
మే నెలంతా సెలవులివ్వండి
సిద్దిపేటరూరల్: అంగన్‌వాడీ టీచర్స్, హెల్పర్స్ అందరికీ మే నెల మొత్తం సెలవులు ఇవ్వాలంటూ కలెక్టరేట్ ఎదుట గురువారం నిరసన చేపట్టారు. అనంతరం యూనియర్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఏఓ రెహమన్‌కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా కార్యదర్శి పద్మ మాట్లాడుతూ వేసవి కాలం సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల్లో సమానంగా అంగన్‌వాడీలకు సైతం ఒక్కపూట బడిని నిర్ణయిస్తూ సర్క్యలర్ జారీ చేయడం మంచి విషయమన్నారు. ఇటీవల ములుగు జిల్లాలో జరిగిన పోషన్ పక్వాడా కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సీతక్క మేనెల మొత్తం సెలవులు ప్రకటించే యోచనలో ఉన్నట్లు తెలిపారన్నారు. 40 డగ్రీలకు పైగా ఎండ తీవ్రత నమోదవుతోందన్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి సెలవులపై ప్రకటన చేయాలన్నారు. తమకు స్పష్టమైన హమీ ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి సింగిరెడ్డి చంద్రారెడ్డి, యూనియన్‌జిల్లా అధ్యక్షురాలు లక్ష్మి వీరమని, శారద, కళావతి, మల్లీశ్వరి తదితరులు పాల్గొన్నారు.
కలెక్టరేట్ ఎదుట అంగన్‌వాడీల నిరసన