
వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్ 2023లో భాగంగా ఒమన్‌తో జరుగుతున్న గ్రూప్-బి మ్యాచ్‌లో స్కాట్లాండ్ యువ ఆటగాడు బ్రాండన్ మెక్‌ముల్లెన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్‌లో మెక్‌ముల్లెన్ 92 బంతుల్లోనే శతక్కొట్టి, ఒమన్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. సెంచరీ తర్వాత మరింత వేగంగా ఆడిన మెక్‌ముల్లెన్ 121 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 136 పరుగులు చేసి ఔటయ్యాడు.
బ్రాండన్ మెక్‌ముల్లెన్ పేరు హిట్టింగ్ దిగ్గజం, న్యూజిలాండ్ మాజీ ఆటగాడు బ్రెండన్ మెక్‌కల్లమ్ పేరుకు దగ్గరగా ఉండటం, మెక్‌కల్లమ్ తరహాలో మెక్‌ముల్లెన్ కూడా విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడటం చూసి నెటిజన్లు ఈ స్కాటిష్ హిట్టర్‌ను మెక్‌కల్లమ్‌తో పోలుస్తున్నారు. ఈ మెక్‌ముల్లెన్ మెక్‌కల్లమ్ కంటే డేంజర్‌లా ఉన్నాడంటూ కితాబిస్తున్నారు. పైగా మెక్‌ముల్లెన్ బౌలింగ్‌లోనూ ఇరగదీశాడంటూ ప్రశంసిస్తున్నారు. కాగా, 23 ఏళ్ల మెక్‌ముల్లెన్.. స్కాట్లాండ్ తరఫున 11 వన్డేల్లో సెంచరీ, హాఫ్ సెంచరీ సాయంతో 326 పరుగులు చేసి.. బౌలింగ్‌లో ఓసారి 5 వికెట్ల ఘనతతో 17 వికెట్లు పడగొట్టాడు.
ఇదిలా ఉంటే, బులవాయో వేదికగా ఒమన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన స్కాట్లాండ్.. నిర్ణీత ఓవర్లలో 320 పరుగులు చేసి ఆలౌటైంది. బ్రాండన్ మెక్‌ముల్లెన్ (136) సూపర్ సెంచరీతో ఇరగదీయగా.. కెప్టెన్ రిచీ బెర్రింగ్టన్ (60) అర్ధసెంచరీతో రాణించాడు. ఒమన్ బౌలర్లలో బిలాల్ ఖాన్ 5 వికెట్లు పడగొట్టగా.. ఫయాజ్ బట్ 2, జే ఒడేడ్రా ఓ వికెట్ పడగొట్టారు.