
శంషాబాద్ : అప్పుల బాధ భరించలేక కుటుంబంతో సహా ఓ వ్యక్తి అదృశ్యమైన సంఘటన శంషాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలి్పన మేరకు..మొయినాబాద్ మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన డి.సుదర్శన్ వివాహనం అనంతరం అత్తగారిల్లు ఉన్న కర్మన్‌ఘాట్‌లో ఏడేళ్లు, ఆ తర్వాత శంషాబాద్ పట్టణంలో ఏడాది కాలం నివసించాడు.
రెండు చోట్లా అప్పులు కావడంతో గత మూడేళ్లుగా నర్కూడ గ్రామంలో నివాసం ఉంటున్నాడు. ఇటీవల చీటీ డబ్బుల వసూలు కోసం ప్రభాకర్ అనే వ్యక్తి సుదర్శన్ ఇంటికి వెళ్లగా వారు ఇంట్లో కన్పించకపోవడంతో వారి తల్లికి విషయం తెలిపాడు. ఈ విషయమైన సుదర్శన్ సోదరుడు భానుప్రకాష్ అద్దె ఇంట్లో ఆరా తీయగా సుదర్శన్‌తో పాటు ఆయన భార్య తేజస్వి, ఇద్దరు కుమారులు ఇక్కడ ఉండడం లేదని వెల్లడైంది.
ఈ నెల 18 నుంచి వారు ఇంట్లో లేరని తెలియడంతో భానుప్రకాష్ వారి కోసం అన్ని చోట్లా ఆరా తీసినా ఆచూకీ లభించలేదు. అప్పుల ఒత్తిడి కారణంగానే ఎక్కడికైనా వెళ్లి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. భానుప్రకాష్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment