పసికూన జింబాబ్వే సంచలనం సృష్టించింది. హరారే వేదికగా టీమిండియాతో జరిగిన తొలి టీ20లో జింబాబ్వే అద్భుత విజయం సాధించింది. వరల్డ్ ఛాంపియన్ భారత్‌ను 13 పరుగుల తేడాతో జింబాబ్వే చిత్తు చేసింది. 116 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని జింబాబ్వే బౌలర్లు కాపాడుకున్నారు.
జింబాబ్వే బౌలర్ల దాటికి భారత్ 102 పరుగులకే కుప్పకూలింది. జింబాబ్వే బౌలర్లలో కెప్టెన్ సికిందర్ రజా, చతరా తలా మూడు వికెట్లతో టీమిండియాను దెబ్బతీయగా.. బెన్నట్, మసకద్జా, జాంగ్వే తలా వికెట్ సాధించారు. భారత బ్యాటర్లలో కెప్టెన్ శుబ్‌మన్ గిల్(31) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. వాషింగ్టన్ సుందర్(27) తన వంతు ప్రయత్నం చేశాడు.
చరిత్ర సృష్టించిన జింబాబ్వే..
ఇక ఈ మ్యాచ్‌లో అద్భుత విజయం సాధించిన జింబాబ్వే ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకుంది. టీ20ల్లో భారత్‌పై అత్యల్ప టోటల్‌ను డిఫెండ్ చేసుకున్న జట్టుగా జింబాబ్వే నిలిచింది.
ఇంతకుముందు ఈ రికార్డు న్యూజిలాండ్ పేరిట ఉండేది. 2016లో నాగ్‌పూర్ వేదికగా భారత్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో 127 పరుగుల టార్గెట్‌ను కివీస్ డిఫెండ్ చేసుకుంది. తాజా మ్యాచ్‌తో కివీస్ ఆల్‌టైమ్ రికార్డును జింబాబ్వే బ్రేక్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment