awareness programme
-
శిశువు రక్షణ అందరి బాధ్యత! కానీ ఇప్పటికీ..
పుట్టిన బిడ్డ సురక్షితంగా, ఆరోగ్యంగా ఉండాలని తల్లితో పాటు ఆ కుటుంబం కూడా తపిస్తుంటుంది. అయితే, ఈ విషయంలో సరైన అవగాహన ఉండటం లేదనేది వైద్యుల మాట. ఎందుకంటే, ఇప్పటికీ భారతదేశంలో నవజాత శిశు మరణాల రేటు ఆందోళనకరంగానే ఉంది. యూరప్‌లో 1990ల మొదట్లో శిశు మరణాల రేటును తగ్గించడానికి చర్యలు తీసుకోవడంలో, అవగాహన కల్పించేందుకు నవంబర్ 7ను శిశు రక్షణ దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయించాయి. ఆ తర్వాత అమెరికా, మిగతా దేశాలు కూడా ఈరోజు శిశు రక్షణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి. నవజాత శిశువులలో రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి, శిశు మరణాల రేటును తగ్గించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో అవగాహన కల్పించడమే దీని ముఖ్య ఉద్దేశ్యం. ఈ విషయంలో నిపుణుల అభిప్రాయాలు తీసుకోవడం తప్పనిసరి. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోవాలి ప్రెగ్నెన్సీ అని తెలియగానే కాబోయే తల్లితోపాటు, ఆ కటుంబం కూడా జాగ్రత్త పడాలి. మన దగ్గర రక్తహీనత సమస్య, పోషకాహార లేమి ఎక్కువ. దీనివల్ల బేబీ గ్రోత్ మందగిస్తుంది. గర్భిణుల్లో హైపో థైరాయిడ్ సమస్య ఎక్కువ చూస్తున్నాం. ఐరన్ లోపం, రసాయనాల ఆహారం తీసుకోవడం వల్ల ఇలా జరుగుతుంటుంది. తల్లి ఆరోగ్యం సరిగాలేకపోతే లోపల బేబీ శరీర, మానసిక ఎదుగుదలపైన ప్రభావం చూపుతుంది. బీపీ, షుగర్.. వంటి సమస్యలు ఉన్నప్పుడు వాటికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునేవారు ముందునుంచే వైద్యులు చెప్పిన టైమ్‌కి వ్యాక్సిన్లు తీసుకోవడం వల్ల వైరల్ ఇన్ఫెక్షన్లను నివారించవచ్చు. తల్లి మానసిక ఆరోగ్యం కూడా బాగుండాలి. అందుకు, సైకలాజికల్ కౌన్సెలింగ్ కూడా తీసుకోవడం ముఖ్యం. వైద్యులు చెప్పిన సూచనలు పాటించాల్సి ఉంటుంది. లేకపోతే కుటుంబం అంతా భవిష్యత్తులో రాబోయే సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. – డాక్టర్ శిరీషా రెడ్డి, గైనకాలజిస్ట్, తార్నాక, హైదరాబాద్ ప్రమాదాలను ముందే పసిగట్టాలి నెలలు నిండకుండా పుట్టడం, బరువు తక్కువుండి పుట్టడం, ఇన్ఫెక్షన్స్, పోషకాహార లోపం వల్ల శిశు మరణాలు ఎక్కువగా సంభవిస్తుంటాయి. ఏడాదిలోపు పిల్లలను నవజాత శిశువులు అంటారు. ఈ సమయంలో సులువుగా ఇన్ఫెక్షన్స్ సోకుతుంటాయి. అందుకే, వీరిని చాలా జాగ్రత్తగా చూసుకోవడం అవసరం. ఏడాదిలోపు వచ్చే ఆరోగ్య సమస్యలను నివారించగలిగితే ఆ తర్వాత వచ్చే సమస్యలను సులువుగా అధిగమించవచ్చు. మొదటి ఆరు నెలలు తల్లిపాలు మాత్రమే పట్టడం అవసరం, ఆరోగ్యం కూడా. ఆ తర్వాత వారికి ఇచ్చే పోషకాహారం చాలా ముఖ్యం. దీంతోపాటు వ్యాక్సినేషన్ చేయించడం ముఖ్యం. ఎందుకంటే, నిమోనియా, డయేరియా వల్ల మరణాలు ఎక్కువ. అందుకే, ప్రభుత్వం కూడా డయేరియా, న్యూమోనియా.. వ్యాక్సినేషన్ జాబితాలో చేర్చింది. పిల్లల వైద్యనిపుణుల పర్యవేక్షణ చాలా అవసరం. కొన్ని గ్రామీణ ప్రాంతాల వారికి ఈ సౌకర్యం అందుబాటులో లేకపోవచ్చు. కానీ, రెగ్యులర్ హెల్త్ చెకప్ అనేది ముఖ్యం అని తెలుసుకోవాలి. ఇక నవజాత శిశువులకు దెబ్బలు తగిలే అవకాశం కూడా ఉంది. మంచంపై నుంచి కింద పడటం వంటివి. చిన్న దెబ్బలు కూడా పెద్దవి కావచ్చు. మదర్ పోస్ట్ ప్యాటర్న్ డిప్రెషన్లో ఉన్నప్పుడు బిడ్డను చూసుకునేవారుండరు. ఇలాంటప్పుడు కూడా శిశువు సంరక్షణ ప్రమాదంలో పడుతుంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని కుటుంబం జాగ్రత్త వహించాలి. – ప్రియాంకరెడ్డి, పిడియాట్రిషియన్, మాదాపూర్, హైదరాబాద్ ఒకరి ద్వారా మరొకరికి సూచనలు మేం గర్భిణులపై ఎక్కువ ఫోకస్ పెడుతుంటాం. ఎందుకంటే, వారి ఆరోగ్యం బాగుంటేనే పుట్టబోయే బిడ్డ బాగుంటుంది. ఆరోగ్యం, పౌష్టికాహారంతో పాటు ఇంటి నుంచి ఆసుపత్రికి వెళ్లేవరకు ఎలా చూసుకోవాలో ఆమెకే కాదు, ఇంటిల్లిపాదికీ కౌన్సెలింగ్ ఇస్తాం. ఎంత చెప్పినా వినిపించుకోని వారు కొందరుంటారు. అయినా వారిని వదలకుండా తల్లి అయిన వారితో కౌన్సెలింగ్ ఇప్పిస్తాం. చార్ట్ ప్రకారం వాళ్లు తీసుకోవాల్సిన పోషకాహారం, మందులు కూడా అంగన్వాడీ నుంచి ఇస్తుంటాం. చంటిపిల్లల విషయంలో మేం తగు జాగ్రత్తలు చెప్పడంతో పాటు, ఏ సమయానికి వ్యాక్సిన్లు వేయించాలి, ఎలా చూసుకోవాలి అనే విషయాలపైన తల్లులకు ఒకరి ద్వారా మరొకరు సూచనలు చేసుకునేలా కౌన్సెలింగ్ చేస్తుంటాం. దీనివల్ల నవజాత శిశు మరణాల రేటు తగ్గడమే కాకుండా శిశువులు ఆరోగ్యంగా పెరిగేందుకు దోహదం చేస్తుంది. – వెంకటరమణ, అంగన్వాడీ టీచర్, ఖాసింపేట, సూర్యపేట జిల్లా (చదవండి: మత్తు కోసం పాము విషమా?..అందుకోసం పార్టీల్లో..) -
చంద్రయాన్–3పై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం
హైదరాబాద్: చంద్రుడి దక్షిణ దవంపై చంద్రయాన్–3 ద్వారా అడుగు పెట్టిన భారతదేశ శాస్త్రవేత్తల ఘనతపై బంజారహిల్స్ నందినగర్‌లోని ఖుష్బూ విద్యానికేతన్ స్కూల్లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రయోగంలోని సాంకేతికతకు సంబంధించిన వివరాలను విద్యార్థులకు తెలియజేశారు. ఇస్రో శాస్త్రవేత్తలు విక్రమ్ ల్యాండర్ ప్రత్యేకతలతో పాటు అక్కడి స్థితి గతులను అది ఏ విధంగా పంపిస్తుందో వంటి ఆసక్తికరమైన విషయాలను పాఠశాలలోని సైన్స్ టీచర్ రేష్మ విద్యార్థులకు వివరించారు. ఇలాంటి కార్యక్రమాల వల్ల చిన్నారుల్లో శాస్త్రసాంకేతిక రంగాలపై ఆసక్తి పెరుగుతుందని ప్రిన్సిపాల్ రాజ్‌దేవి తెలిపారు. ఈ సందర్భంగా చంద్రయాన్ ప్రయోగంపై 5వ తరగతి విద్యార్థి సయ్యద్ మోయినుద్దీన్ ఖాదర్ రూపొందించిన ప్రజంటేషన్ను ఉపాధ్యాయులు అభినందించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ఉపాధ్యాయులు పవన్ తదితరులు పాల్గొన్నారు. ఇదీ చదవండి: PM Modi ISRO Visit Highlights: బెంగళూరులో మోదీ.. 'జై విజ్ఞాన్, జై అనుసంధాన్' నినాదాలు -
యాప్‌తో దశ‘దిశ’లా రక్షణ...
తోట్లవల్లూరు(పామర్రు): మహిళల భద్రతే లక్ష్యంగా దిశ యాప్‌ను ప్రభుత్వం తీసుకొచ్చిందని, దీనిని ప్రతి మహిళ సద్వినియోగం చేసుకోవాలని విజయవాడ నగర పోలీస్ కమిషనర్ బత్తిన శ్రీనివాసులు అన్నారు. మండలంలోని పెనమకూరు జెడ్పీ పాఠశాలలో దిశ యాప్‌పై అవగాహన సదస్సు గురువారం సాయంత్రం జరిగింది. ఆపదలో ఉన్న మహిళలకు దిశ యాప్ రక్షణ కవచంలా ఉపయోగపడుతుందని శ్రీనివాసులు తెలియజేశారు. మహిళలు, విద్యార్థినులు, యువతులు దిశ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. ఒంటరిగా ఆటోలు, క్యాబ్‌లలో ప్రయాణించే మహిళలు ట్రాక్ మై రూట్ ఆప్షన్ వినియోగించుకుంటే, వారు వెళ్లే రూట్‌ను ట్రాక్ చేస్తామన్నారు. సరైన రూట్లో ఆ వాహనం వెళ్లనట్లయితే వెంటనే సంబంధిత ప్రాంతపు పోలీసులను అప్రమత్తం చేస్తామన్నారు. అలాగే ఈవ్‌టీజింగ్, వేధింపులతోపాటు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా మొబైల్ ఫోన్‌ను మూడు సార్లు కదిపితే నిమిషాల వ్యవధిలో పోలీసులు వచ్చి ఆదుకుంటారని శ్రీనివాసులు వివరించారు. ఒంటరిగా ఉండే వృద్దులు సైతం ఈ యాప్‌ను వినియోగించుకోవచ్చని ఆయన అన్నారు. అక్క, చెల్లెమ్మల భద్రతే సీఎం లక్ష్యం.. రాష్ట్రంలో ప్రతి అక్క, చెల్లెమ్మ భద్రతే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లక్ష్యమని పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్ పేర్కొన్నారు. మహిళా సాధికారతకు ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందన్నారు. పాదయాత్రలో ఇచ్చిన ప్రతిహామీని సీఎం గడచిన రెండేళ్లలో చిత్తశుద్ధితో అమలు చేశారని చెప్పారు. దిశ యాప్‌ను ప్రతి ఒక్కరూ డౌన్లోడ్ చేసుకోవాలని, అవగాహన సదస్సుకు తోట్లవల్లూరు, పమిడిముక్కల మండలాల నుంచి మహిళలు భారీగా రావటం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. దిశ యాప్ డౌన్లోడ్, ఉపయోగాల గురించి మహిళా పోలీసు అధికారులు వివరించారు. సర్పంచి నందేటి గంగాభవాని, డీసీపీ హర్షవర్ధన్‌రాజు, డీసీపీ(అడ్మిన్) మేరీ ప్రశాంతి, ఏడీసీపీ రామకృష్ణరాజు, తహసీల్దార్ కట్టా వెంకటశివయ్య, ఎంపీడీఓలు తుంగల స్వర్ణలత, నాంచారరావు, ఉయ్యూరు సీఐ ముక్తేశ్వరరావు, ఎస్ఐ వై. అర్జున్ పాల్గొన్నారు. -
వినూత్నం.. ఎంపీ, ఎమ్మెల్సీ గుర్రమెక్కి మరీ..
సిద్దిపేట జోన్: మహమ్మారి కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో తెలంగాణలోని ప్రజాప్రతినిధులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో మెదక్ లోక్‌సభ సభ్యుడు కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్ కోవిడ్‌పై వినూత్న రీతిలో అవగాహన కల్పించారు. గుర్రమెక్కి మరీ కరోనా వైరస్‌పై ప్రజలకు అవగాహన కార్యక్రమం చేపట్టారు. మాస్కులు పెట్టుకొని, గుర్రాలపై ఎక్కి ప్లకార్డులు ప్రదర్శించారు. ప్రతి ఒక్కరూ మాస్క్‌లు ధరించాలని, భౌతికదూరం పాటించాలని ఎంపీ, ఎమ్మెల్సీ సూచించారు. చదవండి: తెలంగాణ ఆదర్శం.. వాయువేగాన ఆక్సిజన్ చదవండి: రియల్ బూమ్.. జోరుగా రిజిస్ట్రేషన్లు -
కరోనాపై అవగాహన చర్యలు చేపట్టిన టాటా ట్రస్ట్స్
సాక్షి, హైదరాబాద్: కోవిడ్-19 వ్యాప్తిని అరికట్టేందుకు భారత ప్రభుత్వం సూచించిన ఆరోగ్య విధానాలను ప్రజలు పాటించేలా వారిని ప్రోత్సహించేందుకు టాటా ట్రస్ట్స్ వారు అవగాహన చర్యలు ప్రారంభించారు. ఇందుకోసం టాటా వారు కమ్యూనిటీ ఔట్రీచ్ కార్యక్రమాన్ని మార్చి31న ప్రారంభించింది. దీని ద్వారా గ్రామీణ ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు ఆరోగ్య విధానాల పట్ల వారిని విద్యావంతులను చేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. కాగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత స్థాయిలో కరోనా వైరస్‌పై అవగాహన కల్పిస్తున్నఈ కార్యక్రమాన్ని ప్రజలకు చేరువ చేసేందుకు వివిధ ఆడియో, వీడియో, యానిమేషన్ల ద్వారా ప్రచార చర్యలు చేపట్టింది. ప్రజలకు అవగాహన కల్పించే క్రమంలో ఆసక్తి కలిగిన సంస్థలకు 300లకుపైగా వీడియోలు, ఆడియోల ద్వారా సందేశాలను సోషల్ మీడియాలో అందుబాటులో ఉంచినట్టు టాటా ట్రస్ట్స్ ఒక ప్రకటనలో పేర్కొంది. ఇవి తెలుగు సహా పలు భాషలలో కూడా అందుబాటులో ఉన్నాయి. అంతేగాక ఇవి ప్లేలిస్టులో కూడా అభ్యమవుతున్నాయి. (జైలులో కరోనా కలకలం.. 9 మంది మృతి) ఈ కార్యక్రమాన్ని ‘కదం, కరోనా ముక్త్ జీవన్’ పేరుతో వీడిమో సందేశాలు, లఘు యానిమేషన్ వీడియోలతో పాటు ఇన్ఫో గ్రాఫిక్స్ మొదలైన ఆడియో సందేశాలు, ఎస్ఎంఎస్ ఆధారిత సందేశాల ద్వారా అందుబాటులో ఉంచినట్టు ఆ ప్రకటనలో పేర్కొంది. అంతేగాక వీరికి మద్దతుగా సుప్రసిద్ద గాయకులు రఘు కుంచే, పార్థసారథి నేమానీలు కూడా వీడియో ద్వారా సామాజిక దూరం పట్ల, శుభ్రత పట్ల తమ సందేశాన్ని అందించారు. కరోనాపై ప్రజల్లో విస్తృత ప్రచారం చేసేందుకు టాటా ట్రస్ట్స్ వారే ఇప్పుడు నలుగురు మాస్టర్ ట్రైనర్లను నియమించింది. వీరు 50పైగా కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్స్(గ్రామ వాలంటీర్ల)కు శిక్షణ అందించడం ద్వారా ఈ సందేశం చివరి వరకూ చేరేలా వినూత్నంగా ప్రయత్నం చేస్తున్నారు. ట్రస్ట్ కార్యక్రమాలకు సంబంధించి ప్రస్తుత నెట్‌వర్క్‌తో పాటుగా, ట్రస్ట్స్ వాలంటీర్లు, భాగస్వామ్య సంస్థలు, కమ్యూనిటీ రెడియోలు, గ్రామ అధారిత పబ్లిక్ అడ్రస్ సిస్టమ్స్, ఇంటర్నేట్, కమ్యూనికేషన్ సాంకేతికతల వినియోగం ద్వారా ప్రజలలో అవగాహన కల్పిస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రచారం చేయబడుతున్న ఆరోగ్య విధానాలు: చేతులు శుభ్రంగా కడగడంలో నైపుణ్యం. భౌతిక దూరం అవశ్యకత. శ్వాస సంబంధిత పద్ధతులు. సరైన సమాచారంపై ఆధారపడటం. కోవిడ్-19 లక్షణాలను ముందుగా గుర్తించడం. తిరిగి వచఇన వలస కార్మికులు స్వీయ నిర్భందం కోసం మార్గదర్శకాలను అనుసరించేలా చేయడం. -
వైరల్ అవుతున్న ట్రాఫిక్ పోలీసుల వీడియో
సాక్షి, హైదరాబాద్: కరోనాను ఎదుర్కోటానికి అవసరమైన సలహాలు, సూచనలు అందించేందుకు రాచకొండ ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగారు. గురువారం కొత్తపేట సర్కిల్లో కరోనా నివారణపై అవగాహన కార్యక్రమం చేపట్టారు. దీనికోసం వాహనదారులను రోడ్డుపైనే కొన్ని నిమిషాలపాటు నిలిపివేశారు. అనంతరం ఐదుగురు పోలీసులు వారికెదురుగా నిలబడి కరోనా వ్యాప్తిని నిలువరించేందుకు అవసరమైన సూచనలిచ్చారు. ఇందుకోసం ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియజేశారు. తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు చేతులు అడ్డుపెట్టుకోవాలన్నారు. చేతులను 20 సెకండ్లపాటు కడుక్కోవాలని పేర్కొన్నారు. (బస్సుల్లో హ్యాండ్ శానిటైజర్లు) అంతేకాక చేతులను ఏవిధంగా కడుక్కోవాలో ప్రయోగాత్మకంగా చేసి చూపించారు. పత్రి వ్యక్తికి ఒక మీటర్ దూరంగా ఉండి మాట్లాడాలన్నారు. వ్యక్తిగత పరిశుభ్రత అత్యవసరమని నొక్కి చెప్పారు. షేక్ హ్యాండ్ ఇవ్వకూడదని, అందరికీ నమస్కారం మాత్రమే పెట్టాలని కోరారు. అనంతరం దీని గురించి పోలీసులు మాట్లాడుతూ.. రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ సూచనల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. ‘భయపడవద్దు.. భద్రత పాటిద్దాం - కలిసికట్టుగా కరోనా అరికడుదాం’ అని పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. (పదో తరగతి విద్యార్థులకు మాస్కులు) చదవండి: కానిస్టేబుల్ ర్యాప్ సాంగ్.. నెటిజన్లు ఫిదా -
వికేంద్రీకరణపై విద్యార్థులతో అవగాహన సదస్సు
-
'కరప్షన్ క్యాన్సర్ కన్నా ప్రమాదం'
సాక్షి, విజయవాడ : కరెప్షన్ అనే పదానికి దూరంగా ఉండాలని అది క్యాన్సర్ కన్నా ప్రమాదకరమైందని గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ పేర్కొన్నారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సోమవారం నిర్వహించిన విజిలెన్స్ వారోత్సవాలను గవర్నర్ ఘనంగా ప్రారంభించారు. భారతదేశాన్ని అవినీతిరహిత దేశంగా మార్చాలనే ఉద్దేశంతో విజిలెన్స్ అవేర్నెస్ వీక్ 2019ను నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. కరెప్షన్ అనే పదం క్యాన్సర్ కన్నా ప్రమాదకరమైందని పేర్కొన్నారు. అవినీతిరహిత దేశంగా భారతదేశం ఉండాలనేది తన ఆకాంక్ష అని గవర్నర్ తెలిపారు. దేశంలో పని చేస్తున్న అన్ని ప్రభుత్వ సంస్థలు అవినీతిరహితంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. వచ్చే నెల రెండో తేదీ వరకు జరగనున్న విజిలెన్స్ వారోత్సవాలకు కేంద్ర ప్రభుత్వ సంస్థల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
ఇల్లినాయిస్ ఇమ్మిగ్రేషన్ 'వాక్ ఫర్ ఈక్వాలిటీ'
ఇల్లినాయిస్ : ఇల్లినాయిస్ ఇమ్మిగ్రేషన్ ఫోరం ఆధ్వర్యంలో అక్టోబర్ 10న లీ-హారిస్ ఎస్- 386, హెచ్ఆర్- 1044 ఫెయిర్‌నెస్ చట్టం పాస్ చేయాలని కోరుతూ ఇల్లినాయిస్లోని సిటీ హాల్ నుంచి ఫెడరల్ భవనం వరకు 'వాక్ ఫర్ ఈక్వాలిటీ' పేరుతో కమ్యూనిటీ ర్యాలీని నిర్వహించింది. రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది వలసదారులు దీనిలో పాల్గొని కార్యక్రమానికి మద్దతుగా తమ సంఘీభావాన్ని తెలియజేశారు. భారీ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా వందలాది కుటుంబాలు తమ పిల్లలతో కలిసి టీ షర్టులు ధరించి 'వాక్ ఫర్ ఈక్వాలిటీ' ప్లకార్డులుతో డౌన్ టౌన్ నుంచి శాంతియుత ప్రదర్శన చేపట్టారు. 'మా పిల్లలకు సహాయం చేయండి, అమెరికాను ప్రేమిస్తున్నాం, జాతీయ మూలం వివక్షను అంతం చేయండి, గ్రీన్ కార్డ్ సమానత్వానికి మద్దతు ఇవ్వండి, స్వీయ- బహిష్కరణకు బలవంతం చేయవద్దు, ఎస్.386, హెచ్ఆర్- 1044ని నిరోధించవద్దంటూ నినాదాలు చేస్తూ ముందుకు సాగారు.నిరసన చేపట్టిన ఇల్లినాయిస్ ఇమ్మిగ్రేషన్ ఫోరం మాట్లాడుతూ.. హై స్కిల్డ్ ఇమ్మిగ్రెంట్స్ ఫెయిర్‌నెస్ చట్టం ఉపాధి ఆధారిత గ్రీన్ కార్డులను స్వీకరించడానికి 'ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్' పేరుతో నిర్వహించడం వల్ల అమెరికాలో నివసిస్తున్న లక్షల మంది భారతీయులు, ఇతర దేశాలకు చెందిన వారిపై వివక్ష తగ్గే అవకాశం ఉంటుందని తెలిపారు. దీనికి సంబంధించి ఫెడరల్ హౌస్ జూలై 2019లో హెచ్ఆర్- 1044 బిల్లును ఆమోదించింది. ఇల్లినాయిస్ కు చెందిన 18 మంది సెనెట్ ప్రతినిధుల బృందం తమకు సమ్మతమేనంటూ ఓటు కూడా వేశారని తెలిపారు. సెనేట్‌లోని ప్రతి రిపబ్లికన్ ఈ బిల్లుకు మద్దతు ఇస్తున్నారని, వారికి ఎలాంటి అభ్యంతరాలు లేవని ఇమ్మిగ్రేషన్ ఫోరం పేర్కొంది. -
పారదర్శకత కోసమే జీఎస్టీ
