Indian organizations
-
ఎస్.386 బిల్లుకు మద్దతుపై భారతీయ సంఘాల కార్యచరణ
చికాగో : ఎస్.386 బిల్లు(ఫెయిర్‌నెస్ ఫర్ హై స్కిల్డ్ ఇమిగ్రెంట్స్ యాక్ట్ 2019)కు సెనేటర్ డిక్ డర్బిన్ మద్దతు కోరటంపై చికాగోలోని అన్ని భారతీయ సంఘాలు కార్యాచరణ ప్రాణాళిక రూపొందించాయి. ఈ మేరకు గత ఆదివారం నగరంలోని షిర్ధిసాయి మందిరంలో సమావేశమయ్యాయి. దాదాపు మూడు వందల మంది ఔత్సాహికులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సెనెట్‌లో బిల్లును ముందుకు నడిపించే విషయానికి సంబంధించి మేథోమధనం జరిగింది. తమ తమ అనుభవాలను ఈ సందర్భంగా వారు గుర్తుచేసుకున్నారు. నైపుణ్యం కల్గిన వలసదారుల కుటుంబాలకు కలుగుతున్న ఇబ్బందులను వారు చర్చించారు. కార్యనిర్వాహకులు వెంకటరామిరెడ్డి రవి, మనోజ్ కుమార్ సింగమ్శెట్టిలు హెచ్1బి వీసా కల్గిన కుటుంబాలు ఎదుర్కొంటున్న సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చారు. భారతీయ సంఘాలు తానా, ఆటా, గుజరాత్ అసోషియేషన్, బెంగాలీ అసోషియేషన్, నాచా, కేరళ అసోషియేషన్ ఆఫ్, నాస్విల్లే, ఐఏజీసీ,టాటా, టీఏజీసీ, నాట్స్, టీటీఏ, సీఏఏ,వీహెచ్ఐఏ,నాటా, టీడీఎఫ్, ఆటా తెలంగాణ, ఫోమా, చికాగో తమిళ్ సంఘం బిల్లుకు డిక్ మద్దుతు తెలిపేలా చేసేందుకు అన్ని రకాలుగా కృషి చేస్తామని తెలిపాయి. జీసీ బాక్లాగ్ సమస్య ఉన్నవారు immi.gcbacklog@gmail.comతో సలహాలు, సూచనలు పొందగలరని తెలిపారు. -
మందుల తయారీ భేష్
* 210 దేశాలకు ఎగుమతి * నకిలీ మందులకు అడ్డుకట్ట * ఐఎండీఏ ప్రదర్శనలో జాతీయ అధ్యక్షులు చెన్నై, సాక్షి ప్రతినిధి: భారతీయ సంస్థలు అంతర్జాతీయ నాణ్యత కలిగిన మందులను తయారుచేసే స్థాయికి చేరుకున్నాయని ఇండియన్ డ్రగ్స్ మాన్యుఫ్యాక్చర్స్ అసోసియేషన్ (ఐఎండీఏ) అధ్యక్షులు వీ.వీరమణి తెలిపారు. అందుకే 210 దేశాల్లో భారతీయ ఉత్పత్తులను వినియోగిస్తున్నారని చెప్పారు. ఐఎండీఏ- పారామాక్ సౌత్-2014 పేరుతో చెన్నై ట్రేడ్‌సెంటర్‌లో రెండు రోజుల ప్రదర్శనను శుక్రవారం ఆయన ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడి యా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశం లో అన్ని వస్తువుల ధరలు పెరుగుతుండగా, మందుల ధరలను మాత్రం తగ్గిస్తున్నామని తెలిపారు. దేశం మొత్తం డొమెస్టిక్ మందుల వాడకం రూ.70 వేల కోట్లుకాగా ఇందులో దక్షిణాది రాష్ట్రాల వాటా 30 శాతమన్నారు. అలాగే రూ.90వేల కోట్ల విదేశీ ఎగుమతుల్లో 30 శాతం దక్షిణాది రాష్ట్రాల ఘనతగా ఆయన పేర్కొన్నారు. విదే శాల నుంచి ఆర్డర్లు పొందడం అంత సులువుకాదన్నారు. ఆయా దేశాల ప్రతినిధులు భారత్‌కు వచ్చి ఉత్పత్తి విధానాన్ని క్షుణ్ణంగా పరిశీలించిగానీ ఎగుమతులకు అంగీకరించరని తెలిపారు. దక్షిణాది రాష్ట్రాలకు చెందిన 200 ప్రముఖ మందుల కంపెనీలు తమ ఉత్పత్తులను రెండురోజుల పాటు ప్రదర్శిస్తున్నాయని తెలిపారు. ఆరోగ్యకరమైన భారత ప్రగతికి ఫార్మాస్యూటికల్స్ కంపెనీల అభివృద్ధి ఎంతో దోహదపడుతుందని అన్నారు. డెప్యూటీ డ్రగ్స్ కంట్రోలర్ ఎస్ మణివ ణ్ణన్ మాట్లాడుతూ నకిలీ మందుల చలామణి దాదాపు అరికట్టామని ఒక ప్రశ్నకు సమాధానంగా చె ప్పారు. 20 ఏళ్ల క్రితం ఎక్కువగా ఉండినా ప్రస్తుతం .004 శాతానికి తీసుకువచ్చామని తెలిపారు. నకిలీల అడ్డుకట్టకు, కాలం చెల్లిన మందులు అమ్మకుండా కట్టడిచేసేందుకు గతంలో కంటే పెద్దసంఖ్యలో డ్రగ్స్ ఇన్స్పెక్టర్లు పనిచేస్తున్నారని తెలిపారు. ల్యాబ్‌ల సంఖ్యకూడా పెంచామన్నారు. ఐఎండీఏ తమిళనాడు శాఖ చైర్మన్ ఎం.రాజరత్నం, వైస్ చైర్మన్ జయశీలన్ మాట్లాడుతూ దేశంలో నకిలీ నోట్ల చలామణిలా నకిలీ మందులని, ఎంతగా నిఘా పెట్టినా కొన్ని మార్కెట్టుకు చేరుతున్నాయని తెలిపారు. పేరొందిన సంస్థలు ఎంతమాత్రం నకిలీలను ఉత్పత్తి చేయడం లేదని ఆయన గుర్తుచేశారు.