకర్ టౌన్షిప్లో ఓ వ్యక్తి జరిపిన కాల్పుల్లో ప్రభుత్వ సైనికుడు మృతి చెందగా, మరొకరు గాయపడ్డారు. ఈ సంఘటనలో నిందితుడు తన ట్రక్కుని డ్రైవ్ చేసుకుంటూ లూయిస్‌టౌన్ బారక్స్ వైపు రాత్రి 11 గంటల సమయంలో దూసుకు వచ్చి అక్కడ ఉన్నవారిపై కాల్పులు జరిపి పారిపోయాడు. ► బాల్టిమోర్‌లో జరిగిన కాల్పుల్లో ఆరుగురు గాయపడ్డారు. ఆయా ఘటనలపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన అమెరికా అధ్యక్ష భవనం.. తుపాకీ సంస్కృతి కట్టడికి ఇకనైనా ముగింపు పలకాలని ఆశిస్తున్నట్లు ఒక ప్రకటన విడుదల చేసింది. అదే సమయంలో ఘటనలపై దర్యాప్తులు కొనసాగుతున్నాయని ఆయా రాష్ట్ర గవర్నర్లు, పోలీస్ ఉన్నతాధికారులు చెబుతున్నారు. -
Chicago Shooting: నరనరాన హింస.. క్లాస్‌రూమ్‌లోనే అలాంటి వీడియోలు
యువకుడు.. మొరటోడు.. హింసను ప్రేరేపించేలా ర్యాప్‌లు.. పైగా దూకుడు స్వభావం.. ఇవేం చాలవన్నట్లు పేరులోనే ‘క్రైమ్’ ఉంది అతనికి. చికాగో హైల్యాండ్ పార్క్‌లో జులై4న జరిగిన స్వాతంత్ర దినోత్స పరేడ్‌లో నరమేధం తాలుకా అనుమానితుడి ఫ్రొఫైల్ నుంచి పోలీసులు సేకరించిన ఆసక్తికర విషయాలు ఇవి. రాబర్ట్ బాబీ క్రైమో III(22).. చికాగో ఇల్లినాయిస్ హైల్యాండ్ పార్క్ పరేడ్ నరమేధంలో ఆరుగురిని మట్టుపెట్టడంతో పాటు 36 మందిని గాయపరిచాడన్న ఆరోపణల మీద అరెస్ట్ అయ్యాడు. అయితే అతని గురించి దర్యాప్తు చేపట్టిన పోలీసులకు విస్తూ పోయే విషయాలు తెలిశాయి. రాబర్ట్ బాబీ క్రైమో.. ఈ ప్రపంచానికి కొత్తగా పరిచయం కావొచ్చు. కానీ, అక్కడి ప్రజలకు మాత్రం అతనిలో పేరుకుపోయిన హింసాత్మక ప్రవర్తన గురించి చాలాకాలంగానే తెలుసు!. ఎలాగంటారా?.. ర్యాపర్ అయిన క్రైమో తన యూట్యూబ్ ఛానెల్స్ ద్వారా బాగా ఫేమస్. హింసను ఉసిగొల్పే లిరిక్స్, కాల్పులు, చావులు, హింసకు సంబంధించిన కంటెంట్‌నే ఎక్కువగా ప్రమోట్ చేస్తాడు అతను. Robert "Bobby" Crimo III ha sido identificado como la persona de interés en el tiroteo masivo mortal en #HighlandPark, Illinois- Chicago. Seis muertos y decenas de heridos en la masacre del desfile festivo del #4deJulio. Video que muestra algo de su aturdida personalidad.#EEUU. pic.twitter.com/OWGdZ01YqM — MikyRodriguezOficial (@MikyRodriguezO1) July 4, 2022 కాల్పుల ఘటన తర్వాత అతన్ని అరెస్ట్ చేసిన పోలీసులు.. అతని ఛానెల్స్ మొత్తాన్ని యూట్యూబ్ నుంచి డిలీట్ చేయించారు. సోషల్ మీడియా అకౌంట్లను తొలగించారు. అయినప్పటికీ.. అతనికి సంబంధించిన వీడియోలు కొన్ని ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ‘అవేక్ ది ర్యాపర్’ పేరుతో అతని వీడియోలన్నీ హింసను ప్రొత్సహించేవిగా ఉండడం గమనార్హం. క్రైమో వీడియోల్లో యూట్యూబ్ కూడా నిబంధనల ఉల్లంఘన కింద తీసేయని వీడియోలు చాలానే ఉన్నాయి. హెల్మెట్, బుల్లెట్‌ఫ్రూఫ్ కోట్ ధరించి తరగతి గదిలోనే యువతను రెచ్చగొట్టే వీడియోలు చాలానే తీశాడు అతను. ఒంటి నిండా టాటూలతో విచిత్రమైన వేషధారణలతో