వాషింగ్టన్: అమెరికాలోని చికాగాలో డ్రగ్స్ (మాదక ద్రవ్యాలు) స్మగ్లింగ్ ముఠా జరిపిన కాల్పుల్లో ముగ్గురు పోలీసు అధికారులు గాయపడ్డారు. నగరంలో మాదకద్రవ్యాల స్మగ్లింగ్ కార్యకలాపాలు కొనసాగుతున్నట్టు పోలీసులకు ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో అనుమానితులుగా భావించిన స్మగ్లింగ్ ముఠాను పట్టుకునేందుకు సోమవారం రాత్రి పోలీసులు యత్నించారు. దాంతో పోలీసులపై ఆ ముఠా సభ్యులు కాల్పులు జరిపారు.
వెంటనే పోలీసులు కూడా ప్రతిదాడిగా ఎదురుకాల్పులు జరిపారు. దుండగుల కాల్పుల్లో గాయాలపాలైన పోలీసులు అధికారులను ఆస్పత్రికి తరలించినట్టు పోలీస్ శాఖ పేర్కొంది. కాగా, ఈ ఘటనపై చికాగో మేయర్ కార్యాలయం కూడా ఒక ప్రకటన విడుదల చేసింది. దుండగుల దాడిని ఎదుర్కొన్న పోలీసు అధికారులను ప్రశంసించింది. పోలీసుల కాల్పుల్లో అనుమానితులు ఇద్దరు స్మగ్లింగ్ ముఠా సభ్యులు మృతిచెందారు.
డ్రగ్స్ స్మగ్లర్ల కాల్పులు: ముగ్గురు పోలీసులకు గాయాలు
Published Tue, Mar 15 2016 1:35 PM | Last Updated on Fri, May 25 2018 2:29 PM
Advertisement