
సాక్షి, సిద్దిపేట : సిద్దిపేటకు చెందిన రాష్ట్ర శాసన మండలి సభ్యుడు ఫారూక్ హుస్సేన్‌కు డెంగీ జ్వరం సోకింది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆయనను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. తొలుత జ్వరం తీవ్రత అధికంగా ఉండటంతో సిద్దిపేటలో ప్రథమ చికిత్స అందించిన డాక్టర్లు డెంగీ లక్షణాలు ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేశారు. దీంతో అప్రమత్తమైన కుటుంబ సభ్యులు ఎమ్మెల్సీని బంజారాహిల్స్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ రక్త పరీక్షలు నిర్వహించిన వైద్యులు డెంగీ సోకినట్లు నిర్ధారించారు. ప్రస్తుతం ఫారూక్ హుస్సేన్ ఆరోగ్యం నిలకడగా ఉందని ఆయన బంధువులు తెలపారు.
Comments
Please login to add a commentAdd a comment