
సీటు బెల్ట్ ధరించడం తప్పనిసరి
ట్రాఫిక్ సీఐ ప్రవీణ్‌కుమార్
సిద్దిపేటఅర్బన్: వాహనాలు నడిపే వారు తప్పనిసరిగా సీటు బెల్ట్ ధరించాలని ట్రాఫిక్ సీఐ ప్రవీణ్‌కుమార్ సూచించారు. గురువారం సాయంత్రం రాజీవ్ రహదారి పొన్నాల దాబాల వద్ద పెండింగ్ చలాన్‌లపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీటు బెల్ట్ ధరించడం వల్ల అనుకోకుండా ప్రమాదం జరిగితే కారులో ఉండే ఎయిర్ బెలూన్స్ తెరుచుకొని ప్రాణాపాయం నుంచి బయటపడేస్తాయన్నారు. అలాగే ప్రతి ఒక్కరు రోడ్డు నిబంధనలు పాటించాలని సూచించారు. పెండింగ్ చలాన్లకు సంబంధించి రూ. 42వేల జరిమానా వసూలు చేసినట్లు చెప్పారు.