చికాగో : ఇల్లినాయిస్ ఇమ్మిగ్రేషన్ ఫోరం ఆధ్వర్యంలో 'స్టాండ్ ఫర్ ఈక్వాలిటీ' పేరుతో నవంబర్ 3, 2019 న నార్త్ చికాగోలోని ఓ డోనోవన్ రెస్టారెంట్ ఎదురుగా కమిటీ సభ్యులు నిరసన చేపట్టారు. ద్వి పక్షపాత ఏకగ్రీవ సమ్మతి కోసం గౌరవ సెనేటర్ డర్బిన్ బ్లాక్ లీ-హారిస్ S.386 / HR.1044 - 2019 వలసదారుల చట్టాన్ని కొనసాగించాలంటూ నిరసనకారులు ఆందోళన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున వలసదారులు హాజరై తమ నిరసనను తెలిపారు. స్టాండ్ ఫర్ ఈక్వాలిటీ ఫ్లకార్డులతో నిరసన నిర్వహించారు.
యూఎస్‌లో హాఫ్ మిలియన్‌కు పైగా వలసదారులు అధిక నైపుణ్యం కలిగి ఉన్నారు. అయితే గ్రీన్ కార్డ్ బ్యాక్‌లాగ్ ఉపాధి ఆధారిత కేటాయింపులలో ప్రభుత్వం ఏకపక్ష రీతిలో వ్యవహరిస్తుంది. జూలై 2019 లో HR.1044 కు సంబందించి ప్రవేశపెట్టిన బిల్లును హౌస్‌లో అధిక మెజారిటీతో ఆమోదించారు. అయితే తాజాగా ఇదే బిల్లును సెనెట్ హౌస్‌లో ప్రవేశపెట్టినప్పుడు బిల్లును ఆమోదించడానికి అడ్డు చెప్పారు. దీంతో సోమవారం వేల మంది నిరసనకారులు ఫ్లకార్డులతో 'స్టాండ్ ఫర్ ఈక్వాలిటీ' నినాదాలు చేస్తూ చికాగో వీధులన్ని కలియతిరిగారు.
Comments
Please login to add a commentAdd a comment