
పోచమ్మకు బోనాలు
ఆలోచన అదిరె.. దృష్టి మరలె
దేవక్కపల్లెలో రెడ్డిసంఘం ఆధ్వర్యంలో గురువారం పోచమ్మ బోనాలు ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని ప్రధాన వీధుల గుండా మహిళలు బోనాలతో ఆలయానికి తరలివెళ్లి అమ్మవారికి నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకొన్నారు. పంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలని రెడ్డి సంఘం నాయకులు ఆకాంక్షించారు.
– బెజ్జంకి(సిద్దిపేట)
పశుపక్షాదుల నుంచి పంటలను కాపాడుకోవడానికి రైతులు దిష్టి బొమ్మలను ఏర్పాటు చేస్తుంటారు. కానీ మిరుదొడ్డి మండలం లక్ష్మీనగర్‌లో ఓ రైతు బీర పంట చుట్టూ చీరలను ఏర్పాటు చేశారు. నర దిష్టి తగలకుండా ఉండేందుకు ఇలా చీరలను ఏర్పాటు చేసినట్లు రైతు చెబుతున్నారు. చీరలను పంట చుట్టూ ఏర్పాటు చేయడంతో అటుగా వెళ్తున్న ప్రతి ఒక్కరూ ఆసక్తిగా దృష్టి సారిస్తుండటం విశేషం. – మిరుదొడ్డి(దుబ్బాక)

పోచమ్మకు బోనాలు