Farooq hussain
-
మూడోసారి అవకాశం దక్కేనా?
సాక్షి, సిద్దిపేట: ఫారూక్ హుస్సేన్‌కు శాసన మండలి సభ్యుడి(ఎమ్మెల్సీ)గా మరోసారి అవకాశం దక్కుతుందా? గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎవరి పేరును ప్రతిపాదిస్తారో! అని జిల్లా వ్యాప్తంగా చర్చసాగుతోంది. ఈ నెల 27వ తేదీతో ఫారూక్ హుస్సేన్‌కు ఎమ్మెల్సీ పదవీకాలం ముగియనుంది. కాగా గవర్నర్ కోటాలో రెండు ఎమ్మెల్సీలు ఖాళీ కానున్నాయి. దీంతో మళ్లీ ఎమ్మెల్సీగా ఫారూక్ హుస్సేన్‌కు అవకాశం ఉంటుందా.. లేదా.. అనేది తెలియాల్సి ఉంది. కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీగా.. ► 2011, మే 28న కాంగ్రెస్ తరపున గవర్నర్ కోటాలో శాసన మండలి సభ్యుడిగా ఫారూక్ హుస్సేన్‌కు తొలిసారి అవకాశం దక్కింది. ► 2014 జూన్ 1 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యుడిగా, రాష్ట్రం ఏర్పడిన తర్వాత నుంచి 2017 మే 27 వరకు తెలంగాణ శాసన మండలి సభ్యుడిగా పని చేశారు. ►ఏప్రిల్ 26, 2016న బీఆర్ఎస్ పార్టీలో చేరారు. రెండోసారి 2017, మే 28న టీఆర్ఎస్ నుంచి గవర్నర్ కోటాలో శాసన మండలి సభ్యుడిగా ఎన్నికయ్యారు. ► ప్రస్తుతం ఆయన బీఆర్ఎస్ కార్యదర్శిగా, వక్ఫ్ బోర్డు, హజ్ కమిటీ సభ్యునిగా కొనసాగుతున్నారు. ► ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ నుంచి మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్‌గా పని చేశారు. ► గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల ఎంపికకు మంత్రివర్గ తీర్మానంతో గవర్నర్‌కు పేర్లను సిఫార్సు చేయనున్నారు. ► రెండు మార్లు ఎమ్మెల్సీగా పని చేసిన అనుభవం ఉన్న ఫారూక్‌కు మైనార్టీ కోటాలో తిరిగి అవకాశం లభిస్తుందా అనేది తెలియాల్సి ఉంది. ► ఇప్పటికే ఉమ్మడి మెదక్ జిల్లా స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీగా గజ్వేల్‌కు చెందిన డాక్టర్ యాదవరెడ్డి, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా సిద్దిపేటకు చెందిన దేశపతి శ్రీనివాస్ కొనసాగుతున్నారు. టీఎస్ఎంఐడీసీ చైర్మన్‌గా డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్, తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక సారధిగా రసమయి బాలకిషన్, టీఎస్ఐఐసీ చైర్మన్‌గా బాలమల్లు కొనసాగుతున్నారు. -
telangana: గవర్నర్ కోటా ఎమ్మెల్సీచాన్స్ ఎవరికి?
