
సాక్షి, మోర్తాడ్ (బాల్కొండ): విదేశీ పర్యాటకులకు ఒమన్ ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది. విజిట్ వీసాతో సంబంధం లేకుండానే ఒమన్‌లో పది రోజులపాటు పర్యటించడానికి అవకాశం కల్పించింది. భారత్‌సహా 103 దేశాల పర్యాటకులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. గతంలో ఒమన్‌లో పర్యటిం చాలంటే నెల లేదా 3 నెలల కాలపరిమితి గల విజిట్ వీసాను తీసుకోవాల్సి వచ్చేది. విజిట్ వీసా కోసం రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు ఖర్చు అయ్యేది. ఎవరైనా స్పాన్సర్లు ఉంటే విజిట్ వీసా ఉచితంగానే లభించేది. తాజా వెసులుబాటు నేపథ్యంలో ఒమన్‌లో పర్యటించే పర్యాటకులు అక్కడి రాయల్ పోలీసు నిబంధనలను అనుసరించాలి. ఆరోగ్య బీమా, ఒమన్ వచ్చి వెళ్లడానికి విమాన టికెట్లు, బస చేసే హోటల్ వివరాలను ఒమన్ రాయల్ పోలీసులకు అందించాలి. పర్యటన ఆసాంతం పోలీసుల నిఘా ఉంటుంది.