చికాగోలో కాల్పులు: 13 మంది మృతి | 13 shot in Chicago park, including 3-year-old child | Sakshi
Sakshi News home page

చికాగోలో కాల్పులు: 13 మంది మృతి

Published Fri, Sep 20 2013 1:15 PM | Last Updated on Fri, Sep 1 2017 10:53 PM

13 shot in Chicago park, including 3-year-old child

వాషింగ్టన్ నేవీ యార్డ్లో దుండగుల కాల్పుల ఘటన మనోఫలకంపై నుంచి ఇంకా చెరగక ముందే చికాగో నగరంలో గురువారం అర్థరాత్రి మరో కాల్పుల ఘటన చోటు చేసుకుంది. చికాగో నగరంలోని దక్షిణ ప్రాంతంలోని కార్నెల్ స్క్వేర్ పార్క్లో గత అర్థరాత్రి దుండగులు విచక్షణ రహితంగా జరిపిన కాల్పుల్లో 13 మంది మరణించారని స్థానిక మీడియా శుక్రవారం వెల్లడించింది. మృతుల్లో 3 ఏళ్ల బాలుడు కూడా ఉన్నాడని పేర్కొంది.

 

కాల్పుల ఘటనలో గాయపడిన వారు నగరంలోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని చెప్పింది.  వారిలో నలుగురు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారని తెలిపింది. అయితే ఆ కేసు సంబంధించి ఇప్పటి వరకు ఎవరిని ఆదుపులోకి తీసుకోలేదని పేర్కొంది. అలాగే ఆ ఘటనకు బాధ్యలం తామే నంటు ఇంత వరకు ఏ సంస్థ ప్రకటించలేదని తెలిపింది. కాల్పుల ఘటన వెనక చికాగో నగరంలోని నేరస్థుల ముఠా ఈ ఘాతుకానికి ఒడిగట్టి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారని మీడియా  ఈ సందర్భంగా  వివరించింది. కాల్పుల ఘటనపై విచారణను పోలీసులు ముమ్మరం చేసినట్లు తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement