చికాగో : ఎస్.386 బిల్లు(ఫెయిర్‌నెస్ ఫర్ హై స్కిల్డ్ ఇమిగ్రెంట్స్ యాక్ట్ 2019)కు సెనేటర్ డిక్ డర్బిన్ మద్దతు కోరటంపై చికాగోలోని అన్ని భారతీయ సంఘాలు కార్యాచరణ ప్రాణాళిక రూపొందించాయి. ఈ మేరకు గత ఆదివారం నగరంలోని షిర్ధిసాయి మందిరంలో సమావేశమయ్యాయి. దాదాపు మూడు వందల మంది ఔత్సాహికులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సెనెట్‌లో బిల్లును ముందుకు నడిపించే విషయానికి సంబంధించి మేథోమధనం జరిగింది. తమ తమ అనుభవాలను ఈ సందర్భంగా వారు గుర్తుచేసుకున్నారు. నైపుణ్యం కల్గిన వలసదారుల కుటుంబాలకు కలుగుతున్న ఇబ్బందులను వారు చర్చించారు. కార్యనిర్వాహకులు వెంకటరామిరెడ్డి రవి, మనోజ్ కుమార్ సింగమ్‌శెట్టిలు హెచ్1బి వీసా కల్గిన కుటుంబాలు ఎదుర్కొంటున్న సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చారు.
భారతీయ సంఘాలు తానా, ఆటా, గుజరాత్ అసోషియేషన్, బెంగాలీ అసోషియేషన్, నాచా, కేరళ అసోషియేషన్ ఆఫ్, నాస్‌విల్లే, ఐఏజీసీ,టాటా, టీఏజీసీ, నాట్స్, టీటీఏ, సీఏఏ,వీహెచ్‌ఐఏ,నాటా, టీడీఎఫ్, ఆటా తెలంగాణ, ఫోమా, చికాగో తమిళ్ సంఘం బిల్లుకు డిక్ మద్దుతు తెలిపేలా చేసేందుకు అన్ని రకాలుగా కృషి చేస్తామని తెలిపాయి. జీసీ బాక్‌లాగ్ సమస్య ఉన్నవారు immi.gcbacklog@gmail.comతో సలహాలు, సూచనలు పొందగలరని తెలిపారు.
ఎస్.386 బిల్లుకు మద్దతుపై భారతీయ సంఘాల కార్యచరణ
Published Wed, Oct 2 2019 8:54 PM | Last Updated on Wed, Oct 2 2019 9:32 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment