ధర్మశాల:వరల్డ్ టీ 20లో నెదర్లాండ్స్-ఒమన్ జట్ల మధ్య శుక్రవారం ఇక్కడ జరగాల్సిన క్వాలిఫయింగ్ మ్యాచ్‌ను వరుణుడు అడ్డుకున్నాడు. గత రాత్రి భారీ వర్షం కురవడంతో అవుట్ ఫీల్డ్ చిత్తడిగా మారింది. ఈ మ్యాచ్‌లో కేవలం టాస్ మాత్రమే సాధ్యమైంది. టాస్ గెలిచిన ఒమన్ తొలుత ఫీల్డింగ్ చేయాలని నిర్ణయించుకున్నా.. ఒక్క బంతి కూడా పడకుండానే మ్యాచ్ రద్దయ్యింది. దీంతో ఇరు జట్లకు తలో పాయింట్ లభించింది. కాగా, నెదర్లాండ్స్ పెట్టుకున్న సూపర్-10 దశ ఆశలకు మాత్రం బ్రేక్ పడింది. గత మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై నెదర్లాండ్స్ ఓటమి పాలైంది.
నెదర్లాండ్స్-ఒమన్ మ్యాచ్ రద్దు
Published Fri, Mar 11 2016 6:39 PM | Last Updated on Sun, Sep 3 2017 7:30 PM
Advertisement