సాక్షి, హైదరాబాద్: శాసన మండలిలో రెండు గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతుండటంతో.. కొత్తగా ఎవరికి చాన్స్ వస్తుందనే దానిపై బీఆర్ఎస్లో చర్చ మొదలైంది. ఈ కోటాలో ఎమ్మెల్సీలుగా ఉన్న డి.రాజేశ్వర్‌రావు, ఫారూఖ్ హుస్సేన్‌ల ఆరేళ్ల పదవీకాలం ఈ నెల 27న పూర్తవుతోంది. ఈ రెండు స్థానాలకు అభ్యర్థుల పేర్లను గురువారం జరిగే కేబినెట్ భేటీలో ఖరారు చేసే అవకాశముంది. పదవీకాలం పూర్తవుతున్న డి.రాజేశ్వర్‌రావు, ఫారూఖ్ హుస్సేన్ ఇద్దరూ మైనారిటీ వర్గాలకు చెందినవారే కావడంతో మరోమారు పదవులను ఆశిస్తున్నారు. క్రిస్టియన్ కోటాలో రాజేశ్వర్, ముస్లిం కోటాలో ఫారూఖ్ హుస్సేన్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే రాజేశ్వర్‌రావు కాంగ్రెస్ హయాంలో రెండుసార్లు, బీఆర్ఎస్ హయాంలో ఒకసారి.. ఫారూఖ్ కాంగ్రెస్, బీఆర్ఎస్ల నుంచి ఒక్కోసారి గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా పనిచేశారు. వారికి మళ్లీ అవకాశమిస్తారా? అన్న దానిపై చర్చ జరుగుతోంది. ప్రభుత్వం రెండేళ్ల క్రితం గవర్నర్ కోటాలో పాడి కౌశిక్‌రెడ్డిని ఎమ్మెల్సీగా నామినేట్ చేసినా.. ఆయనపై క్రిమినల్ కేసులు ఉన్నాయనే కారణంతో గవర్నర్ తమిళిసై ఆమోదించకుండా పక్కనపెట్టారు. దీనితో ప్రభుత్వం ఆ స్థానంలో మాజీ స్పీకర్ మధుసూదనాచారి పేరును ప్రతిపాదించగా గవర్నర్ ఓకే చేశారు. ఈ నేపథ్యంలో క్లీన్ ఇమేజీ ఉన్నవారిని ఎమ్మెల్సీలుగా నామినేట్ చేయాలని కేసీఆర్ భావిస్తున్నట్టు తెలిసింది. ఇందులో టీఎస్పీఎస్సీ మాజీ చైర్మన్ ఘంటా చక్రపాణి పేరు ప్రధానంగా పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. తెలంగాణ ఉద్యమంలో ఆయన పాత్ర, టీఎస్పీఎస్సీ చైర్మన్‌గా సేవలతోపాటు అంబేడ్కర్ భారీ విగ్రహం ఏర్పాటులో చేసిన కృషిని దృష్టిలో పెట్టుకుని చక్రపాణి వైపు మొగ్గు చూపుతున్నట్టు తెలిసింది. ఇక గౌడ వర్గానికి మండలిలో ప్రాతినిధ్యం లేనందున ఆ వర్గానికి చెందిన ప్రముఖుల పేర్లను.. త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మైనారిటీ వర్గానికి చెందిన నేతల పేర్లనూ కేసీఆర్ పరిశీలిస్తున్నట్టు సమాచారం. చదవండి: త్వరలో తెలంగాణకు అమిత్‌షా, జేపీ నడ్డా -
వినూత్నం.. ఎంపీ, ఎమ్మెల్సీ గుర్రమెక్కి మరీ..
సిద్దిపేట జోన్: మహమ్మారి కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో తెలంగాణలోని ప్రజాప్రతినిధులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో మెదక్ లోక్‌సభ సభ్యుడు కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్ కోవిడ్‌పై వినూత్న రీతిలో అవగాహన కల్పించారు. గుర్రమెక్కి మరీ కరోనా వైరస్‌పై ప్రజలకు అవగాహన కార్యక్రమం చేపట్టారు. మాస్కులు పెట్టుకొని, గుర్రాలపై ఎక్కి ప్లకార్డులు ప్రదర్శించారు. ప్రతి ఒక్కరూ మాస్క్‌లు ధరించాలని, భౌతికదూరం పాటించాలని ఎంపీ, ఎమ్మెల్సీ సూచించారు. చదవండి: తెలంగాణ ఆదర్శం.. వాయువేగాన ఆక్సిజన్ చదవండి: రియల్ బూమ్.. జోరుగా రిజిస్ట్రేషన్లు -
ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్‌కు డెంగీ జ్వరం
సాక్షి, సిద్దిపేట : సిద్దిపేటకు చెందిన రాష్ట్ర శాసన మండలి సభ్యుడు ఫారూక్ హుస్సేన్‌కు డెంగీ జ్వరం సోకింది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆయనను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. తొలుత జ్వరం తీవ్రత అధికంగా ఉండటంతో సిద్దిపేటలో ప్రథమ చికిత్స అందించిన డాక్టర్లు డెంగీ లక్షణాలు ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేశారు. దీంతో అప్రమత్తమైన కుటుంబ సభ్యులు ఎమ్మెల్సీని బంజారాహిల్స్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ రక్త పరీక్షలు నిర్వహించిన వైద్యులు డెంగీ సోకినట్లు నిర్ధారించారు. ప్రస్తుతం ఫారూక్ హుస్సేన్ ఆరోగ్యం నిలకడగా ఉందని ఆయన బంధువులు తెలపారు. -
ఎన్నారై మహిళపై ఎమ్మెల్సీ దాడి
-
దిగ్విజయ్‌ను తెలంగాణలో తిరగనీయం!
ఎమ్మెల్సీ ఫరూక్ హుస్సేన్, పార్టీ నేత బుడన్ బేగ్ సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలోని అన్ని కులాలకు సమన్యాయం చేస్తున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నుంచి ముస్లిం మైనారిటీలను దూరం చేయాలని కాంగ్రెస్ నాయకులు ప్రయత్నిస్తున్నారని ఎమ్మెల్సీ ఫరూక్ హుస్సేన్ అన్నారు. ఆ పార్టీ నాయకుడు దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు అత్యంత బాధ్యతారాహిత్యమని, ఆయన తెలంగాణ ప్రభుత్వానికి, తెలంగాణ పోలీసులకు క్షమాపణ చెప్పకుంటే రాష్ట్రంలో తిరగనీయమని హెచ్చరించారు. పార్టీ సీనియర్ నాయకుడు బుడన్ బేగ్‌తో కలసి మంగళవారం తెలంగాణ భవన్లో విలేకరులతో మాట్లాడారు. ముస్లింలను టీఆర్ఎస్కు దూరం చేయాలని కాంగ్రెస్ కుట్ర పన్నుతోందని మండిపడ్డారు. దిగ్విజయ్ వ్యాఖ్యలపై సీఎల్పీ నేత జానారెడ్డి, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, షబ్బీర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దిగ్విజయ్‌పై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. కర్ణాటక రాష్ట్రం నుంచి దిగ్విజయ్‌ను ఇన్చార్జి బాధ్యతల నుంచి తొలగించిన మాదిరిగానే తెలంగాణ ఇన్చార్జి బాధ్యతల నుంచి కూడా తొలగించాలని కాంగ్రెస్ హై కమాండ్‌కు సూచించారు. తెలంగాణ పోలీసులు సమర్ధంగా పనిచేస్తుంటే ఓర్వలేక పోతున్నారని ఆయన విమర్శించారు. -
‘దిగ్విజయ్‌ను తెలంగాణలో తిరగనీయం’
- ఎమ్మెల్సీ ఫరూక్ హుస్సేన్, పార్టీ నేత బుడన్ బేగ్ సాక్షి, హైదరాబాద్ : తెంగాణా రాష్ట్ర ఇన్చార్జ్ దిగ్విజయ్‌సింగ్‌పై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ విరుచుకుపడ్డారు. టీఆర్ఎస్కు ముస్లిం మైనారిటీలను దూరం చేయాలని కాంగ్రెస్ నాయకులు పిల్లిమొగ్గలు వేస్తున్నారని ఎమ్మెల్సీ ఫరూక్ హుస్సేన్ విమర్శంచారు. దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు అత్యంత బాధ్యాతారాహిత్యమని, ఆయన తెలంగాణ ప్రభుత్వానికి, తెలంగాణ పోలీసులకు క్షమాపణ చెప్పకుంటే రాష్ట్రంలో తిరగనీయమని హెచ్చరించారు. పార్టీ సీనియర్ నాయకుడు బుడన్ బేగ్‌తో కలిసి మంగళవారం తెలంగాణ భవన్లో విలేకరులతో మాట్లాడారు. దిగ్విజయ్ వ్యాఖ్యలపై సీఎల్పీ నేత జానారెడ్డి, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, షబ్బీర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దిగ్విజయ్‌పై చర్యలు తీసుకోవాలని ఫరూఖ్ ప్రభుత్వాన్ని కోరారు. కాంగ్రెస్ నాయకత్వం తన పద్దతిని మార్చుకోవాలసి హితవు పలికారు. కర్ణాటక రాష్ట్రం నుంచి దిగ్విజయ్ సింగ్‌ను ఇన్‌ఛార్జి బాధ్యతల నుంచి తొలగించిన మాదిరిగానే తెలంగాణ ఇన్చార్జి బాధ్యతల నుంచి కూడా తొలగించాలని కాంగ్రెస్ హై కమాండ్‌కు సూచించారు. అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెడుతున్న ప్రభుత్వం పైన దుమ్మెత్తి పోస్తున్నారని, తెలంగాణ పోలీసులు సమర్ధంగా పనిచేస్తుంటే ఓర్వలేక పోతున్నారని ఆయన పేర్కొన్నారు. -
ఫారూక్‌కే మళ్లీ చాన్స్..
గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన టీఆర్ఎస్ విధేయతకు గుర్తింపు సిద్దిపేట జోన్ : సిద్దిపేటకు చెందిన ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్‌కు మరోసారి చాన్స్ లభించింది. టీఆర్ఎస్ అధిష్టానం పక్షాన ఎమ్మెల్సీ అభ్యర్థులను రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం ప్రకటించిన విషయం విదితమే. ఈ జాబితాలో గవర్నర్ కోటాలో సిద్దిపేటకు చెందిన ఫారూక్ హుస్సేన్‌కు చోటు దక్కింది. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, స్థానిక మంత్రి హరీశ్‌రావుతో ఉన్న సాన్నిహిత్యం, గతేడాదిగా టీఆర్ఎస్ ఎమ్మెల్సీగా పార్టీలో కొనసాగిన విధేయతకు సీఎం మరో గుర్తింపునిచ్చారు. ఎమ్మెల్సీ బెర్తు కోసం రాష్ట్ర వ్యాప్తంగా అనేకమంది ఆశించినప్పటికీ ఫారూక్ హుస్సేన్‌ను గవర్నర్ కోటా కింద అభ్యర్థిగా ప్రకటించడం విశేషం. సిద్దిపేట పట్టణానికి చెందిన ఫారూక్ హుస్సేన్ 30 సంవత్సరాల క్రితం మున్సిపల్ కౌన్సిలర్‌గా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్‌లో పనిచేసిన ఆయనకు దివంగత నేత వైఎస్ హయాంలో 2004–2007 వరకు మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్‌గా అవకాశం లభించింది. అనంతరం 2011లో గవర్నర్ కోటా కింద ఉమ్మడి రాష్ట్రంలో ఫారూక్ హుస్సేన్ ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఇదే సమయంలో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భా వం చెందడం, అనంతరం రాజకీయ పరిణామాల నేపథ్యంలో 2016 ఏప్రిల్ 25న ఫారూక్ హుస్సేన్ సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు సమక్షంలో కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరారు. నాటినుంచి ఏడాదిగా సిద్దిపేట జిల్లాలోని ప్రభుత్వ కార్యక్రమాల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఆయన మంత్రి హరీశ్‌రావుతో కలిసి పని చేస్తూ పార్టీలో కొనసాగారు. ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన నేపథ్యంలో సీఎం కలిసి తనకు తిరిగి రెండోసారి అవకాశాన్ని పరిశీలించాలని కోరినట్లు సమాచారం. మరి కొద్ది రోజుల్లో ఆయన పదవీకాలం ముగియనున్న సందర్భంగా రాష్ట్రంలోని ఎమ్మెల్సీల భర్తీకి ఆదివారం ఏడుగురి పేర్లతో కూడిన జాబితాను కేసీఆర్ ప్రకటించారు. అందులో గవర్నర్ కోటా కింద ఫారూక్ హుస్సేన్ అభ్యర్థిత్వాన్ని సీఎం ఖరారు చేయడం విశేషం. -
పార్టీలు మారడమంటే రాజకీయ వ్యభిచారమే
రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు సాక్షి, న్యూఢిల్లీ: ‘‘ఒకప్పుడు నాయకులు ఏళ్ల తరబడి ఒకే పార్టీలో ఉండేవారు. ఒకే నాయకుడిని నమ్ముకునేవారు. ఇప్పుడు బట్టలు మార్చినట్టు పార్టీలు మారుస్తున్నారు. పొద్దునో షర్టు.. రాత్రికో షర్టు.. అన్నట్టుంది పరిస్థితి. పార్టీలు మారడమంటే రాజకీయ వ్యభిచారం చేసినట్టే..’’ అని రాజ్యసభ సభ్యుడు, కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు వ్యాఖ్యానించారు. సోమవారం ఢిల్లీలోని తన నివాసంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో ఎన్నో పదవులను అనుభవించిన ఫారూఖ్ హుస్సేన్ టీఆర్ఎస్లో చేరడం బాధాకరమన్నారు. అలాగే తొలి నుంచీ కాంగ్రెస్‌లో లేని పువ్వాడ అజయ్ కుమార్‌ను పిలిచి మరీ టికెట్ ఇచ్చి గెలిపించుకున్నా ఆయన కూడా టీఆర్ఎస్లో చేరిపోయారన్నారు. పార్టీ వరుస ఓటములపై సమీక్షించాలని పీసీసీ నాయకత్వాన్ని, జాతీయ నాయకత్వాన్ని పదేపదే కోరినా దిగ్విజయ్‌సింగ్, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జానారెడ్డి పట్టించుకోలేదని వీహెచ్ విమర్శించారు. ఇప్పటికైనా అందరం ఏకతాటిపై నిలిచి చర్చించుకుంటే సమస్య తీరుతుందని పేర్కొన్నారు. గతంలో ఇలాంటివి జరిగితే మధ్యవర్తులు ఉండేవారని, ఇప్పుడు మధ్యవర్తులూ లేరన్నారు. తప్పులను సమీక్షంచుకోవడం మంచి పద్ధతని పేర్కొన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో సమన్వయం లోపించిందని అభిప్రాయపడ్డారు. సమన్వయ కమిటీ ఉన్నా అందులోనే సమన్వయం లేదని ఆరోపించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఏడుగురితోనే సమన్వయ కమిటీ ఉండేదని, ఇప్పుడు 31 మంది ఉన్నా పరిస్థితి బాగోలేదని అసంతృప్తి వ్యక్తంచేశారు. -
‘పార్టీకి పట్టిన శని వదిలింది’
ఫారూక్ వెళ్లడంతో కాంగ్రెస్‌లో సంబరాలు చిన్నకోడూరు: ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్లో చేరడంతో కాంగ్రెస్ కార్యకర్తలు సోమవారం చిన్నకోడూరులో సంబురాలు జరుపుకున్నారు. టపాసులు కాల్చి, మిఠాయిలు పంచుకున్నారు. ఫారూఖ్ హుస్సేన్ కాంగ్రెస్ పార్టీని వీడడంతో సిద్దిపేట నియోజకవర్గానికి పట్టిన గ్రహణం వీడి మంచి రోజులు రానున్నాయన్నారు. ఫారూఖ్ 30 ఏళ్లుగా పార్టీ పదవులు అనుభవించి ఏనాడూ పార్టీ అభ్యున్నతికి గాని, కార్యకర్తలకు అండగా కానీ నిలవలేదన్నారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని ఫారూఖ్ భ్రష్టుపట్టించాడన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్‌రావుకు విధేయుడిగా పనిచేశాడన్నారు. ఇక సిద్దిపేట ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం వస్తుందనే ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి మీసం నాగరాజు, నంగునూరు మంండల పార్టీ అధ్యక్షులు, సర్పంచ్ దేవులపల్లి యాదగిరి, నాయకులు కొర్రి శంకర్, మహేందర్, ప్రవీణ్, పర్శరాములు, రాజు తదితరులు ఉన్నారు. శని వదిలింది.. దుబ్బాక : కాంగ్రెస్ ఆధినేత్రి సోనియా గాంధీ పెట్టిన భిక్షతో ఉన్నత పదవులు పొందిన ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్ పార్టీలో ఉన్నన్ని రోజులు టీఆర్ఎస్కు కోవర్ట్‌గా పని చేశారని, ఆయన టీఆర్ఎస్లో చేరడంతోనే కాంగ్రెస్‌కు పట్టిన శని వదిలిందని డీసీసీ ఉపాధ్యక్షుడు కటిక బాల్‌రాజు అన్నారు. సోమవారం ఆయన దుబ్బాకలో విలేకరులతో మాట్లాడుతూ తన