
గల్ఫ్ డెస్క్: ఒమన్‌లో అంతర్జాతీయ ఐదవ యోగా దినోత్సవాన్ని నిర్వహించడానికి మన రాయబార కార్యాలయం ఏర్పాట్లు చేసింది. శుక్రవారం మస్కట్‌లోని ఒమన్ కన్వెన్షన్ అండ్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో యోగా దినోత్సవం నిర్వహించనున్నారు. ప్రవేశం ఉచితమే. ఒమన్‌లో ప్రతి ఏటా యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. యోగాకు ఉన్న ప్రత్యేకత వల్ల కేవలం భారతీయులే కాకుండా విదేశీయులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు.