![Two Including Gunman Killed In Shooting Spree At Chicago Hospital - Sakshi](/styles/webp/s3/article_images/2018/11/20/hospitol.jpeg.webp?itok=PZqTj2Je)
చికాగో ఆస్పత్రిలో కాల్పులు జరిగిన ప్రాంతం
చికాగో : అమెరికాలో సాయుధ ఉన్మాదుల కాల్పులకు బ్రేక్ పడటం లేదు. తాజాగా చికాగో ఆస్పత్రి పార్కింగ్ ప్రదేశంలో సాయుధ దుండగుడు జరిపిన కాల్పుల్లో ఇద్దరు మరణించగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మరణించిన వారిలో గన్‌మెన్ కూడా ఉన్నాడు. తొలుత ఆస్పత్రి పార్కింగ్ ప్రదేశంలో కాల్పులకు తెగబడిన దుండగుడు ఆ తర్వాత ఆస్పత్రిలో ప్రవేశించి కాల్పులు జరిపాడని స్ధానిక మీడియా వెల్లడించింది.
చికాగోలోని మెర్సీ ఆస్పత్రిలో జరిగిన కాల్పుల్లో పోలీస్ అధికారి మరణించాడని అధికారులు తెలిపారు. ఆస్పత్రి నుంచి తనకు కాల్పుల శబ్ధాలు స్పష్టంగా వినిపించాయని, పోలీసులు వచ్చిన తర్వాత కాల్పులు నిలిచిపోయాయని ప్రత్యక్ష సాక్షి సూ జిమెనజ్ చెప్పారు. కాగా,ఘటన అనంతరం పెద్ద ఎత్తున పోలీస్ బలగాలు ఆస్పత్రికి చేరుకున్నాయి. కాల్పులు నిలిచిపోయాయని, రోగులు సురక్షితంగా ఉన్నారని ఆస్ప్రతి వర్గాలు పేర్కొన్నారు.
కాల్పుల్లో గాయపడి యూనివర్సిటీ ఆఫ్ చికాగో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పోలీస్ అధికారిని చికాగో మేయర్ ఇమ్మానుయేల్, పోలీస్ సూపరింటెండెంట్ ఎడీ జాన్సన్ పరామర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment