చికాగో : ‘చిన్మయ మిషన్’ ఎన్‌డబ్య్లూఐ చరిత్రలో 2019 జూలై 27 స్వర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు. ఈ రోజు చిన్మయ ఓంకార సొంత నూతన భవన ప్రారంభోత్సవం ఆనందోత్సాహముల మధ్య ఘనంగా జరిగింది. కార్యక్రమానికి చిన్మయ మిషన్ గ్లోబల్ హెడ్ స్వామి స్వరూపానంద ప్రత్యేక అతిథిగా విచ్చేశారు. వారి దివ్య హస్తముల మీదుగా నూతన భవన ఆవిష్కరణ కన్నుల పండగగా జరిగింది. నూతన భవన సంప్రోక్షణ వైదిక శాస్త్రానుసారముగా భారతీయ దేవాలయం పండితులు శ్రీ వాసుదేవజీ ఆధ్వర్యంలో గణపతి హోమం, అభిషేకం, అలంకారం, అర్చన కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా చిన్మయ బాలవిహార్ పిల్లలు సమర్పించిన ప్రథమ గానం, నృత్యం విశేషంగా నిలిచాయి. పూజా కార్యక్రమాల అనంతరం భక్తులు శ్రీ స్వామి స్వరూపానందవారి ఆశీస్సులు స్వీకరించి, విందు భోజనం చేశారు. చిన్మయ ఓంకార నూతన విద్యా సంవత్సరం సెస్టెంబర్ 8 ఆదివారం నుంచి మొదలవుతుందని తెలిపారు. చిన్మయ మిషన్ ఎన్‌డబ్య్లూఐ కార్యక్రమానికి విచ్చేసిన అతిథితులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమానికి చిన్మయ మిషన్ చికాగో నుంచి స్వామి శరణానంద, స్వామి స్వప్రభానంద, ఆచార్యులు జితేంద్ర, పలువురు ప్రముఖులు విచ్చేశారు.
Comments
Please login to add a commentAdd a comment