రక్తంలో కాంగ్రెస్ రక్తమే ప్రవహిస్తోందని, చచ్చినా బతికినా కాంగ్రెస్‌లోనే ఉంటానని ప్రగల్భాలు పలికిన ఫారూఖ్ ఇప్పుడెందుకు పార్టీని వీడారో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. కాంగ్రెస్ నుంచి బహిష్కరిస్తారనే ముందస్తు సమాచారంతోనే ఆయన కాంగ్రెస్‌ను వీడి గులాబీ కండువా కప్పుకున్నారని విమర్శించారు. అన్నం పెట్టిన పార్టీకి సున్నం పెట్టడం ఫారూఖ్‌కు వెన్నతో పెట్టిన విద్య అన్నారు. -
కాంగ్రెస్ కు ఫారూక్ ఝలక్
♦ గులాబీ గూటికి ఎమ్మెల్సీ ♦ కేసీఆర్ సమక్షంలో చేరిక సిద్దిపేట జోన్ : కాంగ్రెస్ పార్టీకి జిల్లాలో మరోగట్టి దెబ్బ తగిలింది. గత కొంత కాలంగా టీఆర్ఎస్ ఆకర్ష్‌కు కాంగ్రెస్, టీడీపీ పార్టీల ముఖ్య నేతలు వ లసబాట పట్టిన విషయం తెలిసిందే. జిల్లాలో రెండు ఎమ్మెల్సీలు ఉన్న కాంగ్రెస్‌కు ప్రస్తుతం ఉన్న ఒక్క నామినేటేడ్ ఎమ్మెల్సీ కూడా చేజారింది. దీంతో జిల్లాలో కాంగ్రెస్‌కు శాసన మండలిలో ప్రతినిధ్యమే కరువైంది. సిద్దిపేట, దుబ్బాక నియోజకవర్గాల్లో మూడు దశాబ్దాలుగా కాంగ్రెస్ ముఖ్యనేతగా వ్యవహరించిన ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్ సోమవారం సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఆయన చేరికతో రెండు నియోజకవర్గాల్లో భిన్నాభిప్రాయలు వ్యక్తమవుతున్నాయి. సిద్దిపేట నియోజకవర్గంలో ఫారూఖ్ పార్టీని వీడడం పట్ల కాంగ్రెస్ కార్యకర్తలు సంబురాలు జరుపుకొవడం విశేషం. కాగా రెండు నియోజకవర్గాల్లో ఇప్పటి వర కు కాంగ్రెస్ కార్యకలాపాలను నిర్వహించిన సీనియర్ నేత ఫారూఖ్ పార్టీ మారడం పరోక్షంగా కాంగ్రెస్‌కు షాకే.. సిద్దిపేటకు చెందిన ఫారూఖ్ హుస్సేన్ 1977లో మాజీ మంత్రి అనంతుల మదన్మోహన్ ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి వచ్చారు. సిద్దిపేట మున్సిపల్ కౌన్సిలర్‌గా రెండుసార్లు పనిచేశారు. సమైక్య రా్రష్టంలో యువజన కాంగ్రెస్ జిల్లా, రాష్ట్రస్థాయి పదవుల్లో కొనసాగారు. 1991లో రాష్ట్ర కాంగ్రెస్ మైనార్టీసెల్ అధ్యక్షునిగా పనిచేశారు. 2004లో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలోని ప్రభుత్వంలో మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్‌గా పనిచేశారు. 2011లో గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీ పదవిని పొంది ప్రస్తుతం కాంగ్రెస్ శాసనమండలి సభ్యునిగా కొనసాగుతున్నారు. ఆయన పదవీ కాలం వచ్చే యేడాది జూన్‌లో ముగియనుంది. హరీశ్‌రావు నియోజకవర్గంలో జరిగే ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ ప్రతినిధిగా ప్రొటోకాల్‌కు అనుగుణంగా ఆయన పనిచేశారు. గత కొంత కాలంగా ఆయన టీఆర్ఎస్తో సన్నిహితంగా ఉంటున్నారనే ఆరోపణలు ఉన్న క్రమంలో గత నెల రోజులుగా ఫారూఖ్ హుస్సేన్ పార్టీని వీడనున్నారనే ప్రచారం జిల్లాలో జోరుగా సాగింది. ఆయన పదవీ కాలం మరో ఏడాది మాత్రమే ఉండడం భవిష్యత్తు రాజకీయాలను దృష్టిలో పెట్టుకొని టీఆర్ఎస్లో చేరి, ఎమ్మెల్సీని రెండవ సారి దక్కించుకునే అలోచనతో సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావుతో ఉన్న సాన్నిహిత్యంతో పార్టీ మారినట్లు తెలిసింది. జిల్లాలో ఉన్న ఒకే ఒక కాంగ్రెస్ ఎమ్మెల్సీ కూడా టీఆర్ఎస్లో చేరడం కాంగ్రెస్‌కు దెబ్బే. మరోవైపు ఫారూఖ్ హూస్సేన్ పార్టీ వీడడం పట్ల సిద్దిపేట నియోజకవర్గంలోని కాంగ్రెస్ కార్యకర్తలు సోమవారం సంబురాలు నిర్వహించుకోవడం గమనార్హం. -
'గెలిపించాలని ఇంటింటికి వెళ్లి అడుగుతా'
-
నేను, కేసీఆర్ కాంగ్రెస్‌లో పనిచేశాం
కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం కష్టకాలంలో ఉందని శాసన మండలి ఛైర్మన్ పదవికి ఆ పార్టీ తరఫున పోటీచేస్తున్న ఫారుఖ్ హుస్సేన్ అన్నారు. ఇలాంటి సమయంలోనే ఎమ్మెల్సీలంతా పార్టీకి కట్టుబడి ఉండాలని, ఛైర్మన్‌గా తన విజయానికి కృషి చేయాలని ఆయన చెప్పారు. అన్ని పార్టీల ఎమ్మెల్సీలను తాను వ్యక్తిగతంగా వెళ్లి కోరుతానని ఫారుఖ్ హుస్సేన్ అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, తాను గతంలో కాంగ్రెస్ పార్టీలో కలిసి పనిచేశామని, అదే అనుబంధంతో ఇప్పుడు ఆయనను కూడా కలిసి తన విజయానికి సహకరించాల్సిందిగా కోరుతానని హుస్సేన్ అన్నారు. -
'గెలిపించాలని ఇంటింటికి వెళ్లి అడుగుతా'
హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం కష్టకాలంలో ఉందని శాసనమండలి కాంగ్రెస్ చైర్మన్ అభ్యర్థి ఫరూక్ హుస్సేన్ అన్నారు. పార్టీ ఎమ్మెల్సీలంతా పార్టీకి కట్టుబడి ఉండాలని ఆయన కోరారు. కాంగ్రెస్ కౌన్సిల్ ఛైర్మన్ అభ్యర్థిగా ఫరూక్ హుస్సేన్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను మచ్చలేని మైనార్టీ నేత అని, చైర్మన్‌గా తన విజయానికి కృషి చేయాలని అన్ని పార్టీల ఎమ్మెల్సీల ఇళ్లకు వెళ్లి స్వయంగా విజ్ఞప్తి చేస్తామన్నారు. గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్, తాను కాంగ్రెస్ పార్టీలో కలిసి పని చేశామన్నారు. అదే అనుబంధంతో కేసీఆర్‌ను కలిసి కోరనున్నట్లు చెప్పారు. కాగా టీఆర్ఎస్ శాసనమండలి ఛైర్మన్ అభ్యర్థిగా ఆపార్టీ ఎమ్మెల్సీ స్వామిగౌడ్ నామినేషన్ దాఖలు చేశారు. -
కాంగ్రెస్ మండలి చైర్మన్‌గా ఫారూఖ్ హుస్సేన్
హైదరాబాద్ : తెలంగాణ శాసనమండలి చైర్మన్ అభ్యర్థిగా ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్‌ను కాంగ్రెస్ పార్టీ ఎంపిక చేసింది. అంతకు ముందు గాంధీభవన్‌లో సమావేశం అయిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ... మండలి చైర్మన్ పదవికి చేయాలని నిర్ణయించింది. ఈ సమావేశంలో పొన్నాల లక్ష్మయ్య, జానారెడ్డి, షబ్బీర్ అలీ తదితరులు హాజరు అయ్యారు. మరోవైపు టీఆర్ఎస్ పార్టీ నుంచి మండలి ఛైర్మన్‌గా స్వామిగౌడ్ పేరు దాదాపు ఖరారైంది. ఈరోజు సాయంత్రం పార్టీ ముఖ్య నేతలతో కేసీఆర్ భేటీ కానున్నారు. చైర్మన్ పదవికి రేపు నామినేషన్ దాఖలు చేశారు.