
గుర్రమెక్కి దండలు వేసుకున్న ఎంపీ, ఎమ్మెల్సీ రోడ్ల వెంట తిరిగారు.
సిద్దిపేట జోన్: మహమ్మారి కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో తెలంగాణలోని ప్రజాప్రతినిధులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో మెదక్ లోక్‌సభ సభ్యుడు కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్ కోవిడ్‌పై వినూత్న రీతిలో అవగాహన కల్పించారు. గుర్రమెక్కి మరీ కరోనా వైరస్‌పై ప్రజలకు అవగాహన కార్యక్రమం చేపట్టారు. మాస్కులు పెట్టుకొని, గుర్రాలపై ఎక్కి ప్లకార్డులు ప్రదర్శించారు. ప్రతి ఒక్కరూ మాస్క్‌లు ధరించాలని, భౌతికదూరం పాటించాలని ఎంపీ, ఎమ్మెల్సీ సూచించారు.
చదవండి: తెలంగాణ ఆదర్శం.. వాయువేగాన ఆక్సిజన్
చదవండి: రియల్ బూమ్.. జోరుగా రిజిస్ట్రేషన్లు