
చికాగో: ఈరోజుల్లో అమ్మాయిలను పడేయాలంటే చాలా కష్టం. అస్సలు వాళ్లను ఎలా పడేయాలో తెలియక కొందరు కుర్రాళ్లు పిచ్చోళ్లవుతున్నారు. ఏళ్ల తరబడి వారి ప్రేమ కోసం నిరీక్షణ చేస్తారు. అందుకే కొందరు యువకులు తమ బుర్రకు తట్టిన కొత్త ఆలోచనలు వినూత్నంగా ట్రై చేసి అమ్మాయిలను పడేస్తున్నారు. చికాగోకు చెందిన బాబ్ లెంపా వ్యక్తి ఇలా తన గర్ల్‌ఫ్రెండ్‌ను ప్రపోజ్ చేయడానికి చికాగోలోని మ్యాగీ డాలే పార్క్‌ను ఎంచుకున్నాడు.
తన గర్ల్‌ఫ్రెండ్ పెగ్గీ బేకర్ డాలే పార్క్‌కు సమీపంలోని అపార్ట్‌మెంట్‌లో 37వ ఫ్లోర్‌లో ఉంటుంది. తనకు 37వ ఫ్లోర్ నుంచి చూసినా తన ప్రపోజల్ మెసేజ్ కనిపించాలని.. 45 అడుగుల పొడవు, 31 అడుగుల వెడల్పుతో 'మ్యారీ మీ' అనే మెసేజ్‌ను మంచులో తయారు చేశాడు. దాన్ని గీయడానికి అతనికి 6 గంటల సమయం పట్టింది. చాలామంది దాన్ని గమనించినా అంతగా పట్టించుకోలేదు. తొలుత ఆమె చూసి వామ్మో ఇంత పెద్దగా ఎవరు గీశారని అనుకుది. చివరికి ఆ ప్రపోజల్ తనకోసమే అని తెలిసి భావోద్వేగానికి గురైంది పెగ్గీ.
అనంతరం తన బోయ్‌ఫ్రెండ్‌కు ఎస్ చెప్పేసింది. దీంతో వాళ్లిద్దరూ ఒక్కటయిపోయారు. ఇక.. ఈ ప్రపోజల్ మెసేజ్‌ను పార్క్ సిబ్బంది ఫోటో తీసి తమ సోషల్ మీడియా అకౌంట్‌లో షేర్ చేసి అతడి ప్రపోజల్, దానికి ఆ యువతి ఒప్పుకోవడం.. మీరెప్పుడైనా చికాగో పార్క్‌లో ప్రపోజ్ చేశారా? అంటూ వాళ్లు క్యాప్షన్ పెట్టడంతో.. ఆ ఫోటోతో పాటు... వాళ్ల స్టోరీ కూడా వైరల్‌గా మారింది.