-‘సాక్షి’ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు - సందేహాలను నిృవృత్తి చేసిన కమర్షియల్ ట్యాక్స్ డిప్యూటీ కమిషనర్ (డీసీ) కల్పన అనంతపురం ఎడ్యుకేషన్/సెంట్రల్/రూరల్ : పన్ను చెల్లింపులో పారదర్శకత కోసమే కేంద్ర ప్రభుత్వం వస్తు సేవా పన్ను (జీఎస్టీ) చట్టాన్ని తెస్తోందని కమర్షియల్ ట్యాక్స్ డిప్యూటీ కమిషనర్ (డీసీ) కల్పన అన్నారు. జీఎస్టీ జూలై ఒకటో తేదీ నుంచి అమలుకానుంది. ప్రత్యక్ష పన్నులైన ఆదాయ పన్ను, కార్పొరేట్ ట్యాక్స్‌లు మినహా.. కేంద్రం, రాష్ట్రాలు వసూలు చేసే పరోక్ష పన్నుల స్థానంలో జీఎస్టీ ఒక్కటే ఉంటుంది. ఈ విధానం వల్ల ఎవరికి లాభం? ధరలు తగ్గుతాయా? లేక పెరుగుతాయా? ఏయే వస్తువుల ధరలు ఎలా ఉండబోతున్నాయి. తదితర అంశాలపై అవగాహన కల్పించేందుకు ‘సాక్షి’ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక లలిత కళాపరిషత్‌లో సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి సాక్షి బ్యూరో ఇన్చార్జ్ మొగలి రవివర్మ అధ్యక్షత వహించారు. ఆయన మాట్లాడుతూ ‘సాక్షి’ గతంలో విద్యార్థులు, రైతులు, వెబ్లాండ్, ప్రజా సమస్యలపై అనేక సదస్సులు నిర్వహించిందని గుర్తు చేశారు. జూలై ఒకటి నుంచి అమలకానున్న జీఎస్టీపై సందేహాల నివృత్తికి నిఫుణులతో అవగాహన కల్పించేందుకు సదస్సు నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో చాంబర్ ఆఫ్ కామర్స్ జిల్లా అ«ధ్యక్షుడు శేషాంజనేయులు, ప్రధాన కార్యదర్శి రంగారెడ్డి, ‘సాక్షి’ రీజినల్ మేనేజర్ జేవీఆర్కే రెడ్డి, జిల్లా అడ్వర్టైజ్మెంట్ విభాగం మేనేజర్ శ్రీకాంత్, సీఏ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడే ఏజీ వేణుగోపాల్‌రెడ్డి పాల్గొన్నారు. అనంతరం వివిధ డీలర్లు, వ్యాపారులు లేవనెత్తిన అనుమానాలను డీసీ కల్పనతో పాటు అసిస్టెంట్ కమిషనర్లు శేషాద్రి, సత్యప్రకాష్ నివృత్తి చేశారు. ఆ వివరాలిలా ఉన్నాయి. ప్రశ్న: ఇతర రాష్ట్రాల్లోని హ్యండ్లూమ్స్లో పన్ను చెల్లించి దుస్తులను కొనుగోలు చేశాం. డ్యామేజ్ స్టాక్ రిటర్న్‌కు సంబంధించిన నోట్ ఎప్పటిలోగా అప్లోడ్ చేయాలి? – రాజేష్, వస్త్ర దుకాణ వ్యాపారి, అనంతపురం. డీసీ : జీఎస్టీ రాకతో దేశవ్యాప్తంగా ఒకే పన్ను విధానం ఉంటుంది. సరుకు కొనుగోలు చేసే సమయంలో ఇన్పుట్ ట్యాక్స్ మొత్తం చెల్లించి ఉంటాం. దీంతో డ్యామేజ్, అమ్మకం కాని సరుకుకు సంబంధించిన రిటర్న్‌ను ఆరు నెలల లోపు అప్లోడ్ చేయాలి. ప్రశ్న: మిక్స్డ్ వస్తువులను (ఒక్కో వస్తువుకు ఒక్కో పన్ను శాతం ఉన్న సమయంలో) ప్యాక్ రూపంలో కొనుగోలు చేస్తే పన్ను ఏ విధంగా ఉంటుంది?- రామాంజనేయులు డీసీ : ఒక వస్తువుకు 2 శాతం, మరో వస్తువుకు 5 శాతం, ఇంకో వస్తువుకు 18 శాతం పన్ను ఉండే వస్తువులను మిక్స్‌డ్‌గా ప్యాక్ రూపంలో కొనుగోలు చేస్తే ఎక్కువ శాతం పన్ను ఉన్న వస్తువును పరిగణనలోకి తీసుకుని అన్ని వస్తువులకూ అదే పన్ను వేస్తారు. ప్రశ్న: జూలై1లోగా జీఎస్టీ ఐడీ రాకపోతే వ్యాపారుల పరిస్థితి ఏమిటి? ప్రభుత్వ వర్క్‌లు చేసే పరిస్థితి ఏంటి? - జయదేవ్ డీసీ : జీఎస్టీలోకి లాగిన్ అయి రిజిస్ట్రేషన్ చేసుకున్నా ఐడీ నంబర్ రాకపోతే ప్రొవిజన్ ఐడీ నంబర్‌నే జీఎస్టీ ఐడీగా పరిగణనలోకి తీసుకుంటారు. గతంలో ప్రభుత్వం వర్కులు మంజూరు సమయంలో ఆ వర్క్‌కు సంబంధించిన పన్నును ముందస్తుగా తగ్గించేవారు. జీఎస్టీలో సైతం అదే విధానం కొనసాగుతుంది. అయితే 10 రోజుల్లోపు కచ్చితంగా అప్లోడ్ చేయాలి. ప్రశ్న: బెడ్ల కొనుగోలు సమయంలో ఎక్స్ఛేంజ్ డ్యూటీతోపాటు ట్యాక్స్ చెల్లించాను. ప్రస్తుతం జీఎస్టీలో మార్చుకోవడంతో నా దగ్గర చాలా సరుకు మిగిలిపోయింది. వాటి పరిస్థితి ఏంటి? - వెంకటక్రిష్ణయ్య డీసీ : మీరు సరుకు కొనుగోలు చేసే సమయంలో పన్ను చెల్లించి ఉంటారు. దీంతో జీఎస్టీలోకి మారినా ఎలాంటి నష్టమూ వాటిల్లదు. ఎక్స్ఛేంజ్ డ్యూటీ రాష్ట్ర పరిధి అయితే 60 శాతం, రాష్ట్రేతర పరిధి అయితే 40 శాతంలోపు ఉంటుంది. అయితే ప్రతి వ్యాపారీ సరుకు కొనుగోలు చేసిన బిల్లును జీఎస్టీలోకి తప్పనిసరిగా అప్లోడ్ చేయాలి. ప్రశ్న: జొన్నలు, రాగులు, సజ్జలకు ట్యాక్స్ ఉంటుందా? : - లక్ష్మీనారాయణ, అకౌంటెంట్, అనంతపురం డీసీ : ధాన్యాలకు ట్యాక్స్ మినహాయింపు ఉంది. అయితే బ్రాండెండ్ అయితే ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. ట్రాన్స్‌పోర్టు చేసే సమయంలో రూ.50 వేలకు పైగా విలువ ఉన్నట్లైతే వే బిల్లులు తప్పనిసరి. ప్రశ్న: దేశవ్యాప్తంగా జీఎస్టీని తీసుకోవద్దని చెబుతున్నారు.. ఏమి చేయాలి ? - ఆనంద్, క్లాత్ మర్చెంట్స్ అసోసియేషన్ డీసీ : జీఎస్టీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. చట్టం కూడా చేశారు. కావున ప్రతి ఒక్కరూ చట్టానికి లోబడి ఉండాల్సిందే. ప్రతి ఒక్కరూ రిజిస్ట్రేషన్ చేసుకోవడం తప్పనిసరి. అందరూ ట్యాక్స్ పరిధిలోకి రావాలనే ఉద్దేశంతో కస్టమర్లు, డీలర్లను దృష్టిలో పెట్టుకొని జీఎస్టీని అమలు చేస్తున్నారు. ప్రశ్న: రిజిస్ట్రేషన్ చేసుకున్న ఏజెన్సీలకు మాత్రమే బిల్లింగ్ చేయాలా? - వెంకటరమణ, మెడికల్ ఏజెన్సీస్ డీసీ : ప్రతి ఒక్కరూ రిజిస్ట్రేషన్ చేసుకోవడం తప్పనిసరి. ఒకవేళ అన్ రిజిస్ట్రేషన్ షాపులకు సరఫరా చేసినా ఏదో ఒక చోట ట్యాక్స్ చెల్లించాల్సి ఉంది. ఈ నెల 27 నుంచి ప్రొవిజనల్ ఐడీ తీసుకోవాలి. పాన్ కార్డు సమస్య వలన ఐడీ సమస్యలు తలెత్తుతున్నాయి. ఎవరికైతో ప్రొవిజనల్ ఐడీ రాలేదో వారు అప్డేట్ చేసుకోవాలి. ప్రశ్న: బ్రాండెడ్ కాకపోయినా ఒక గుర్తుతో బియ్యం సరఫరా చేస్తే ట్యాక్స్ చెల్లించాలా? - సురేష్, బియ్యం వ్యాపారి డీసీ : ఒక సింబల్ తో వ్యాపారం చేస్తే దానిని బ్రాండెడ్ అంటారు. ఆ గుర్తుకు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రతి ఒక్కరూ ట్యాక్స్ చెల్లించాల్సిందే. -
నేడు అవగాహన సదస్సు
అనంతపురం రూరల్ : అనంతపురం తపాల డివిజన్ పరిధిలోని బ్రాంచ్ పోస్టుమాస్టర్లు (బీపీఎం), సబ్ పోస్టు మాస్టర్లకు గ్రామీణ తపాల జీవిత బీమాపైన ఆదివారం అవగాహన సదస్సు ఉంటుంది. ఉదయం 9.30 గంటలకు ప్రధాన తపాల కార్యాలయంలో నిర్వహించనున్న సదస్సుకు హాజరుకావాలని తపాల ఏఎస్పీ సంజీవ్‌కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. -
డెంగీ విషజ్వరాలపై అవగాహన సదస్సు
ఎస్కేయూ : ‘దోమలపై దండయాత్ర, పరిసరాల పరిశుభ్రత’లో భాగంగా గురువారం ఎస్కేయూ సోషల్ వర్క్ విభాగం ప్రొఫెసర్లు డెంగీ జ్వరంపై అవగాహన సదస్సును నిర్వహించారు. ఎస్కేయూ సమీపంలోని చిన్నకుంట గ్రామంలో పర్యటించి పరిసరాల పరిశుభ్రత, వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన చర్యలను ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో సోషల్ వర్క్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ ఫిరోజ్‌ఖాన్, డాక్టర్ శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
దోమలను తరిమికొడదాం
అనంతపురం ఎడ్యుకేషన్ : పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకొని దోమలను తరిమికొడదామని జాయింట్ కలెక్టర్ లక్ష్మీకాంతం పిలుపునిచ్చారు. శుక్రవారం విద్యాశాఖ ఆధ్వర్యంలో నగరంలో విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని ప్రారంభించిన అనంతరం జేసీ మాట్లాడుతూ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. సీజనల్ వ్యాధుల బారిన పడకుండా అవగాహనలు కల్పించాలన్నారు. సాయంత్రం 5–6 గంటలకే తలుపులు, కిటికీలు మూసేసి,దోమలు రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో డీఈఓ అంజయ్య, సమాచార శాఖ ఏడీ తిమ్మప్ప,తహశీల్దార్ శ్రీనివాసులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
నేడు ఫర్టిగేషన్‌పై అవగాహన సదస్సు
అనంతపురం అగ్రికల్చర్ : ఉద్యానశాఖ, ఏపీఎంఐపీ, కోరమాండల్ కంపెనీ ఆధ్వర్యంలో గురువారం స్థానిక ప్రాంతీయ ఉద్యాన శిక్షణా కేంద్రంలో ఫర్టిగేషన్ అంశంపై సదస్సు ఏర్పాటు చేసినట్లు ఉద్యానశాఖ డీడీ బీఎస్ సుబ్బరాయుడు తెలిపారు. అరటి, ఇతర పండ్లతోటలకు డ్రిప్ ద్వారా నీటిలో కరిగే రసాయన ఎరువులు ఇవ్వడంలో మెలకువలు, సాంకేతిక అంశాలు, రైతులకు కలిగే ప్రయోజనాలు గురించి తెలియజేస్తామన్నారు. ఏపీఎంఐపీ ఓఎస్డీ రమేష్‌తో పాటు ఇరుశాఖల అధికారులు, కంపెనీ ప్రతినిధులు, రైతులు హాజరవుతున్నట్లు తెలిపారు. -
వెబ్‌ల్యాండ్‌పై రేపు అవగాహన సదస్సు
అనంతపురం అర్బన్ : వెబ్‌ల్యాండ్‌లో ఒకరి పేరున ఉన్న భూమి మరొకరి పేరుపై నమోదవడం, ఉన్న భూమి కంటే తక్కువగా చూపడం వంటి పొరపాట్లు అధికమవుతండటంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో రైతులకు వెబ్‌ల్యాండ్‌పై అవగాహన కల్పించడానికి ‘సాక్షి’ సదస్సు నిర్వహిస్తోంది. ఈ నెల 23న ఉదయం పది గంటలకు అనంతపురం రూరల్ మండలం ఇటుకలపల్లి గ్రామంలో జరిగే సదస్సుకు రెవెన్యూ అధికారులను ఆహ్వానించి వెబ్‌ల్యాండ్‌పై రైతులకు అవగాహన కల్పించనుంది. రైతులు తమ భూముల వివరాలు వెబ్‌ల్యాండ్‌లో తప్పుగా నమోదై ఉంటే వాటిని అధికారుల దృష్టికి తీసుకొస్తే పరిష్కారానికి చర్యలు తీసుకుంటారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ‘సాక్షి’ కోరుతోంది. -
ఆస్తులు వెల్లడిస్తే పన్నులో మినహాయింపు
హిందూపురం అర్బన్ : అప్రకటిత ఆస్తులు, నల్లధనం వెల్లడితో ఆస్తిపన్నులో మినహాయింపులు ఉంటాయని హిందూపురం ఇన్‌కం ట్యాక్స్ ఆఫీసర్ సంజీవయ్య అన్నారు. స్థానిక ఇన్‌కం ట్యాక్స్ ఆఫీసులో హోల్‌సేల్, రిటైల్ క్లాత్ మర్చెంట్స్‌కు మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్‌కం ట్యాక్స్ ఇన్స్పెక్టర్ విజయలక్ష్మి వ్యాపారులకు ఆదాయ వెల్లడి పథకం 2016 గురించి వివరించారు. 2015–16 సంవత్సరంలో ఇన్‌కం ట్యాక్స్ రిటన్స్‌లో వెల్లడించకుండా గోప్యంగా ఉంచిన ఆస్తులన్నింటినీ ప్రభుత్వానికి దాఖలు చేస్తే పన్నులో 45 శాతం మినహాయింపు ఉంటుందన్నారు. కర్నూలు డిప్యూటీ కమిషనర్ వద్ద ఆస్తుల డిక్లరేషన్ ఇస్తే 45 శాతం పన్నును మూడు విడతలుగా చెల్లించడానికి అవకాశం ఇస్తామని చెప్పారు. చెల్లించని వారు అధికారులు దాడుల్లో దొరికితే 100 శాతం పన్నుతో పాటు 300 శాతం అపరాధ రుసుం చెల్లించాల్సి ఉంటుందన్నారు. కార్యక్రమంలో క్లాత్ మర్చెంట్ సంఘం నాయకులు రాము, అశ్వర్థనారాయణ, షాహనావాజ్ పాల్గొన్నారు. -
'సాక్షి' ఆధ్వర్యంలో సేఫ్, గ్రీన్ కాలనీ
వనస్థలిపురం: 'సాక్షి' దిన పత్రిక ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని ప్రశాంత్‌నగర్ కాలనీలో సంక్షేమ సంఘం సమక్షంలో 'సేఫ్ అండ్ గ్రీన్' కాలనీపై అవగాహన సదస్సు జరిగింది. నగరంలోని వనస్థలిపురంలో ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో ఏసీపీ భాస్కర్‌గౌడ్, డీసీ శ్రీనివాస్‌రెడ్డి, ప్రశాంత్‌నగర్ కాలనీ వాసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులు, కాలనీ వాసులు కలిసి మొక్కలను నాటారు. అనంతరం జరిగిన సమావేశంలో పోలీసు అధికారులు ప్రసంగించారు. -
దీపిక ధైర్యవంతురాలు
అన్నీ ఉన్నా.. డిప్రెషన్‌తో తాను యుద్ధం చేశానని దీపికా పడుకొనే చేసిన కామెంట్లు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ వ్యాఖ్యలపై బిగ్ బీ అమితాబ్ స్పందిస్తూ.. ఆమె మాటల్లో నిజాయితీ ఉందని చెప్పుకొచ్చాడు. ఎంతో ధైర్యం ఉంటేగానీ ఇలా మాట్లాడలేరని ఓ కితాబు కూడా ఇచ్చేశాడు. యాంగ్జైటీ, డిప్రెషన్‌పై అవేర్నెస్ ప్రోగ్రామ్‌లో దీపిక ఈ వ్యాఖ్యలు చేసింది. డిప్రెషన్ అవేర్నెస్ ప్రోగ్రామ్‌లో దీపిక పాలుపంచుకోవడం సంతోషంగా ఉందన్నారు బిగ్ బీ.