ర్యాప్‌లు కడుతూ.. వాటి లిరిక్స్‌లోనూ తనలో పేరుకుపోయిన హింసా ప్రవృత్తిని చూపిస్తుంటాడు అతను. హోండా ఫిట్ కారు రూఫ్‌టాప్ నుంచి హై పవర్డ్ రైఫిల్‌తో క్రైమో కాల్పులు జరిపాడన్నది హైల్యాండ్ పార్క్ పోలీసులు వాదన. ఇక ఘటన జరిగిన తర్వాత.. సుమారు ఐదు మైళ్ల పాటు రాబర్ట్‌ను పోలీసులు ఛేజ్ చేశారని, ఆపై అదుపులోకి తీసుకున్నారని తెలుస్తోంది. అమెరికాలో పేట్రేగిపోతున్న గన్ కల్చర్, ఇంటర్నెట్ కంటెంట్‌పై సరైన ఆంక్షలు, నియంత్రణ లేకపోవడం.. మరో యువకుడితో మారణ హోమం సృష్టించిందన్న వాదన వినిపిస్తోంది ఇప్పుడు. ఇలాంటి వాళ్లను ముందస్తుగానే గుర్తించి.. నిలువరిస్తే నరమేధాలు జరగవన్న అభిప్రాయమూ వ్యక్తం అవుతోంది. -
వయెలెన్స్.. వయెలెన్స్.. వయెలెన్స్
వయెలెన్స్.. వయెలెన్స్.. వయెలెన్స్.. అమెరికాలో నియంత్రణ కాలేకపోతోంది. తుపాకీల గర్జనతో మరోసారి అమెరికా ఉలిక్కి పడింది. చికాగో (Chicago) నగరంలోని వారాంతంలో జరిగిన వేర్వేరు కాల్పుల ఘటనల్లో ఎనిమిది మందికి పైగా మృతిచెందారు. మరో 42 మంది తీవ్రంగా గాయపడ్డారు. సౌత్ కిల్ప్యాట్రిక్లో పేలిన ఘటన.. అటుపై బ్రైటన్ పార్క్, సౌట్ ఇండియానా, నార్త్ కెడ్జి అవెన్యూ, హోమ్‌బోల్ట్ పార్క్‌లో వరుసగా చోటు చేసుకున్నాయి. తొలి ఘటన శుక్రవారం జరగ్గా.. 69 ఏండ్ల వృద్ధుడు మరణించాడు. ఆ తర్వాతి కాల్పుల ఘటనల్లో దాదాపు అన్ని వయస్సుల వాళ్లు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఇదిలా ఉండగా.. గన్ వయొలెన్స్ అమెరికాలో ఎంతకీ తగ్గడం లేదు. ఓ పరిశోధన సంస్థ ప్రకారం.. కేవలం ఈ ఏడాదిలో ఇప్పటివరకు 140కి పైగా కాల్పుల ఘటనలు సంభవించాయి. ఇలాంటి ఘటనలను నియంత్రించేందుకే ఘోస్ట్ గన్స్‌పై నిషేధం విధించాడు ఆ దేశ అధ్యక్షుడు జో బైడన్. అయితే ఈ చట్టం తీసుకొచ్చినా కూడా.. ఘటనలు మాత్రం ఆగడం లేదు. చదవండి: ఘోస్ట్ గన్స్ ఎఫెక్ట్.. ప్రాణ భయంతో ఎనిమిదో అంతస్తు నుంచి దూకింది! -
అమెరికా ఆస్పత్రిలో కాల్పులు
చికాగో : అమెరికాలో సాయుధ ఉన్మాదుల కాల్పులకు బ్రేక్ పడటం లేదు. తాజాగా చికాగో ఆస్పత్రి పార్కింగ్ ప్రదేశంలో సాయుధ దుండగుడు జరిపిన కాల్పుల్లో ఇద్దరు మరణించగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మరణించిన వారిలో గన్‌మెన్ కూడా ఉన్నాడు. తొలుత ఆస్పత్రి పార్కింగ్ ప్రదేశంలో కాల్పులకు తెగబడిన దుండగుడు ఆ తర్వాత ఆస్పత్రిలో ప్రవేశించి కాల్పులు జరిపాడని స్ధానిక మీడియా వెల్లడించింది. చికాగోలోని మెర్సీ ఆస్పత్రిలో జరిగిన కాల్పుల్లో పోలీస్ అధికారి మరణించాడని అధికారులు తెలిపారు. ఆస్పత్రి నుంచి తనకు కాల్పుల శబ్ధాలు స్పష్టంగా వినిపించాయని, పోలీసులు వచ్చిన తర్వాత కాల్పులు నిలిచిపోయాయని ప్రత్యక్ష సాక్షి సూ జిమెనజ్ చెప్పారు. కాగా,ఘటన అనంతరం పెద్ద ఎత్తున పోలీస్ బలగాలు ఆస్పత్రికి చేరుకున్నాయి. కాల్పులు నిలిచిపోయాయని, రోగులు సురక్షితంగా ఉన్నారని ఆస్ప్రతి వర్గాలు పేర్కొన్నారు. కాల్పుల్లో గాయపడి యూనివర్సిటీ ఆఫ్ చికాగో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పోలీస్ అధికారిని చికాగో మేయర్ ఇమ్మానుయేల్, పోలీస్ సూపరింటెండెంట్ ఎడీ జాన్సన్ పరామర్శించారు. -
చికాగోలో గుజరాత్ యువకుడి హత్య
చికాగో : అమెరికాలో మరో భారతీయుడు దారుణ హత్యకు గురయ్యాడు. చికాగోలోని డాల్టన్ గ్యాస్ స్టేషన్ దగ్గర దుండగులు దోపిడీకి ప్రయత్నించారు. అదే సమయంలో గ్యాస్ స్టేషన్లో ఉన్న గుజరాత్‌కు చెందిన 19 ఏళ్ల ఆర్షద్ వోరాపై దుండగులు తుపాకీ కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో వోరా అక్కడికక్కడే మృతి చెందగా.. ఇతర కుటుంబ సభ్యులు తీవ్రమైన గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన గురువారం ఉదయం 11 గంటల ప్రాంతంలో జరిగినట్లు పోలీస్ అధికారులు చెబుతున్నారు. గుజరాత్‌లోని నదియాద్ ప్రాంతం ఆర్షద్ వోరా స్వస్థలం. -
డ్రగ్స్ స్మగ్లర్ల కాల్పులు: ముగ్గురు పోలీసులకు గాయాలు
వాషింగ్టన్: అమెరికాలోని చికాగాలో డ్రగ్స్ (మాదక ద్రవ్యాలు) స్మగ్లింగ్ ముఠా జరిపిన కాల్పుల్లో ముగ్గురు పోలీసు అధికారులు గాయపడ్డారు. నగరంలో మాదకద్రవ్యాల స్మగ్లింగ్ కార్యకలాపాలు కొనసాగుతున్నట్టు పోలీసులకు ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో అనుమానితులుగా భావించిన స్మగ్లింగ్ ముఠాను పట్టుకునేందుకు సోమవారం రాత్రి పోలీసులు యత్నించారు. దాంతో పోలీసులపై ఆ ముఠా సభ్యులు కాల్పులు జరిపారు. వెంటనే పోలీసులు కూడా ప్రతిదాడిగా ఎదురుకాల్పులు జరిపారు. దుండగుల కాల్పుల్లో గాయాలపాలైన పోలీసులు అధికారులను ఆస్పత్రికి తరలించినట్టు పోలీస్ శాఖ పేర్కొంది. కాగా, ఈ ఘటనపై చికాగో మేయర్ కార్యాలయం కూడా ఒక ప్రకటన విడుదల చేసింది. దుండగుల దాడిని ఎదుర్కొన్న పోలీసు అధికారులను ప్రశంసించింది. పోలీసుల కాల్పుల్లో అనుమానితులు ఇద్దరు స్మగ్లింగ్ ముఠా సభ్యులు మృతిచెందారు. -
చికాగోలో కాల్పులు: 13 మంది మృతి
వాషింగ్టన్ నేవీ యార్డ్‌లో దుండగుల కాల్పుల ఘటన మనోఫలకంపై నుంచి ఇంకా చెరగక ముందే చికాగో నగరంలో గురువారం అర్థరాత్రి మరో కాల్పుల ఘటన చోటు చేసుకుంది. చికాగో నగరంలోని దక్షిణ ప్రాంతంలోని కార్నెల్ స్క్వేర్ పార్క్‌లో గత అర్థరాత్రి దుండగులు విచక్షణ రహితంగా జరిపిన కాల్పుల్లో 13 మంది మరణించారని స్థానిక మీడియా శుక్రవారం వెల్లడించింది. మృతుల్లో 3 ఏళ్ల బాలుడు కూడా ఉన్నాడని పేర్కొంది. కాల్పుల ఘటనలో గాయపడిన వారు నగరంలోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని చెప్పింది. వారిలో నలుగురు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారని తెలిపింది. అయితే ఆ కేసు సంబంధించి ఇప్పటి వరకు ఎవరిని ఆదుపులోకి తీసుకోలేదని పేర్కొంది. అలాగే ఆ ఘటనకు బాధ్యలం తామే నంటు ఇంత వరకు ఏ సంస్థ ప్రకటించలేదని తెలిపింది. కాల్పుల ఘటన వెనక చికాగో నగరంలోని నేరస్థుల ముఠా ఈ ఘాతుకానికి ఒడిగట్టి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారని మీడియా ఈ సందర్భంగా వివరించింది. కాల్పుల ఘటనపై విచారణను పోలీసులు ముమ్మరం చేసినట్లు తెలిపింది.