గజ్వేల్‌రూరల్: గజ్వేల్ పట్టణంలోని ప్రభుత్వాస్పత్రిని కాయకల్ప బృందం గురువారం సందర్శించింది. హైదరాబాద్‌లోని గోల్కొండ ప్రభుత్వ ఆస్పత్రికి చెందిన డాక్టర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలోని కాయకల్ప బృందం ప్రభుత్వాస్పత్రిలోని ఆపరేషన్ థియేటర్, లేబర్‌రూమ్‌తో పాటు పలు వార్డులను పరిశీలించింది. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అన్నపూర్ణను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో కాయకల్ప బృందం సభ్యులు శ్రీనివాస్, పద్మావతి, విజేత, ఫాతిమ, మేరి, సుష్మిత, మనోజ్‌లతో పాటు ప్రభుత్వాస్పత్రి వైద్యులు పాల్గొన్నారు.