T20 World Cup 2021: పాల్గొనే జట్లు, పూర్తి షెడ్యూల్‌.. ఇతర వివరాలు | ICC T20 World Cup 2021: Schedule Group Team List Time Table Venue | Sakshi
Sakshi News home page

T20 World Cup 2021: పాల్గొనే జట్లు, పూర్తి షెడ్యూల్‌.. ఇతర వివరాలు

Published Sat, Oct 16 2021 12:29 PM | Last Updated on Wed, Oct 20 2021 4:46 PM

ICC T20 World Cup 2021: Schedule Group Team List Time Table Venue - Sakshi

ICC T20 World Cup 2021: మరికొన్ని గంటల్లో మరో క్రికెట్‌ పండుగ మొదలుకానుంది. పొట్టి ఫార్మాట్‌లోని మజా పంచేందుకు ఐసీసీ టీ20 వరల్డ్‌కప్‌ టోర్నీ మన ముందుకు రానుంది. అక్టోబరు 17 నుంచి ఆరంభం కానున్న ఈ మెగా ఈవెంట్‌కు సంబంధించిన షెడ్యూల్‌, జట్లు, సమయ పట్టిక, వేదిక తదితర అంశాల గురించి పరిశీలిద్దాం.

16 జట్లు
టీ20 వరల్డ్‌కప్‌-2021 టోర్నీలో మొత్తం 16 జట్లు ఆడబోతున్నాయి. టీమిండియా, వెస్టిండీస్‌, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌, దక్షిణాఫ్రికా, పాకిస్తాన్‌, అఫ్గనిస్తాన్‌, శ్రీలంక, బంగ్లాదేశ్‌, హాలాండ్‌, స్కాట్లాండ్‌, ఐర్లాండ్‌, ఒమన్‌, పపువా న్యూ గినియా, నమీబియా మెగా టోర్నీలో భాగం కానున్నాయి. నవంబరు 14న ఫైనల్‌ మ్యాచ్‌ జరుగుతుంది.

4 స్థానాల కోసం పోటీ
సూపర్‌ 12లో భాగంగా ఇప్పటికే 8 జట్లు అర్హత సాధించిన విషయం తెలిసిందే. మిగిలిన నాలుగు స్థానాల కోసం 8 జట్లు పోటీపడనున్నాయి. 
గ్రూప్‌-ఏలో శ్రీలంక, ఐర్లాండ్‌, నెదర్లాండ్స్‌, నమీబియా.. గ్రూప్‌ బీలో బంగ్లాదేశ్‌, స్కాట్లాండ్‌, పపువా న్యూగినియా, ఒమన్‌ ఉన్నాయి. ప్రతి గ్రూపులో టాపర్‌గా నిలిచిన రెండు జట్లు సూపర్‌ 12కు అర్హత సాధిస్తాయి.

సూపర్‌ 12లో ఉన్న జట్లు
గ్రూప్‌ 1లో ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, వెస్టిండీస్‌, గ్రూప్‌- ఏ(A1) టాపర్‌, గ్రూప్‌-బీ(B2)లోని రెండో జట్టు ఉంటాయి.
గ్రూప్‌-2లో టీమిండియా, న్యూజిలాండ్‌, పాకిస్తాన్‌, అఫ్గనిస్తాన్‌, A2, B1 ఉంటాయి. 
ప్లేఆఫ్‌ చేరుకున్న ఇరు గ్రూపుల నుంచి రెండు జట్లు సెమీ ఫైనల్‌లో తలపడతాయి. 
మ్యాచ్‌లు భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:30 నిమిషాలు, రాత్రి 7:30 నిమిషాలకు మొదలవుతాయి.

మ్యాచ్‌ నెంబర్‌ తేదీ మ్యాచ్‌ సమయం  వేదిక స్టేజ్‌

1, 

అక్టోబరు 17 ఒమన్‌ వర్సెస్‌ పపువా న్యూగినియా 03:30 మస్కట్‌ రౌండ్‌- 1

2

అక్టోబరు 17 బంగ్లాదేశ్‌ వర్సెస్‌ స్కాట్లాండ్‌ 07:30 మస్కట్‌ రౌండ్‌- 1
3 అక్టోబరు 18 ఐర్లాండ్‌ వర్సెస్‌ నెదర్లాండ్స్‌ 03:30 అబుదాబి రౌండ్‌- 1
4 అక్టోబరు 18 శ్రీలంక వర్సెస్‌ నమీబియా 07:30 అబుదాబిi రౌండ్‌- 1
5 అక్టోబరు 19 స్కాట్లాండ్‌ వర్సెస్‌ పపువా న్యూగినియా 03:30 మస్కట్‌ రౌండ్‌- 1

6

అక్టోబరు 19 ఒమన్‌ వర్సెస్‌ బంగ్లాదేశ్‌ 07:30 మస్కట్‌ రౌండ్‌- 1

7

అక్టోబరు 20 నమీబియా వర్సెస్‌ నెదర్లాండ్స్‌ 03:30 అబుదాబి రౌండ్‌ 1
8   అక్టోబరు 20 శ్రీలంక వర్సెస్‌ ఐర్లాండ్‌ 07:30 అబుదాబి రౌండ్‌ 1
9 అక్టోబరు 21 బంగ్లాదేశ్‌ వర్సెస్‌ పపువా న్యూగినియా 03:30 మస్కట్‌ రౌండ్‌ 1
10 అక్టోబరు 21 ఒమన్‌ వర్సెస్‌ స్కాట్లాండ్‌ 07:30 మస్కట్‌   రౌండ్‌ 1
11 అక్టోబరు 22 నమీబియా వర్సెస్‌ ఐర్లాండ్‌ 03:30 అబుదాబి రౌండ్‌ 1
12 అక్టోబరు 22 శ్రీలంక వర్సెస్‌ నెదర్లాండ్స్‌ 07: 30 అబుదాబి రౌండ్‌ 1
13 అక్టోబరు 23 ఆస్ట్రేలియా వర్సెస్‌ దక్షిణాఫ్రికా 03: 30 అబుదాబి సూపర్‌ 12
14 అక్టోబరు 23 ఇంగ్లండ్‌ వర్సెస్‌ వెస్టిండీస్‌ 07:30 అబుదాబి సూపర్‌ 12

15
అక్టోబరు 24 A1 vs B2 03:30 షార్జా సూపర్‌ 12
16 అక్టోబరు 24 ఇండియా వర్సెస్‌ పాకిస్తాన్‌ 07:30 దుబాయ్‌ సూపర్‌ 12
17  అక్టోబరు 25 అఫ్గనిస్తాన్‌ వర్సెస్‌ B1 07:30  షార్జా  సూపర్‌ 12
18 అక్టోబరు 26 సౌతాఫ్రికా వర్సెస్‌ వెస్టిండీస్‌  03:30 దుబాయ్‌ సూపర్‌ 12
19 అక్టోబరు 26  పాకిస్తాన్‌ వర్సెస్‌ న్యూజిలాండ్‌  07:30 షార్జా సూపర్‌ 12
20 అక్టోబరు 27 ఇంగ్లండ్‌ వర్సెస్‌ B2 03:30 అబుదాబి  సూపర్‌ 12
21     అక్టోబరు 27 B1 వర్సెస్‌ A2 07:30 అబుదాబి  సూపర్‌ 12
22  అక్టోబరు 28 ఆస్ట్రేలియా వర్సెస్‌ A1 07:30 దుబాయ్‌ సూపర్‌ 12
23 అక్టోబరు 29 వెస్టిండీస్‌ వర్సెస్‌ B2 03:30 షార్జా  సూపర్‌ 12
24 అక్టోబరు 29 అఫ్గనిస్తాన్‌ వర్సెస్‌ పాకిస్తాన్‌ 07:30 దుబాయ్‌ సూపర్‌ 12
25 అక్టోబరు 30 సౌతాఫ్రికా వర్సెస్‌ A1 03:30 షార్జా సూపర్‌ 12
26 అక్టోబరు 30 ఇంగ్లండ్‌ వర్సెస్‌ ఆస్ట్రేలియా, 07:30 దుబాయ్‌ సూపర్‌ 12
27 అక్టోబరు 31 అఫ్గనిస్తాన్‌ వర్సెస్‌ A2 03:30 అబుదాబి సూపర్‌ 12
28 అక్టోబరు 31 ఇండియా వర్సెస్‌ న్యూజిలాండ్‌ 07:30 దుబాయ్‌ సూపర్‌ 12
29 నవంబరు 1 ఇంగ్లండ్‌ వర్సెస్‌ A1 07:30 షార్జా సూపర్‌ 12
30 నవంబరు 2 సౌతాఫ్రికా వర్సెస్‌ B2 03:30 అబుదాబి సూపర్‌ 12
31 నవంబరు 2 పాకిస్తాన్‌ వర్సెస్‌ A2 07:30 అబుదాబి సూపర్‌ 12
32 నవంబరు 3 న్యూజిలాండ్‌ వర్సెస్‌ B1 03:30 దుబాయ్‌ సూపర్‌ 12
33 నవంబరు 3 ఇండియా వర్సెస్‌ అఫ్గనిస్తాన్‌ 07:30 అబుదాబి సూపర్‌ 12
34
 
నవంబరు 4 ఆస్ట్రేలియా వర్సెస్‌ B2 03:30 దుబాయ్‌ సూపర్‌ 12
35 నవంబరు 4 వెస్టిండీస్‌ వర్సెస్‌ A1 07:30 అబుదాబి సూపర్‌ 12
36 నవంబరు 5 న్యూజిలాండ్‌ వర్సెస్‌ A2 03:30 షార్జా సూపర్‌ 12
37 నవంబరు 5 ఇండియా వర్సెస్‌ B1 07:30 దుబాయ్‌ సూపర్‌ 12
38   నవంబరు 6 ఆస్ట్రేలియా వర్సెస్‌ వెస్టిండీస్‌ 03:30 అబుదాబి సూపర్‌ 12
39 నవంబరు 6 ఇంగ్లండ్‌ వర్సెస్‌ సౌతాఫ్రికా 07:30 షార్జా సూపర్‌ 12
40 నవంబరు 7 న్యూజిలాండ్‌ వర్సెస్‌ అఫ్గనిస్తాన్‌ 03:30 అబుదాబి సూపర్‌ 12
41
 
నవంబరు 7 పాకిస్తాన్‌ వర్సెస్‌ B1 07:30 షార్జా సూపర్‌ 12
42   నవంబరు 8 ఇండియా వర్సెస్‌ A2 07:30  దుబాయ్‌ సూపర్‌ 12
43 నవంబరు 10 సెమీ ఫైనల్‌-1 07:30 అబుదాబి ప్లే ఆఫ్‌
44 నవంబరు 11 సెమీఫైనల్‌-2 07:30 దుబాయ్‌ ప్లేఆఫ్‌
45 నవంబరు 14 ఫైనల్‌ 07:30 దుబాయ్‌ ఫైనల్‌
 

చదవండి: T20 World Cup 2021: ఈ ఐదు తొలిసారిగా.. సరికొత్తగా.. ఆసక్తికర విశేషాలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement