చంద్రయాన్‌–3పై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం | Chandrayaan-3: School students to participate in awareness programme - Sakshi
Sakshi News home page

చంద్రయాన్‌–3పై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం

Published Sat, Aug 26 2023 9:50 AM | Last Updated on Sat, Aug 26 2023 10:21 AM

awareness Programme about Chandrayaan 3  - Sakshi

హైదరాబాద్‌: చంద్రుడి దక్షిణ దవంపై చంద్రయాన్‌–3 ద్వారా అడుగు పెట్టిన భారతదేశ శాస్త్రవేత్తల ఘనతపై బంజారహిల్స్‌ నందినగర్‌లోని ఖుష్బూ విద్యానికేతన్‌ స్కూల్‌లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రయోగంలోని సాంకేతికతకు సంబంధించిన వివరాలను విద్యార్థులకు తెలియజేశారు.

ఇస్రో శాస్త్రవేత్తలు విక్రమ్‌ ల్యాండర్‌ ప్రత్యేకతలతో పాటు అక్కడి స్థితి గతులను అది ఏ విధంగా పంపిస్తుందో వంటి ఆసక్తికరమైన విషయాలను పాఠశాలలోని సైన్స్‌ టీచర్‌ రేష్మ విద్యార్థులకు వివరించారు. ఇలాంటి కార్యక్రమాల వల్ల చిన్నారుల్లో శాస్త్రసాంకేతిక రంగాలపై ఆసక్తి పెరుగుతుందని ప్రిన్సిపాల్‌ రాజ్‌దేవి తెలిపారు.

ఈ సందర్భంగా చంద్రయాన్‌ ప్రయోగంపై 5వ తరగతి విద్యార్థి సయ్యద్‌ మోయినుద్దీన్‌ ఖాదర్‌ రూపొందించిన ప్రజంటేషన్‌ను ఉపాధ్యాయులు అభినందించారు. ఈ కార్యక్రమంలో స్కూల్‌ ఉపాధ్యాయులు పవన్‌ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: PM Modi ISRO Visit Highlights: బెంగళూరులో మోదీ.. 'జై విజ్ఞాన్, జై అనుసంధాన్' నినాదాలు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement