అనంతపురం అర్బన్ : వెబ్‌ల్యాండ్‌లో ఒకరి పేరున ఉన్న భూమి మరొకరి పేరుపై నమోదవడం, ఉన్న భూమి కంటే తక్కువగా చూపడం వంటి పొరపాట్లు అధికమవుతండటంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో రైతులకు వెబ్‌ల్యాండ్‌పై అవగాహన కల్పించడానికి ‘సాక్షి’ సదస్సు నిర్వహిస్తోంది.
ఈ నెల 23న ఉదయం పది గంటలకు అనంతపురం రూరల్ మండలం ఇటుకలపల్లి గ్రామంలో జరిగే సదస్సుకు రెవెన్యూ అధికారులను ఆహ్వానించి వెబ్‌ల్యాండ్‌పై రైతులకు అవగాహన కల్పించనుంది. రైతులు తమ భూముల వివరాలు వెబ్‌ల్యాండ్‌లో తప్పుగా నమోదై ఉంటే వాటిని అధికారుల దృష్టికి తీసుకొస్తే పరిష్కారానికి చర్యలు తీసుకుంటారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ‘సాక్షి’ కోరుతోంది.
వెబ్‌ల్యాండ్‌పై రేపు అవగాహన సదస్సు
Published Sun, Aug 21 2016 11:02 PM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM
Advertisement