మందుల తయారీ భేష్ | Preparation of drugs : imda | Sakshi
Sakshi News home page

మందుల తయారీ భేష్

Published Sat, Jul 19 2014 12:20 AM | Last Updated on Sat, Sep 2 2017 10:29 AM

మందుల తయారీ భేష్

మందుల తయారీ భేష్

* 210 దేశాలకు ఎగుమతి
* నకిలీ మందులకు అడ్డుకట్ట
* ఐఎండీఏ ప్రదర్శనలో జాతీయ అధ్యక్షులు

చెన్నై, సాక్షి ప్రతినిధి: భారతీయ సంస్థలు అంతర్జాతీయ నాణ్యత కలిగిన మందులను తయారుచేసే స్థాయికి చేరుకున్నాయని ఇండియన్ డ్రగ్స్ మాన్యుఫ్యాక్చర్స్ అసోసియేషన్ (ఐఎండీఏ) అధ్యక్షులు వీ.వీరమణి తెలిపారు. అందుకే 210 దేశాల్లో భారతీయ ఉత్పత్తులను వినియోగిస్తున్నారని చెప్పారు. ఐఎండీఏ- పారామాక్ సౌత్-2014 పేరుతో చెన్నై ట్రేడ్‌సెంటర్‌లో రెండు రోజుల ప్రదర్శనను శుక్రవారం ఆయన ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడి యా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశం లో అన్ని వస్తువుల ధరలు పెరుగుతుండగా, మందుల ధరలను మాత్రం తగ్గిస్తున్నామని తెలిపారు.

దేశం మొత్తం డొమెస్టిక్ మందుల వాడకం రూ.70 వేల కోట్లుకాగా ఇందులో దక్షిణాది రాష్ట్రాల వాటా 30 శాతమన్నారు. అలాగే రూ.90వేల కోట్ల విదేశీ ఎగుమతుల్లో 30 శాతం దక్షిణాది రాష్ట్రాల ఘనతగా ఆయన పేర్కొన్నారు. విదే శాల నుంచి ఆర్డర్లు పొందడం అంత సులువుకాదన్నారు. ఆయా దేశాల ప్రతినిధులు భారత్‌కు వచ్చి ఉత్పత్తి విధానాన్ని క్షుణ్ణంగా పరిశీలించిగానీ ఎగుమతులకు అంగీకరించరని తెలిపారు. దక్షిణాది రాష్ట్రాలకు చెందిన 200 ప్రముఖ మందుల కంపెనీలు తమ ఉత్పత్తులను రెండురోజుల పాటు ప్రదర్శిస్తున్నాయని తెలిపారు.

ఆరోగ్యకరమైన భారత ప్రగతికి ఫార్మాస్యూటికల్స్ కంపెనీల అభివృద్ధి ఎంతో దోహదపడుతుందని అన్నారు. డెప్యూటీ డ్రగ్స్ కంట్రోలర్ ఎస్ మణివ ణ్ణన్ మాట్లాడుతూ నకిలీ మందుల చలామణి దాదాపు అరికట్టామని ఒక ప్రశ్నకు సమాధానంగా చె ప్పారు. 20 ఏళ్ల క్రితం ఎక్కువగా ఉండినా ప్రస్తుతం .004 శాతానికి తీసుకువచ్చామని తెలిపారు. నకిలీల అడ్డుకట్టకు, కాలం చెల్లిన మందులు అమ్మకుండా కట్టడిచేసేందుకు గతంలో కంటే పెద్దసంఖ్యలో డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్లు పనిచేస్తున్నారని తెలిపారు. ల్యాబ్‌ల సంఖ్యకూడా పెంచామన్నారు. ఐఎండీఏ తమిళనాడు శాఖ చైర్మన్ ఎం.రాజరత్నం, వైస్ చైర్మన్ జయశీలన్ మాట్లాడుతూ దేశంలో నకిలీ నోట్ల చలామణిలా నకిలీ మందులని, ఎంతగా నిఘా పెట్టినా కొన్ని మార్కెట్టుకు చేరుతున్నాయని తెలిపారు. పేరొందిన సంస్థలు ఎంతమాత్రం నకిలీలను ఉత్పత్తి చేయడం లేదని ఆయన గుర్తుచేశారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement