
సాక్షి, హైదరాబాద్: అఖిల భారతీయ అభ్యుదయ రచయితల సంఘం జాతీయ అధ్యక్షుడిగా తెలుగు రచయిత పెనుగొండ లక్ష్మీనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఈయన దాదాపు 45 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘంలో వివిధ హోదాల్లో పనిచేశారు. ప్రధాన కార్యదర్శిగా, అధ్యక్షుడిగా పనిచేశారు. ఎనిమిదేళ్లుగా జాతీయ కార్యదర్శిగా ఉన్నారు.
పెనుగొండ లక్ష్మీనారాయణ వివిధ విమర్శనా గ్రంథాలు రాశారు. అనేక కథాసంపుటాలకు సంపాదకులుగా వ్యవహరించారు. పలు రాష్ట్ర మహాసభలకు నేతృత్వం వహించారు. కాగా జాతీయ అధ్యక్షులుగా పెనుగొండ, ఆంధ్రప్రదేశ్ అభ్యదయ రచయిత సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాచపాళెం, ప్రధాన కార్యదర్శిగా వల్లూరు శివప్రసాద్ జాతీయ కార్యదర్శివర్గ సభ్యులుగా ఎన్నికయ్యారు.