
సాక్షి, సిద్దిపేట: ఫారూక్ హుస్సేన్‌కు శాసన మండలి సభ్యుడి(ఎమ్మెల్సీ)గా మరోసారి అవకాశం దక్కుతుందా? గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎవరి పేరును ప్రతిపాదిస్తారో! అని జిల్లా వ్యాప్తంగా చర్చసాగుతోంది. ఈ నెల 27వ తేదీతో ఫారూక్ హుస్సేన్‌కు ఎమ్మెల్సీ పదవీకాలం ముగియనుంది. కాగా గవర్నర్ కోటాలో రెండు ఎమ్మెల్సీలు ఖాళీ కానున్నాయి. దీంతో మళ్లీ ఎమ్మెల్సీగా ఫారూక్ హుస్సేన్‌కు అవకాశం ఉంటుందా.. లేదా.. అనేది తెలియాల్సి ఉంది.
కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీగా..
► 2011, మే 28న కాంగ్రెస్ తరపున గవర్నర్ కోటాలో శాసన మండలి సభ్యుడిగా ఫారూక్ హుస్సేన్‌కు తొలిసారి అవకాశం దక్కింది.
► 2014 జూన్ 1 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యుడిగా, రాష్ట్రం ఏర్పడిన తర్వాత నుంచి 2017 మే 27 వరకు తెలంగాణ శాసన మండలి సభ్యుడిగా పని చేశారు.
►ఏప్రిల్ 26, 2016న బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. రెండోసారి 2017, మే 28న టీఆర్‌ఎస్ నుంచి గవర్నర్ కోటాలో శాసన మండలి సభ్యుడిగా ఎన్నికయ్యారు.
► ప్రస్తుతం ఆయన బీఆర్‌ఎస్ కార్యదర్శిగా, వక్ఫ్ బోర్డు, హజ్ కమిటీ సభ్యునిగా కొనసాగుతున్నారు.
► ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ నుంచి మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్‌గా పని చేశారు.
► గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల ఎంపికకు మంత్రివర్గ తీర్మానంతో గవర్నర్‌కు పేర్లను సిఫార్సు చేయనున్నారు.
► రెండు మార్లు ఎమ్మెల్సీగా పని చేసిన అనుభవం ఉన్న ఫారూక్‌కు మైనార్టీ కోటాలో తిరిగి అవకాశం లభిస్తుందా అనేది తెలియాల్సి ఉంది.
► ఇప్పటికే ఉమ్మడి మెదక్ జిల్లా స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీగా గజ్వేల్‌కు చెందిన డాక్టర్ యాదవరెడ్డి, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా సిద్దిపేటకు చెందిన దేశపతి శ్రీనివాస్ కొనసాగుతున్నారు. టీఎస్‌ఎంఐడీసీ చైర్మన్‌గా డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్, తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక సారధిగా రసమయి బాలకిషన్, టీఎస్‌ఐఐసీ చైర్మన్‌గా బాలమల్లు కొనసాగుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment