ఐర్లాండ్‌కు ఒమన్ షాక్
రాణించిన మక్సూద్, ఆమెర్
ధర్మశాల: ఒమన్ లక్ష్యం 20 ఓవర్లలో 155 పరుగులు... 19 ఓవర్లలో జట్టు స్కోరు 141/7. ఇక గెలవాలంటే 6 బంతుల్లో 14 పరుగులు చేయాలి. ఈ దశలో నిలకడగా ఆడుతున్న ఆమెర్ అలీ (32)ని అవుట్ చేసి ఐర్లాండ్ మ్యాచ్‌ను తమవైపు తిప్పుకుంది. అయితే ఇక 2 బంతుల్లో 3 పరుగులు చేయాల్సిన దశలో సొరెన్‌సేన్ వేసిన ఐదో బంతి (నోబాల్)ని అందుకోవడంలో కీపర్ విఫలమయ్యాడు. దీంతో ఐదు పరుగులు వచ్చాయి. ఫలితంగా బుధవారం జరిగిన టి20 ప్రపంచకప్ క్వాలిఫయింగ్ మ్యాచ్‌లో ఒమన్ 2 వికెట్ల తేడాతో ఐర్లాండ్‌పై సంచలన విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఐర్లాం డ్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 154 పరుగులు చేసింది. విల్సన్ (38), పోర్టర్‌ఫీల్డ్ (29), స్టిర్లింగ్ (29) ఫర్వాలేదనిపించారు. స్టిర్లింగ్, పోర్టర్‌ఫీల్డ్ తొలి వికెట్‌కు 48 పరుగులు జోడించారు.
అన్సారి 3 వికెట్లు తీశాడు. తర్వాత ఒమన్ 19.4 ఓవర్లలో 8 వికెట్లకు 157 పరుగులు చేసి గెలిచింది. జీషన్ మక్సూద్ (38), ఖావర్ అలీ (34), జితేందర్ సింగ్ (24)లు రాణించారు. అలీ, మక్సూద్‌లు తొలి వికెట్‌కు 69 పరుగులు జోడించి శుభారంభాన్నిచ్చారు. మిడిలార్డర్ విఫలమైనా... చివర్లో ఆమెర్ అలీ ఒంటరిపోరాటం చేయడంతో ఒమన్‌కు అద్భుత విజయం దక్కింది. అమెర్ అలీకి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
నే టి క్వాలిఫయర్స్
స్కాట్లాండ్ vs జింబాబ్వే
మ. గం. 3.00 నుంచి
అప్ఘానిస్తాన్ vs హాంకాంగ్
రా. గం. 7.30 నుంచి
స్టార్‌స్పోర్ట్స్-1లో ప్రత్యక్ష ప్రసారం