
అల్ అమారత్: ఒమన్ క్రికెట్ జట్టు అరుదైన, చెత్త రికార్డును నమోదు చేసింది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా స్కాట్లాండ్‌తో మంగళవారం జరిగిన తొలి మ్యాచ్‌లో ఆ జట్టు 17.1 ఓవర్లలో 24 పరుగులకే కుప్పకూలింది. ఖావర్ అలీ (15) టాప్ స్కోరర్‌గా నిలవగా... ఆరుగురు బ్యాట్స్‌మెన్ అయితే ఖాతా తెరవలేదు. మిగతా బ్యాట్స్‌మెన్ 2, 2, 1, 1 చొప్పున పరుగులు చేశారు. అనంతరం స్కాట్లాండ్ 3.2 ఓవర్లలో 26 పరుగులు చేసి విజయాన్నందుకుంది.
అయితే ఈ మ్యాచ్‌కు అంతర్జాతీయ వన్డే హోదా లేదు. దీనిని దేశవాళీ వన్డే (లిస్ట్–ఎ) మ్యాచ్‌గానే పరిగణిస్తున్నారు. ఒమన్ చేసిన 24 పరుగులు ఓవరాల్‌గా లిస్ట్ ‘ఎ’లో నాలుగో అత్యల్ప స్కోరుగా నమోదైంది. గతంలో వెస్టిండీస్ అండర్–19 టీమ్ (18 పరుగులు), సరకెన్స్ సీసీ (19), మిడిల్‌ఎసెక్స్ (23) ఇంతకంటే తక్కువ స్కోర్లు చేశాయి.
Comments
Please login to add a commentAdd a comment