ఐదు లక్షలిచ్చి.. 16 ఏళ్ల అమ్మాయిని.. | Hyderabad Girl, 16, Married To 65-Year-Old Oman National For Rs. 5 Lakh | Sakshi
Sakshi News home page

ఐదు లక్షలిచ్చి.. 16 ఏళ్ల అమ్మాయిని..

Published Thu, Aug 17 2017 3:14 PM | Last Updated on Tue, Oct 16 2018 5:58 PM

ఐదు లక్షలిచ్చి.. 16 ఏళ్ల అమ్మాయిని.. - Sakshi

ఐదు లక్షలిచ్చి.. 16 ఏళ్ల అమ్మాయిని..

హైదరాబాద్: నగరానికి చెందిన పదహారేళ్ల ముస్లిం బాలికను 65 ఏళ్ల వ్యక్తి పెళ్లి చేసుకుని ఒమన్‌ తీసుకెళ్లిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. బాలిక పిన్ని, బాబాయ్‌లు రూ.5 లక్షలకు తన కూతుర్ని 65 ఏళ్ల ఒమన్‌ దేశీయుడికి ఇచ్చి కట్టబెట్టారని బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

మూడు నెలల క్రితం ఇరువురికి వివాహం జరిపించినట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ఇదంతా తనకు తెలియకుండా చేశారని పోలీసుల వద్ద భోరున విలపించింది. పెళ్లికి సంబంధించిన ఫొటోలను పోలీసులకు అందజేసింది. ప్రస్తుతం బాలిక తనకు ఫోన్‌ చేసి తిరిగి హైదరాబాద్‌కు తీసుకురావాలని కోరుతోందని తెలిపింది.

తన కూతురిని వివాహం చేసుకున్న వ్యక్తితో తాను ఫోన్‌లో మాట్లాడగా.. పెళ్లి సమయంలో అతను రూ.5 లక్షలు చెల్లించినట్లు చెప్పాడని వివరించింది. ఆ డబ్బు వెనక్కు పంపితే బాలికను తిరగి హైదరాబాద్ పంపుతానని అంటున్నాడని చెప్పింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement