ఇల్లినాయిస్ : ఇల్లినాయిస్ ఇమ్మిగ్రేషన్ ఫోరం ఆధ్వర్యంలో అక్టోబర్ 10న లీ-హారిస్ ఎస్- 386, హెచ్‌ఆర్- 1044 ఫెయిర్‌నెస్ చట్టం పాస్ చేయాలని కోరుతూ ఇల్లినాయిస్‌లోని సిటీ హాల్ నుంచి ఫెడరల్ భవనం వరకు 'వాక్ ఫర్ ఈక్వాలిటీ' పేరుతో కమ్యూనిటీ ర్యాలీని నిర్వహించింది. రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది వలసదారులు దీనిలో పాల్గొని కార్యక్రమానికి మద్దతుగా తమ సంఘీభావాన్ని తెలియజేశారు. భారీ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా వందలాది కుటుంబాలు తమ పిల్లలతో కలిసి టీ షర్టులు ధరించి 'వాక్ ఫర్ ఈక్వాలిటీ' ప్లకార్డులుతో డౌన్ టౌన్ నుంచి శాంతియుత ప్రదర్శన చేపట్టారు.
'మా పిల్లలకు సహాయం చేయండి, అమెరికాను ప్రేమిస్తున్నాం, జాతీయ మూలం వివక్షను అంతం చేయండి, గ్రీన్ కార్డ్ సమానత్వానికి మద్దతు ఇవ్వండి, స్వీయ- బహిష్కరణకు బలవంతం చేయవద్దు, ఎస్.386, హెచ్‌ఆర్- 1044ని నిరోధించవద్దంటూ నినాదాలు చేస్తూ ముందుకు సాగారు.నిరసన చేపట్టిన ఇల్లినాయిస్ ఇమ్మిగ్రేషన్ ఫోరం మాట్లాడుతూ.. హై స్కిల్డ్ ఇమ్మిగ్రెంట్స్ ఫెయిర్‌నెస్ చట్టం ఉపాధి ఆధారిత గ్రీన్ కార్డులను స్వీకరించడానికి 'ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్' పేరుతో నిర్వహించడం వల్ల అమెరికాలో నివసిస్తున్న లక్షల మంది భారతీయులు, ఇతర దేశాలకు చెందిన వారిపై వివక్ష తగ్గే అవకాశం ఉంటుందని తెలిపారు. దీనికి సంబంధించి ఫెడరల్ హౌస్ జూలై 2019లో హెచ్‌ఆర్- 1044 బిల్లును ఆమోదించింది. ఇల్లినాయిస్ కు చెందిన 18 మంది సెనెట్ ప్రతినిధుల బృందం తమకు సమ్మతమేనంటూ ఓటు కూడా వేశారని తెలిపారు. సెనేట్‌లోని ప్రతి రిపబ్లికన్ ఈ బిల్లుకు మద్దతు ఇస్తున్నారని, వారికి ఎలాంటి అభ్యంతరాలు లేవని ఇమ్మిగ్రేషన్ ఫోరం పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment